Sanju Samson: టీమిండియా స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ ( Sanju Samson )…ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్లేయర్. కేరళ రాష్ట్రానికి చెందిన సంజు శాంసన్ కు సౌతాండియాలో బాగా పాపులారిటీ ఉంది. అదే సమయంలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ…వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో కూడా ఛాన్స్ దక్కించుకుని… అదరగొట్టాడు. అయితే.. అలాంటి సంజు శాంసన్ తాజాగా హెలికాప్టర్ లో మెరిసాడు. ఓ డాన్ రేంజ్ లో స్పెషల్ హెలికాప్టర్ లో ఊర మాస్ ఎంట్రీ ఇచ్చాడు. కేరళ ( Kerala) రాష్ట్రంలోని ఓ కాలేజీలో జరుగుతున్న ఈవెంట్ కు హజరుకావడం కోసం హెలికాప్టర్ లో( Sanju Samson Helicaptor) ఊర మాస్ ఎంట్రీ ఇచ్చాడు సంజు శాంసన్. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read: Shoaib Malik Divorce: మూడో భార్యకు కూడా షోయబ్ మాలిక్ విడాకులు..? సానియా మీర్జా పాపం తగిలిందా !
ఆసియా కప్ 2025 టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన సంజు శాంసన్ కేరళలో… చిన్న చిన్న ఈవెంట్ లో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మళ్లాపురం లో జరిగిన ఫుట్ బాల్ ఈవెంట్ కు వచ్చాడు సంజు శాంసన్. ఈ సందర్భంగా… హెలికాప్టర్ లోనే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న సంజు శాంసన్ కోసం ప్రత్యేకంగా కేరళ ప్రభుత్వం హెలికాప్టర్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ తరహాలో… ప్రయాణించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.
ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆసియా కప్ 2025 ఫైనల్ లో అద్భుతంగా రాణించి జట్టును గెలిపించిన తిలక్ వర్మకు ఇలాంటి ఎంట్రీ ఎక్కడా లభించలేదని కామెంట్ చేస్తున్నారు. కానీ.. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో త్వరగానే అవుట్ అయిన సంజు శాంసన్ కు మాత్రం హీరో రేంజ్ ఎంట్రీ లభించిందని అంటున్నారు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య త్వరలోనే వన్డే సిరీస్ జరుగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 19వ తేదీ నుంచే టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ల నేపథ్యంలో ఇవాళ టీమిండియా జట్టును ప్రకటించనున్నారు. అయితే ఈ జట్టులోకి సంజు శాంసన్ కు అవకాశం రానుందని అంటున్నారు. రిషబ్ పంత్ ఇంకా కోలుకోలేదు కాబట్టి సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే, తుదిజట్టులోకి కేఎల్ రాహుల్ ఉంటాడు కాబట్టి బ్యాకప్ కీపర్ గా మాత్రం సంజు శాంసన్ ను తీసుకోనున్నారట.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
?igsh=MWdzMTQzdWVlNnEy
Sanju Samson was welcomed by Keralites after the World Cup champion brought the Asia cup for the nation.
………
Only Tilak Varma got such a kind of welcome in Hyderabad. I hope the CM of Kerala will treat him in the way Tilak was treated by CM Telangana pic.twitter.com/RYLEfawS49— Indian Funda (@Safehands_Sanju) October 3, 2025