Intinti Ramayanam Today Episode September 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ భోజనం తెచ్చుకోలేదని వాళ్ళ బాస్ అవనితో ఫోన్ మాట్లాడుతుంది.. మేమిద్దరం కలిసి భోజనానికి ఇంటికి వస్తున్నామని చెప్తుంది.. అక్షయ్ తను బాస్ తో కలిసి స్వరాజ్యం ఇంటికి వెళ్తాడు. అయితే ఆమెకు డౌట్ వచ్చి అదేంటి అక్షయ్ మీరు ఉన్నది వేరే ఇల్లు కదా ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది. నేను నా భార్య తమ్ముళ్ళతో కలిసి ఉండట్లేదు మేడం. మా నాన్న మా అమ్మ ఇక్కడ ఉంటారు. అక్కడ ఉంటారు అని అంటాడు. అదేంటి అని ఆమె ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అడుగుతుంది. అని అక్షయ్ మాత్రం ఇది నా పర్సనల్ విషయం మేడం దయచేసి అడగకండి అని అంటాడు. అవని వంటలకు బాస్ ఫిదా అవుతుంది. వీళ్ల సంతోషాన్ని చూసి పల్లవి ఓర్వలేక విడగొట్టాలని ప్లాన్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. అక్షయ్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక అమ్మాయిని రమ్మని పిలుస్తుంది పల్లవి. ఆ అమ్మాయికి భారీగా డబ్బు ఆఫర్ చేసి అక్షయ్ అవని కలిసి లేరని మీ బాస్ కి తెలియజేయాలని చెప్తుంది. ఆ అమ్మాయి అలానే అని ఒప్పుకుంటుంది.. అయితే వాళ్ళందరూ అవన్నీ చేసిన వంటల గురించి మెచ్చుకుంటూ ఉంటారు. అవని ఏం చేసినా సరే చాలా బాగా ఉంటుంది. అందుకే వీళ్ళిద్దరి ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటారని అబద్ధాలు మీద అబద్ధాలు చెప్పేస్తారు. అక్షయ్ కూడా కావాలనే బలవంతంగా అవని తో కలిసి ఉన్న విషయాన్ని బయట పెట్టకుండా ఒప్పుకుంటాడు.
మీ బాస్ ముందర నటించాలంటే కష్టంగా ఉండండి నిజం చెప్పొచ్చు కదా మీరు అని అవని అంటుంది. ఇక చాముండేశ్వరి ఆఫీస్ లోని ఒక అమ్మాయి అక్షయ్ అవనీలు కలిసి లేరని అసలు నిజం అని బాస్ కి చెప్పేస్తుంది. దీన్ని బాస్ నమ్మినట్లు నమ్మినట్లు పల్లవికి చెప్తుంది.. అసలు అక్షయ్ నాకెందుకు అబద్ధం చెప్పాడు అది ఆలోచిస్తూ ఉంటుంది చాముండేశ్వరి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అడగాలి అనుకుంటుంది. ఆ తర్వాత అక్షయ్ ఏదో ఫైల్ కోసం వస్తాడు. అది చూస్తున్న చాము అక్షయ్ అపద్దం చేస్తున్నాడా? లేదా అని తెలుసుకోవడం చేస్తుంది.
అక్షయ్ మీ పెళ్లి ఎలా జరిగింది.. ప్రేమ, పెద్దలు చేసిన పెళ్లినా అని అడుగుతుంది. ఈవిడ ఏంటి నాకు ఎప్పుడు చుక్కలు చూపిస్తుంది అని అనుకుంటాడు. ప్రేమ పెళ్లి మేడమ్ అని చెప్తాడు. అవని బాగా చూసుకుంటుందా అని అంటాడు. బాగా చూసుకుంటుంది మేడమ్ అని అంటాడు. ఇక చాము వరుసగా ప్రశ్నలను అడిగి తెలుసుకుంటుంది. ఇష్టమైన కలర్, ఫుడ్ అన్నీ అడుగుతుంది. కానీ అక్షయ్ తెలియదు అనగానే షాక్ అవుతుంది.
Also Read:
అక్షయ్ ఎందుకు అబద్దం చెప్పాడు అని అనుమాన పడుతుంది. కచ్చితంగా ఈ విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక తర్వాత అవనిని అడగాలని అనుకుంటుంది.. మొత్తానికి పల్లవి ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక రాత్రి అవని బయటకు వెళ్తుంది. ఎదురుగా కారులో భరత్ రావడం చూసి షాక్ అవుతుంది. నీకు ఈ కారు ఎక్కడిది. ఎవరిచ్చారు. మధ్యలో వచ్చినవి ఎందుకు.. ఆశలు పెట్టుకోకూడదు అని అంటుంది. వెనకాల ఉన్న పల్లవి దిగి కిందకు వస్తుంది. భరత్ తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి భరత్ కి ఏం తక్కువ అని అడుగుతుంది. మా ఇంటి అల్లుడుకు ఆ మాత్రం కారు ఇవ్వలేనా? భరత్ నీకు మాత్రమే కాదు నాకు కూడా తమ్ముడే. అని పల్లవి అంటుంది. ఆ మాట వినగానే నా తమ్ముడిని కూడా మార్చేశావా? నీకు అస్సలు బుద్దిలేదా ని అడుగుతుంది. పల్లవి సిస్టర్ చాలా మంచి వ్యక్తి. ఏమి అనొద్దు అక్కా అని భరత్ అనగానే షాక్ అవుతుంది. అక్కడితో ప్రోమో అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..