Intinti Ramayanam Today Episode November 7th : నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే… పల్లవి ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు. పార్వతి నేను పల్లవి తల్లయిందని సంతోషించాను కానీ హాస్పిటల్ కు తీసుకెళ్లాలనే ఆలోచననే లేదు. అవని మంచి పని చేసిందని చెప్పింది. డాక్టర్ ను పిలిచి అని ఇక అందరు అవనిని పొగుడుతారు. ప్రణవి కూడా వదినంటే అది అని చెబుతుంది. ఇక దానికి అక్షయ్ అబద్దాలు చెబుతుంది అని మనసులో అనుకుంటుంది. ఇక డాక్టర్ పల్లవిని చెక్ చేసి ప్రగ్నెంట్ అని చెబుతుంది. ఇక అందరు హ్యాపిగా ఫీల్ అవుతారు. ఇక రాజేశ్వరి కి ఫోన్ చేసి విషయం చెబుతుంది.. చక్రధర్ తో ఆ విషయం చెప్పగానే షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో దీపావళి పండుగ కావడంతో ఇల్లంతా దీపాలను పెట్టి అలంకరిస్తారు. అప్పుడే పల్లవికి ఫోన్ వస్తుంది. చక్రధర్ పల్లవి పై సీరియస్ అవుతాడు. నువ్వు కడుపుతో ఉన్నావని ఇంట్లో అందరికీ ఎందుకు చెప్పావు మీ అమ్మ నాకు ఈ విషయం చెప్పింది మీ అత్తయ్య చెప్పిందని నిజమేనా అని అడుగుతాడు. అవును డాడీ నిజమే ఈ విషయం ఇంట్లో తెలిసిపోయింది అని చెప్తుంది పల్లవి. ఆ ఇంటిని నాశనం చేయాలని వెళ్లావు ఇప్పుడు ఆ ఇంటి వారసున్ని నువ్వు కనియ్యాలని అనుకుంటున్నావా అసలు ఏం చేస్తున్నావో బేబీ నాకు అర్థం కావట్లేదని చక్రధరంటాడు. నాకు వాంతులు అవుతుంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని కిట్ ని ఆర్డర్ పెట్టాను. ఆ అవని నా వెనకాల షాడో లెక్క తిరుగుతుంది. నేను టెస్ట్ చేసుకోవడం అవన్నీ చూసేసింది. ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పేసింది. వాళ్లందరికీ సంతోషం కలిగేలా నువ్వు వారసుని కలిగిస్తావని చక్రధర్ పల్లవిని అడుగుతాడు. కడుపుతో ఉన్నా అని మాత్రమే తెలుసు ఆ వారసుడు కడుపులోని మాయమగుతాడని వీళ్ళు ఎవరికీ తెలియదని పల్లవి అంటుంది. పల్లవి ఫోన్ మాట్లాడడం అవని వింటుంది. అది చూసిన పల్లవి ప్రెగ్నెంట్ అని విష్ చేయడానికి డాడ్ కాల్ చేశాడని చెప్పి వెళ్ళిపోతుంది. దానికి అవని ఇంటి వారసుడి లేకుండా చేయాలని చూస్తున్నారు అది జరగనే జరగదని మనసులో అనుకుంటుంది..
అక్షయ్ఇష్టమైన బాంబులు తీసుకుని వచ్చానమ్మా మనిద్దరం బాంబులు కాల్చుకుందాం రా అనేసి అడిగితే ఆరాధ్య నువ్వు మమ్మీకి సారీ చెప్పావా.. నాకు మమ్మీ చెప్పలేదే మమ్మీ కి సారీ చెప్పిన తర్వాతే నాతో మాట్లాడు అని అక్షయ్ తో అంటుంది. నేను మమ్మీ కి సారీ చెప్పాను అమ్మ మమ్మీ కూడా సారీ ని యాక్సెప్ట్ చేసింది అని అంటుంది.. ఇక అవని దీపాలు పెడుతుంటే ఆరాధ్య అక్షయ్ అక్కడికి వస్తారు.. మమ్మీ నీకు డాడీ సారీ చెప్పాడా? నువ్వు నాకు చెప్పలేదు ఏంటి మరి అనేసి అడుగుతుంది ఆరాధ్య. అప్పుడు అవని నాకు మీ డాడీ సారీ చెప్పలేదని చెప్తాడు చెప్తుంది. మర్చిపోయినట్టుంది మీ మమ్మీ అనేసి అక్షయ్ మళ్లీ ప్రపోజ్ చేసి సారీ చెప్తాడు. అది చూసిన పల్లవి షాక్ అవుతుంది. ఇక ఇంట్లో అందరూ బాంబులు కాలుస్తూ దీపావళి సంబరాలు చేసుకుంటారు. కోమలీని పార్వతి మీ ఆయన ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. దానికి కోమలి వస్తాడులే అమ్మ ఏదో బిజీగా ఉంటాడనేసి అంటుంది. అప్పుడే వినోద్ అక్కడికి వస్తాడు. కోపంగా అందరితో మాట్లాడతాడు. ఏమైందని పార్వతి అడుగుతుంది. నేను ఈరోజు ఆఫీస్ పని మీద ఒక ఆమెతో మాట్లాడుతుంటే తన అనుమానంతో ఆమె దగ్గరకు వచ్చి ఆమెను కొట్టి ఇది చేసిందని చెబుతాడు. దీని అనుమానంతో నాకు ఒక ఇన్వెస్టర్ వెళ్ళిపోయాడని వినోద్ చెప్తాడు. దీని అనుమానంతో నా జీవితమే సర్వనాశనం అయిపోయింది.
ఇక దీని భరించడం నావల్ల కాదు అని అంటాడు. అప్పుడు కోమలి ఈయన అబద్ధం చెప్తున్నాడు. ఎవరైనా కాఫీ షాపుల్లో బిజినెస్ గురించి మాట్లాడతారా ఈయన గర్ల్ ఫ్రెండ్ ని పిలుచుకొని మాట్లాడుతున్నారు నేను విన్నాను అనేసి అంటుంది. దానికి అక్షయ్ బుద్ధుందా నీకు కొంచమైనా పబ్లిక్ పేస్ లలో ఎలా మాట్లాడుతారు కాఫీ షాపులను లేకపోతే ఏదైనా రెస్టారెంట్లను మాట్లాడతారు గాని అని అనగానే కోమలి షాక్ అవుతుంది. ఇక వినోద్ నాకు కోమలి అవసరం లేదు అని తెగేసి చెప్తాడు. మీ అమ్మాయి నాకు అవసరం లేదు నేను విడాకులు పంపిస్తాను సైన్ పెట్టమని వెళ్ళిపోతుంటాడు. వినోద్ ఆగు అని అవని మాట్లాడుతుంది. చివరగా ఒక అవకాశం ఇవ్వు ఇంకెప్పుడూ ఇలా చేయదు అని అవని అంటే వినోద్ సారి అక్క నన్ను క్షమించు నీ మాట కూడా కాదని నేను వెళ్ళిపోతున్నా అని అంటాడు. ఇక అందరూ ఏడుస్తూ ఇంట్లో కెళ్ళిపోతారు. కోమలి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తారు. ఇక పల్లవి మాత్రం నాకు కావాల్సింది ఇదే అని సంతోషపడుతుంది..
ఇక రాజేంద్రప్రసాద్ ఇంటికి వస్తాడు. అందరూ సైలెంట్ గా ఉండడం చూస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. నాకు అబార్షన్ అవ్వకుండా మీరు ఏం టాబ్లెట్ ఇచ్చారో చెప్పాలి అని నిలదీస్తుంది. అవని నేను చెప్పమనిందని డాక్టర్ చెప్పగానే పల్లవి షాక్ అవుతుంది. అసలు ఈ హాస్పిటల్ కి అవని ఎందుకు వచ్చింది అనగానే వాళ్ళ అమ్మ కోసం వచ్చిందని సిస్టర్ చెప్తుంది. వాళ్ళమ్మ ఎవరు అని చూస్తుంది. అవని వాళ్ళ అమ్మని ఎలాగైనా దూరం చేయాలని పల్లవి ప్లాన్ ఏస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..