 
					మిస్సమ్మ శారీకి మంటల అంటుకుని చనిపోయేలా ఎవరో కావాలనే చేశారని అమర్ అనుమానిస్తాడు. అందుకోసం ఇంట్లో వాళ్ల ఫింగర్ ఫ్రింట్స్ తీసుకోవాలనుకుంటాడు. దీంతో మిస్సమ్మ ఏవండి మళ్లీ ఫింగర్ ఫ్రింట్స్ ఎందుకు అని అడుగుతుంది. దీంతో ఈ శారీకి కెమికల్స్ స్ప్రే చేసింది ఎవరో తెలియాలి కదా మిస్సమ్మ. ఈ శారీ మీద వాళ్ల వేలి ముద్రలు ఉంటాయి అని రాథోడ్ చెప్తాడు. కానీ ఇంట్లో వాళ్ల వేలి ముద్రలు ఎందుకు అని మిస్సమ్మ అడగ్గానే.. నిన్నటి నుంచి బయటి వాళ్లు ఎవ్వరూ ఇంట్లోకి రాలేదు. అంటే ఇది కచ్చితంగా ఇంట్లో వాళ్ల పనే అయ్యుండాలి. అందుకే అందరూ మీ ఫింగర్ ఫ్రింట్స్ ఇవ్వండి అని అమర్ చెప్పగానే.. రాథోడ్ సార్ ముందుగా నా వేలి ముద్రలు తీసుకోండి అని రాథోడ్ వేలి ముద్రలు ఇస్తాడు.
తర్వాత అమర్ కూడా తన వేలి ముద్రలు ఇస్తాడు. మనోహరి, ఛంభా భయంతో వణికిపోతుంటారు. ఇంతలో అమర్ పిల్లలు మీరు కూడా మీ వేలి ముద్రలు వేయండి అని చెప్తాడు. దీంతో అమ్ము మేమేందుకు డాడ్ మేమేందుకు వేలి ముద్రలు ఇవ్వాలి మమ్మల్ని అనుమానిస్తున్నారా..? అని అడుగుతుంది. దీంతో అంజు డాడీ అందరి ఫింగర్ ఫ్రింట్స్ ఇవ్వమన్నారు కదా అమ్ము అంటుంది. ఆనంద్ కూడా డాడీ కూడా తన ఫింగర్ ఫ్రింట్స్ ఇచ్చారు కదా అంటాడు. దిస్ ఈజ్ టూ మచ్ డాడ్ మేమెందుకు అలా చేస్తాము అంటుంది అమ్ము. మీరు చేశారు అని కాదు.. దిస్ ఈజ్ ఫార్మాలిటీ అమ్ము డూ ఇట్ అని చెప్పగానే.. మిస్సమ్మ కల్పించుకుని ఏవండి పిల్లలు అవసరం లేదండి.. నా మాట వినండి. పిల్లలు మీ వేలి ముద్రలు అవసరం లేదు.. మీరు పైకి వెళ్లండి.. అని మిస్సమ్మ చెప్పగానే.. అమ్ము కోపంగా మీ దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. డాడీ చెప్పారు కదా..? మేము కూడా ఫింగర్ ఫ్రింట్స్ ఇస్తాము అంటూ పిల్లలు కూడా వేలి ముద్రలు వేస్తారు.
ఇంతలో రాథోడ్ మనోహరి గారు.. యాదమ్మ మీరు కూడా వచ్చి మీ వేలి ముద్రలు వేయండి అని చెప్పగానే.. మనోహరి కోపంగా ఏంటి రాథోడ్ నన్ను అనుమానిస్తున్నావా..? అని అడుగుతుంది. సారూ పిల్లలు కూడా వేలి ముద్రలు ఇచ్చారు కదా మేడం.. మీరు ఇవ్వడానికి ఏమైంది రండి అని పిలవగానే.. చంభా మనసులో అమ్మో ఇంకా నయం నేను ఆ చీరను నేను ముట్టుకోలేదు.. అని అనుకుని నేను వేస్తాను అని చంభా వేలి ముద్రలు వేస్తుంది. మనోహరి మాత్రం అలాగే చూస్తుంది.
ఇంతలో రాథోడ్ రండి మనోహరి గారు ఇది ఫార్మాలిటీ అని సార్ చెప్పారు కదా..? వచ్చి మీ వేలి ముద్రలు వేయండి అంటాడు. దీంతో మనోహరి భయంగా వెళ్లి వేలి ముద్రలు వేస్తుంది. చంబా మాత్రం మనసులో అయిపోయింది ఈ రోజుతో నీ చాప్టర్ అయిపోయింది. అని అనుకుంటుంది. మనోహరి వేలి ముద్రలు వేశాక అవన్నీ తీసి రాథోడ్‌కు ఇస్తూ.. రాథోడ్ ఇవన్నీ తీసుకెళ్లి ల్యాబ్‌లో ఇచ్చి టెస్ట్ చేయించు.. నాకు ఈరోజే రిజల్ట్ కావాలి అని చెప్పగానే.. రాథోడ్ ఎస్ సార్.. నాకు మిస్సమ్మను చంపాలని చూసిన వాళ్లు ఎవరో తెలుసుకోవాలని ఉంది. ల్యాబ్‌కు వెళ్లి ఫోన్ చేస్తాను సార్ అంటూ అవన్నీ తీసుకుని వెళ్లిపోతాడు రాథోడ్..
రాథోడ్ ల్యాబ్‌కు వెళ్లగానే రూంలోకి వెళ్లిన మనోహరి టెన్షన్ పడుతుంది. మరోవైపు ల్యాబ్‌లో రిపోర్ట్ రాగానే రాథోడ్ అమర్‌కు ఫోన్ చేసి చెప్తాడు. అమర్ షాక్ అవుతాడు. వెంటనే మనోహరిని వెతుక్కుంటూ లాన్‌లోకి వెళ్తాడు. అక్కడ మనోహరిని కోపంగా చూస్తుంటాడు అమర్. మనోహరి మాత్రం భయంతో వణికిపోతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.