 
					Intinti Ramayanam Today Episode October 31st: నిన్నటి ఎపిసోడ్ లో..పల్లవి కమల్ చెప్పిన పనులన్నీ చేయాలని అనుకుంటుంది. బయట కూరగాయలు మూసుకొని వస్తుంటే ఎదురుగా తన ఫ్రెండు రావడం చూసి ఇది గనక నన్ను చూస్తే కచ్చితంగా అందరికీ చెప్పేస్తుంది. నా పరువు పోతుంది అని మేనేజ్ చేస్తుంది.. ఒక కారు పక్కన నిలబడుకున్న పల్లవిని చూసిన ఫ్రెండ్ కారు చాలా బాగుంది మీదేనా అని అడుగుతుంది. నేను ఏ కార్నైనా ఒక సంవత్సరం నుంచి వాడను కదా అందుకే కొత్త కారు కొన్నాను అని పల్లవి అంటుంది. సరేగాని మీ హస్బెండ్ ఏం చేస్తారు అని తన ఫ్రెండ్ అడగగానే మా హస్బెండ్ యూఎస్ కంపెనీకి సీఈఓ అని గొప్పగా చెప్తుంది. పల్లవి ఫ్రెండ్ దగ్గర కమల్ పరువు తీసేస్తాడు. దాన్ని ఇంట్లో చెప్పి పెద్ద రచ్చ చేస్తుంది పల్లవి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..నువ్వు చేస్తున్న పని కరెక్టే కన్నయ్య నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పనిలేదు అని అవని కమల్ తో అంటుంది. ఇక భానుమతి ఇంట్లో వాళ్ళందరికీ ఆవకాయ అన్నం కలిపి గోరుముద్దలు పెడుతుంది. అందరూ చాలా బాగుంది అంటూ లొట్టలేసుకుంటూ తింటారు. చాలా చక్కటి భోజనం పెట్టారు అత్తయ్య చాలా మంచి పని చేశారు చాలా సంతోషంగా ఉన్నాము అని అంటారు పార్వతి. బామ్మ ఇలానే రోజు పెట్టవే చాలా బాగుంది అని కమల్ అంటాడు. ఇలానే రోజు తింటే మోషన్స్ అవుతాయి రా ఎదవ అని భానుమతి అంటుంది. మొత్తానికి కుటుంబం మొత్తం ఒకచోట చేరి చాలా సంతోషంగా ఉంటారు.
ఆరాధ్య మన కుటుంబం యొక్క ట్రీ ని నేను మేడం చేయమంటే డ్రా చేసి తాతయ్య ఎలా ఉందో చూడు అని ఇస్తుంది. అది చూసి ఫ్యామిలీ ట్రీ చాలా బాగుందమ్మా నువ్వు చాలా బాగా డ్రా చేసావు వెరీ గుడ్ అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. అందరూ ఆరాధ్య వేసిన ట్రీ ని చూసి సంతోషంగా మురిసిపోతారు. అది మాత్రం ఇందులో శ్రియ పిన్ని అమ్మానాన్న గురించి మా అమ్మ నాన్న గురించి రాశావు మరి మీ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న గురించి ఎందుకు రాయలేదు అని పల్లవి అంటుంది.
ఈ మాట విన్న ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. మీ అమ్మానాన్న గురించి ఎందుకు చెప్పలేదు అక్క మీ కూతురుకి ఎవరో చెప్పినట్టే తన పేర్లు కూడా రాసేది కదా అని పల్లవి అవమానిస్తుంది.. అమ్మ నాన్న లేకుండా ఎలా పుట్టావు అన్నట్లుగా దారుణంగా మాట్లాడుతుంది.. ఆ తర్వాత అక్షయ్ కూడా పల్లవికి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇస్తాడు.. ఏంటి నీకు తెలియకుండానే మాట్లాడుతున్నావా అవని అనాధని తెలిసే కదా నేను పెళ్లి చేసుకున్నాను మళ్లీ ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటి అని అంటాడు.
అనాధలకి ఏం తెలుసు అన్ని విలువలు అని పల్లవి కావాలని అవని బాధ పెట్టేలా మాట్లాడుతుంది. కమల్ తో సహా అందరూ పల్లవిని తిడతారు. అవని గదిలోకొచ్చి వాళ్ళ అమ్మ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.. పల్లవి అన్నదంట తప్పు లేదు కదండీ.. అమ్మ ఉండి కూడా నేను చూసుకోలేకపోతున్నానే అని బాధ నాకు లోలోపల తినేస్తుంది అని అంటుంది. మీ అమ్మ ఉందని చెప్పావు కదా మరి ఎక్కడుందో తీసుకొని రా ఇక్కడే ఉంటుంది కదా మనతోపాటే అని అక్షయ్.
అవని భరత్ ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మని చూడడానికని వెళ్తారు. కానీ అక్కడ ఆమె ఉండకపోవడంతో షాక్ అవుతారు. పక్కింటి వాళ్ళని అడిగి ఏమైంది అని తెలుసుకుంటారు.. మనం అమ్మని చూడ్డానికి వచ్చినట్టు అమ్మ కూడా మనల్ని చూడ్డానికి వెళ్ళిందేమో.. అక్కడ ఎవరూ తెలియదు కదా ఎక్కడైనా టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు అక్క మన ఫోన్ నెంబర్లు కూడా రాసిచ్చాను అమ్మ ఎవరితోనైనా ఫోన్లు చేపిస్తుందిలే అని అంటాడు. ఇక వాళ్ళమ్మ ఎక్కడికి వెళ్లిందో అని అవని టెన్షన్ పడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అక్షయ్ చాలా సంతోషంగా ఇంటికి వచ్చి నాకు జాబ్ వచ్చిందని చెప్తాడు.. అందరూ అక్షయ్ కి జాబ్ రావడంతో సంతోషంగా ఉంటారు.. ఏం జాబ్ వచ్చింది అని అడగ్గాని ఫీల్డ్ ఆఫీసర్ జాబ్ వచ్చింది అని అక్షయ్ చెప్తాడు.. ఆ మాట వినగానే శ్రియ అది ఇంటింటికి వెళ్లి బిల్స్ ని కలెక్ట్ చేసుకునే జాబు ఇది ఒక జాబ్ అని వెటకారంగా మాట్లాడుతుంది. మీ ఆయన ఏదో పెద్ద లాయరు సుప్రీంకోర్టు జడ్జ్ అయినట్టు మాట్లాడుతున్నావే అంత పెద్ద లాయర్ ఏంటి ఈపాటికి పాతికమంది ఇంటి దగ్గర క్యూ కట్టే వాళ్ళు కదా అని అంటాడు.
Also Read : మీనాను గుద్దేసిన ప్రభావతి.. బాలును ఇరికించేసిన మీనా.. మనోజ్ కు దిమ్మతిరిగే షాక్..
ఎవరిని ఎప్పుడు అవమానించకూడదు అని పార్వతి అంటుంది. ఇక పల్లవి శ్రియాలకు బుద్ధి చెప్పేలా అవని క్లాస్ పీకుతుంది.. ఇక చక్రధర్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు.. అక్కడ తన చెయ్యి మీద ఉన్న టాటూ ని చూసి ఏంట్రా ఈ టాటూ కొత్తగా బాగుంది కదా అనేసి అడుగుతాడు.. తన మొదటి భార్య గుర్తుగా ఈ టాటో ఉంది అని అంటాడు.. రాజేశ్వరి టాటు మీద టీ పోస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి…