Hyderabad News: హైదరాబాద్ సిటీలో అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపిస్తోంది హైడ్రా. శనివారం ఉదయం కొండాపూర్‌లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వం స్థలంలో ఏళ్ల తరబడి కబ్జా చేశారు కొందరు వ్యక్తులు. చివరకు దృష్టి సారించారు అధికారులు. కాపాడిన భూమి విలువ అక్షరాలా 720 కోట్ల రూపాయలు. మార్కెట్లో దీని విలువ రూ. 3,600 కోట్లు ఉంటుందని అంచనా.
హైదరాబాద్ సిటీలో హైడ్రా కూల్చివేతలు
ఒకప్పుడు నిత్యం పచ్చదనంతో కళకళలాడేది హైదరాబాద్ సిటీ. నగరం చుట్టూ చుట్టూ అందంగా లేక్‌లు ఉండేవి. వర్షాలు వచ్చినా నగరానికి ఎలాంటి సమస్య ఉండేదికాదు. రానురాను చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాదారుల వశమయ్యాయి. కొన్ని న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టుల నుంచి అనుమతులు రావడంతో వాటిపై కొరడా ఝులిపిస్తోంది.
తాజాగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో కొండాపూర్ ప్రాంతంలోని బిక్షపతి నగర్‌లో దాదాపు రూ.720 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసుకు సమీపంలో సర్వే నంబర్ 59లో 36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని చాలామంది వ్యక్తులు కబ్జా చేశారు. తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు.
ఆ భూమి దాదాపు రూ. 720 కోట్లు
ఈ స్థలంపై వివాదం రెండున్నర దశాబ్దాలుగా పోరాటం సాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఉదయం ఆక్రమణల తొలగించింది హైడ్రా. రెండురోజుల కిందట సమాచారం ఇచ్చింది. తాత్కాలిక షెడ్డులను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకున్న వారిని ఖాళీ చేయించింది.
ALSO READ: తెలంగాణలోని ఆ గ్రామాల్లో ఎన్నికలు బంద్
భారీ బందోబస్తు మధ్య అక్కడ షెడ్డులను తొలగించింది. కూల్చివేతల వద్దకు ఎవరినీ అనుమతించలేదు అధికారులు. రెండు కిలోమీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేసి స్థానికులు రాకుండా అడ్డుకున్నారు. అంతేకాదు భూమి చుట్టూ కంచె వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు పెట్టింది హైడ్రా. మరోవైపు 60 ఏళ్లుగా ఈ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని అక్కడివారు చెబుతున్నారు.
హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. దానిపై విచారణ చేపట్టిన తర్వాత అప్పుడు కూల్చివేతలకు దిగుతున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో దాదాపు రూ. 50 వేల కోట్ల విలువైన భూమిని కాపాడింది. 923 ఎకరాల ప్రభుత్వ భూమి. వరద భయం లేని నగరమే హైడ్రా లక్ష్యమని ఇటీవల కమిషనర్ తెలిపారు.
కొండాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్-కొండాపూర్ సర్వే నెంబర్ 59లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా
ఇటీవల సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రెండున్నర దశాబ్దాలుగా ఈ స్థలంపై కొనసాగుతున్న వివాదం
భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్న హైడ్రా సిబ్బంది pic.twitter.com/3pr7z9ULiu
— BIG TV Breaking News (@bigtvtelugu) October 4, 2025