Viral Video: అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఎప్పుడూ ఎలా వస్తుందో తెలీదు గానీ వచ్చిందంటే ప్రణాలు మీదకే వస్తుంది. అదే గుండె పోటు.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇలా వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్‌లు రావడం ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తుంది. ఇక తాజాగా బస్సు నడుపుతుండగానే గుండె పోటుతో మరిణించాడు ఓవ్యక్తి.
బస్సు నిండా ప్రయాణికులు.. వేగంగా వెళుతోంది. ఇంతలోనే డ్రైవర్‌కి హార్ట్ ఎటాక్.. క్షణాల్లో స్టీరింగ్ వదిలేసి కుప్పకూలిపోయాడు.. వెంటనే అప్రమత్తమైన కండక్టర్ స్టీరింగ్‌ను తన చేతిలోకి తీసుకుని బస్సును ఆపి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. తాజాగా ఆ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పోరేషన్‌కు చెందిన బస్సు.. బుధవారం 10-11 గంటల సమయంలో నేలమంగళ అనే ఊరు నుంచి దసన్ పురా ఏరియాకు బయల్దేరుతుంది. ఈ బస్సును 40 ఏండ్ల వయసున్న కిరణ్‌కుమార్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు. హఠాత్తుగా మార్గం మధ్యలో అతనికి గుండె పోటు వచ్చింది. దీంతో స్టీరింగ్ వదిలేసి పక్కకు ఒరిగాడు. ఇది గమనించిన కండక్టర్ వెంటనే డ్రైవర్ ప్లేస్‌లోకి వచ్చి స్టీరింగ్‌ను ఆపేసి, వెంటనే సడన్ బ్రేక్ వేసి బస్సును పక్కకు ఆపాడు. అనంతరం అప్రమత్తమైన ప్రయాణికులు డ్రైవర్‌ను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Also Read: ఢిల్లీ మెట్రోలో కొట్లాట, నెట్టింట వీడియో వైరల్, అసలేం జరిగిందంటే?
అయితే అదే సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండెక్టర్‌ను పోలీసులు, బీఎంటీసీ యాజమాన్యం అతన్ని అభినందించారు. ఆ టైమ్‌లో కండక్టర్ సమయస్ఫూర్తికి అందరూ హాట్సాఫ్ చెబుతున్నారు. కిరణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి ఆర్థికసాయం చేస్తామని బీఎంటీసీ ప్రకటించింది. ప్రస్తుతం సీసీ పుటేజ్‌లో రికార్డు అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన కండక్టర్..#RTC #Driver #TeluguNews #BIGTVSwetchaDailyEPaper pic.twitter.com/bPduEDgA67
— BIG TV – Swetcha Daily epaper (@swetchadaily) November 7, 2024