 
					రాహుల్ ఇంట్లో గొడవ పడి తన గర్ల్‌ఫ్రెండ్ దగ్గరకు లగేజీతో వెళ్లిపోతాడు. రాహుల్ ను చూసిన కోయిలీ షాక్ అవుంతుంది. వీడేంటి స్వప్నతో విడాకులు తీసుకుని ఆ పేపర్స్ తో వస్తాడనుకుంటే.. ఇలా సూట్‌కేసుతో వచ్చేశాడేంటని రంజీత్‌తో చెప్తుంది. ఇంతలో దగ్గరకు వచ్చిన రాహుల్ కోయిలీ వచ్చేశాను.. కోయిలీ.. నీ కోసం నా భార్యను ఆ ఇంటిని శాశ్వతంగా వదలేసుకుని వచ్చేశాను అని చెప్తాడు. దీంతో కోయిలీ షాకింగ్ గా ఏంటి రాహుల్ నువ్వు చెప్పేది. ఇల్లు వదిలి వచ్చేశావా..? అని అడుగుతుంది. దీంతో రాహుల్ అవును కోయిలీ స్వప్నతో కలిసి కాపురం చేయలేను.. తనంటే నాకు ఇష్టం లేదని అందరి ముందు కరాకండిగా చెప్పేశాను. కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ నన్ను కానీ నా మనసును కానీ అర్థం చేసుకోవడం లేదు అందుకే ఆ ఇంటితో తెగదెంపులు చేసుకుని వచ్చేశాను అని చెప్పగానే..
కోయిలీ ఇరిటేటింగ్ గా చూస్తూ.. వీడేంటి ఇలా చేశాడు. వీడు ఆ ఇంట్లో ఉంటేనే కదా కోట్ల ఆస్తి నాకు సొంతం అవుతుంది. అవన్నీ లేకపోతే ఈ అడుక్కు తినేవాడు నాకెందుకు.. అని మనసులో అనుకుంటుంది. మన ప్రేమని వాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కోయిలీ అందుకే నీ కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదని నిరూపించడానికి వదిలేశాను అని రాహుల్ చెప్పగానే.. అదేంటి రాహుల్ అలా అంటావు స్వప్నకు విడాకులు ఇచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నావు అంటే పెద్ద వాళ్లు ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. అంత మాత్రానా బంధాలను తెంచుకుంటావా..? చెప్పు.. నా పరిస్థితి చూడు.. నాకు కోట్ల ఆస్థి ఉన్నా అమ్మా నాన్న లేరు. నాకు ఉన్నది ఒక్కే ఒక్కడు మా మామయ్య. నిన్ను పెళ్లి చేసుకున్నాక నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అవుతుందని ఎంత ఆశ పడ్డానో తెలుసా..? ఇలా డిస్సపాయింట్ చేశావేంటి..? రాహుల్.. అంటుంది.
దీంతో రాహుల్.. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది. దీని కోసం అందరినీ వదిలేసి వచ్చానంటే ఎగిరి గంతేస్తుంది అనుకుంటే ఇలా ట్విస్టు ఇచ్చిందేంటి..? అని మనసులో అనుకుంటాడు. నిన్ను ప్రేమించింది కూడా నీ ఫ్యామిలీని చూసే.. అని కోయిలీ చెప్పగానే.. రాహుల్ షాకింగ్ గా వాట్ అంటాడు. దీంతో కోయిలీ అదే రాహుల్ మీ ఫ్యామిలీలో నీకొక అమ్మ ఉంది. అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య ఉన్నారు. కానీ వాళ్లెవ్వరూ నాకు లేరు.. వాళ్లందరూ నా వాళ్లు అవుతారు అనుకున్నాను.. అని చెప్పగానే.. కానీ నాకు మాత్రం నువ్వు ఒక్కదానివే చాలు కోయిలీ అంటాడు రాహుల్. దీంతో ఎందుకు అడుక్కు తినడానికా..? అని మనసులో అనుకుంటుంది.
నువ్వు అనుకున్నట్టు వాళ్లందరూ ఉంటే సంతోషంగా ఉంటుంది అనుకోవడం కేవలం నీ భ్రమ మాత్రమే.. ఫ్యామిలీతో కలిసి ఉంటే చూడ్డానికే బాగుంటుంది. ఎవ్వరూ మన మనసుల్ని అర్థం చేసుకోరు.. అని చెప్పగానే.. కోయిలీ కానీ రాహుల్.. అది.. అంటూ ఏదో చెప్పబోతుంటే.. రంజిత్ కోయిలీని ఆపేసి ఏంటిది..? కోయిలీ ఆల్ రెడీ రాహుల్ ఫ్యామిలీతో గొడవ పడి వచ్చాడు. నువ్వు కూడా ఇలా మాట్లాడితే పాపం ఎంత బాధపడతాడు. ఇలాంటి టైంలోనే మనం సపోర్టుగా ఉండాలి అంటూ రంజీత్ చెప్పగానే.. హమ్మయ్య వీడు నా మాటలకు పడిపోయాడు. ఇక హ్యాపీగా ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు అని మనసులో అనుకుంటాడు రాహుల్.
తర్వాత రాహుల్ ఇంట్లోంచి వెళ్లిపోయాడని స్వప్న ఏడుస్తుంది. స్వప్నను అందరూ ఓదారుస్తుంటారు. రాజ్, కావ్య మాత్రం నాటకం ఆడి కోయిలీ పని చెప్పాలని డిసైడ్ అవుతారు. మరోవైపు రాహుల్‌ను ఎలాగైనా ఇంట్లోంచి వెళ్లగొట్టాలని కోయిలీ ఆలోచిస్తుంది. తర్వాత రాజ్, కావ్య తాత, బామ్మ ల వేషం వేసుకుని కోయిలీ ఇంటికి వస్తారు. రాహుల్ వాళ్లను చూసి ఎవరని అడుగుతాడు. దీంతో తాము నా తాతయ్య, నాన్నమ్మలము అని చెప్తారు. కానీ రాహుల్ వీళ్లను గుర్తు పడతాడు. వీళ్లు కచ్చితంగా రాజ్, కావ్యే ఈ వేషంలో వచ్చారని మనసులో అనుకుంటాడు. వెంటనే వాళ్లను ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని రాహుల్ చెప్పగానే.. కోయిలీ మాత్రం వాళ్లను ఇక్కడే ఉండనిద్దాం అని చెప్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.