Mangli vs Prabha:సోషల్ మీడియా వచ్చాక జానపదాలు వరల్డ్ వైడ్ గా ఎంత క్రేజ్ తెచ్చుకుంటున్నాయో చెప్పక్కర్లేదు.అయితే పాటలు ఎంత పాపులర్ అవుతున్నాయో వాటిని పాడిన సింగర్స్ కూడా అంతే పాపులర్ అవుతున్నారు.ఇక వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మంగ్లీ పేరు మొదటి స్థానంలో ఉంటుందని చెప్పక్కర్లేదు.
తనదైన గొంతులో ఎన్నో పాటల్ని పాడిన మంగ్లీ ఒక రకంగా ఫోక్ ఇండస్ట్రీని ఏలుతుందనే చెప్పాలి.అయితే ఇపుడు మంగ్లీ కి పోటీగా ప్రభ బంగారిగల్ల దూసుకొస్తుందని,ఒక దశలో మంగ్లీ పాడాల్సిన పాటలిపుడు ప్రభ దగ్గరికే వెళ్తున్నాయన్న టాక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
దాదాపు 370 మిలియన్ల వ్యూస్
మొదటగా మంగ్లీ పాడిన పాటల విషయానికి వస్తే తను ఎన్నో మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకున్నసంగతి మనకి తెల్సిందే. అందులో ప్రముఖంగా ఆడ నెమలి పాటని చెప్పుకోవాలి.కనకవ్వ తో కలిసి పాడిన ఈ పాటలో జానులిరితో మంగ్లీ కూడా స్టెప్పులేయడం విశేషం.ఇక కాసర్ల శ్యాం రాసిన ఈ పాట 2020AUG 30 న యూట్యూబ్ లో రిలీజ్ కాగా ఇప్పటికి ఈ పాట దాదాపు 370 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం.
ఇప్పటికి 188 మిలియన్ల వ్యూస్
ఇక ‘బాయిలోనే బల్లి పలికే’ నెట్టింటిని ఎలా షేక్ చేసిందో చెప్పక్కర్లేదు.కమల్ ఎస్లావత్ రాసిన ఈ పాటకి సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా శేఖర్ వైరస్ స్టెప్పులతో మరో లెవల్ కి తీసికెళ్ళాడు.ఇక మంగ్లీ ,నాగవ్వ తో కలిసి పాడగా ఈ పాట Nov 22, 2025 నెట్టింట్లోకి అడుగు పెట్టి ఇప్పటికి 188 మిలియన్ల వ్యూస్ ని దక్కించుకొని మంగ్లీ సత్తా ఏంటో ప్రూవ్ చేసింది.
ఏకంగా 802 మిలియన్లని దాటి దూసుకుపోతున్న పాట
ఇక అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీగా నటించిన అల వైకుంటపురంలో సినిమాలో అనురాగ్ కులకర్ణి తో కలిసి మంగ్లీ పాడిన రాములో రాములా పాట ఎంతలా వైరల్ అయ్యిందో చెప్పక్కర్లేదు,తమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట ఇప్పటికి ఏకంగా 802 మిలియన్లని దాటి దూసుకుపోతుంది అంటే ఆడియన్స్ మంగ్లీ వాయిస్ కి ఎంతలా ఫిదా అయ్యారో అర్థం అవుతుంది.
ఇక ఫిదా సినిమాలోని సారంగదరియా,ధమాకా లోని జింతాక్ చితాక్, బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు వంటి పాటలు కూడా మంగ్లీని మరో మెట్టు ఎక్కించినవే. అలా ఒకవైపు ఫోక్ సాంగ్స్ మరో వైపు సినిమాల పాటలు పాడుతూ దూసుకుపోతున్న మంగ్లీ బతుకమ్మ పాటల్లోనూ తానేంటో ప్రూవ్ చేసేసుకుంది.
మంగ్లీ ఇమేజ్ కాస్త డ్యామేజ్
అయితే ఇంత క్రేజ్ కొట్టేసిన మంగ్లీ గత కొంత కాలంగా వివాదాలకి కేరాఫ్ బిందువు అవుతుందన్న టాక్ వినిపిస్తుంది.ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ ఇష్యూ లో మంగ్లీ పేరు ప్రముఖంగా వినిపించడం,ఇక మంగ్లీ బర్త్ డే పార్టీ సందర్భంగా జరిగిన పార్టీలో పర్మిషన్ లేకుండా ఆల్కహల్ ఉందన్న వార్తలలతో మంగ్లీ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయినట్టే కనిపిస్తుంది. దీంతో మంగ్లీతో పెట్టుకోవడం ఎందుకని చాలా మంది ప్రభ బంగారి గల్ల వైపు దిక్కులు చూస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే 950మిలియన్ల వ్యూస్
ప్రభ బంగారి గల్ల పాటల విషయానికి వస్తే తను పాడిన రాను బొంబాయికి రాను పాట సోషల్ మీడియాని ఇప్పటికీ ఒక ఊపు ఊపుతుంది.రామూ రాథోడ్ రాయగా రామూ రాథోడ్ తో కల్సి పాడిన ఈ పాట Jan 23, 2025 యూ ట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 950మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది.ఇక తనే రాసి పాడిన ఓ పిలగ ఎంకటేషు పాట ఏకంగా 400 మిలియన్ల వ్యూస్ దాటేసి ప్రభకి మరింత పేరు తెచ్చింది.
ఏకంగా 177 మిలియన్ల వ్యూస్
ఇక నిమ్మతోట వనము అంటూ గతేడాది పాడిన పాట ఎంత వైరల్ అయిందో చెప్పక్కర్లేదు.ముఖ్యంగా ప్రభ గొంతుకు మాధురి రాథోడ్ స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళింది.అలా ఈ పాట ఇప్పటి వరకు ఏకంగా 177 మిలియన్ల వ్యూస్ ని దక్కించుకోవడం విశేషం.
227మిలియన్ల వ్యూస్ ని సొంతం
అయితే ఫోక్ సాంగ్స్ మాత్రమే కాకుండా తాజాగా వచ్చిన ప్యారడైజ్ సినిమాకోసం పాడిన ఏష నాగుల కట్ట మీద అంటూ పాడిన పాట ప్రభ ని ఒక్కసారిగా టాప్ రేంజ్ లో కూర్చోబెట్టింది.227MAug 29న వచ్చిన ఈ పాట 227మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం.
అయితే ఈ పాట మంగ్లీ యే పాడాల్సి ఉన్నప్పటికీ అనుకోని కారణాల వల్ల ప్రభ పాడిందన్న టాక్ వినిపిస్తుంది.ఏది ఏమైనా ఇపుడు మంగ్లీ కి ప్రభ గట్టి పోటీ ఇస్తుందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మరి ముందు ముందు ఈ ఇద్దరిలో ఎవరు మరిన్ని మంచి పాటలతో మన ముందుకు వస్తారో వేచి చూద్దాం !
ALSO READ:అప్పుడు గాజులు గల గల ..ఇప్పుడు ఇరుముడి కట్టు ..అస్సలు తగ్గట్లేదుగా !