E-Paper
Advertisement

బిగ్ బాస్ లో సుధీర్‌ను గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మి స్పెషల్ రిక్వెస్ట్!

బిగ్ బాస్ లో సుధీర్‌ను గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మి స్పెషల్ రిక్వెస్ట్!
Advertisement

Bigg Boss 10 Sudheer:సుధీర్‌ టాక్స్ అంటూ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఫేమస్ అయిన సుధీర్ రెడ్డి తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 10’ హౌస్‌లోకి 4వ కంటెస్టెంట్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే.ఇక తనదైన ఆట తీరుతో ఇప్పటికే ఎంతో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు .ఇక ఎంతో మంది సుధీర్ కి వోటు వేసి గెలిపించండి అని సపోర్ట్ చేస్తున్నారు కూడా.

ఇక ఈ క్రమంలోనే జిమ్ జిమ్ తారా జిమ్ జిమ్ తారా జిలేబి తేరా చిన్నోడా అంటూ పాటతో ఓవర్ నైట్ క్రేజ్ కొట్టేసిన లక్ష్మీ దేవీ కూడా ఇపుడు సుధీర్ ని సపోర్ట్ చేస్తూ పోస్ట్ వదిలింది.మన రాయలసీమ ముద్దు బిడ్డ సుధీర్ చాలా మంచివాడని,అతడికి అందరూ వోటు వేయాలని,మంచి వాడైన సుధీర్ ని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పెషల్ గా అప్పీల్ చేసింది.

Advertisement

ఇక జిమ్ జిమ్ తార పాట పాడిన సింగర్ విషయానికి వస్తే ఆవిడ పూర్తి పేరు గోకుల లక్ష్మీదేవి.అయితే సోషల్ మీడియాలో ఆమెని లక్ష్మీ ఆంటీగా పిలుస్తు తమ అభిమనాన్ని ప్రదర్శిస్తున్నారు నెటిజన్లు.ఇక ఈవిడ రాయలసీమ లోని కర్నూల్ ప్రాంతానికి చెందినదని తెలుస్తుంది.అయితే ఇపుడు బాగా పాపులర్ అయిన జిమ్ జిమ్ తార..జిలేబి తేరా చిన్నోడా పాట మాత్రమే కాదండోయ్ ….గతంలో అత్తరు సాయిబో రారా అంటూ మరో పాటని కూడా పాడి వార్తల్లో నిలిచింది.బహుశా అప్పట్లో ఇప్పుడున్నంత సోషల్ మీడియా లేని కారణంగా ఇంతగా వైరల్ అవ్వలేదు కాబోలు.

ఇక కేవలం ఫోక్ టచ్ ఉన్న పాటలు మాత్రమే కాకుండా భక్తిగీతాలని కూడా ఈవిడ పాడుతుందని తెలుస్తుంది.ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పాట సింపుల్ గా ఈజీగా క్యాచీగా పాడుకునేందుకు అనువుగా ఉండటం వల్లే నెటిజన్లు ఈ పాటని ఎక్కువగా ఇష్టపడేందుకు కారణం అని తెలుస్తుంది.దీనికి తోడు లక్షీ అంటి పాడే తీరు, ఆమె గొంతులో ఉన్న స్పెషాలిటీ వల్ల ఈ పాట కి ఒక యునిక్ నెస్ వచ్చిందని చెప్పాలి.

Advertisement

ఇక సుదీర్ విషయానికి వస్తే సుధీర్ రెడ్డి విషయానికి వస్తే..ప్రముఖ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఆదాన్ మీడియా, సుధీర్ టాక్స్ ద్వారా యాంకర్‌గా మంచి గుర్తింపు పొందారు. సుధీర్ రెడ్డి. ఏపీలోని రాయలసీమకు చెందిన సుధీర్ రెడ్డి ఎంతోమంది వ్యాపారవేత్తలను సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్ రెడ్డి ఇప్పుడు బిగ్ బాస్ 10 లో కంటెస్టెంట్ గా అదరగొడుతుండటంతో ఈసారి టైటిల్ విన్నర్ సుధీర్ రెడ్దీనే అంటూ ఇప్పటి నుండే కాలర్ ఎగరేస్తున్నారు సుధీర్ ఫాన్స్ ,చూడాలి మరి వీరి ఆశలు నెరవేరుతాయో లేదో !

Tags

Related News

మంగ్లీ వర్సెస్ ప్రభ.. ఫోక్ సాంగ్స్‌లో అసలు వార్ మొదలైందా?

వీధికొక రాక్షసులు ఉన్నారు.. రాజకీయ నాయకులపై మురళీమోహన్ కామెంట్స్!

యాంకర్ స్రవంతి చొక్కారపు నెల సంపాదన ఎంతో తెలుసా?

చిన్నపిల్లల ఇంజక్షన్ ధరపై నిజాలు చెప్పిన మురళీమోహన్!

దానాలు చేయడంపై.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!

జీవితసత్యం చెప్పిన మురళీమోహన్.. మరి ఎందుకు ఈ పాకులాట!

అప్పుడు గాజులు గల గల ..ఇప్పుడు ఇరుముడి కట్టు ..అస్సలు తగ్గట్లేదుగా !

Big Stories

Advertisement
×