OTT Movie : హార్రర్ సినిమాలాంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఏ జానర్ మూవీస్ ను ఇష్టపడే ప్రేక్షకులైనా సరే హర్రర్ మూవీ దొరికిందంటే చూడకుండా వదలరు. ముఖ్యంగా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ డ్రామా, సైకలాజికల్ ట్విస్ట్‌లతో నిండిన కథలు. అందులోనూ కొరియన్ హర్రర్ మూవీస్ అంటే చెవి కోసుకునే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ మూవీ.
ఈ మూవీ పేరు Acacia (2003). 103-నిమిషాల ఈ మూవీ పార్క్ కి-హ్యుంగ్ దర్శకత్వంలో, సూరియా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో రూపొందింది. 2003 అక్టోబర్ 17న దక్షిణ కొరియాలో రిలీజైంది. 2011లో ‘Root of Evil’ అనే టైటిల్‌తో రీ-రిలీజ్ అయింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), Viki, Tubi వంటి ఓటీటీలలో అందుబాటులో ఉంది. ఇందులో షిమ్ హ్యే-జిన్ (చోయ్ మి-సూక్), కిమ్ జిన్-గెఉన్ (కిమ్ డో-ఇల్), మూన్ ఓహ్-బిన్ (కిమ్ జిన్-సంగ్), జెంగ్ నా-యూన్ (మిన్-జీ), ఓహ్ జి-హ్యూ (కిమ్ డో-ఇల్ తండ్రి) ప్రధాన పాత్రలు పోషించారు.
డాక్టర్ కిమ్ డో-ఇల్ (కిమ్ జిన్-గెఉన్), అతని భార్య చోయ్ మి-సూక్ (షిమ్ హ్యే-జిన్) చుట్టూ తిరుగుతుంది కథ. ఈ జంటకు పిల్లలు పుట్టరు. ఈ క్రమంలోనే డో-ఇల్ తండ్రి సలహాతో ఒక ఆర్ఫనేజ్ నుండి ఆరేళ్ల బాలుడు లీ జిన్-సంగ్ (మూన్ ఓహ్-బిన్)ను అడాప్ట్ చేసుకుంటారు. మి-సూక్ నిజానికి ఆర్ట్ ఎంతుజియాస్ట్. ఆమెను అడాప్షన్ కు జిన్-సంగ్‌ను ఎంచుకుంటుంది. ఎందుకంటే అతను మొక్కలు, ట్రీలు డ్రా చేయడానికి ఇష్టపడతాడు. అలా జిన్-సంగ్ తన కొత్త ఫ్యామిలీలో సెటిల్ అవుతాడు. అంతేకాదు పొరుగువారు మిన్-జీ (జెంగ్ నా-యూన్) అనే అమ్మాయికి స్నేహితుడవుతాడు. వాళ్ళ ఇంటి వెనుక ఉన్న పాత, డెడ్ అకేషియా ట్రీ మీద జిన్-సంగ్‌కు అసాధారణ అటాచ్‌మెంట్ ఏర్పడుతుంది. అతను దానిని తన “మదర్”గా భావిస్తాడు.
కొన్ని నెలల తర్వాత మి-సూక్ అనుకోకుండా గర్భవతి అవ్వగా, వారికి ఒక బేబీ బాయ్ పుడతాడు. ఈ సంఘటనతో జిన్-సంగ్ జెలసిగా, నెగ్లెక్టెడ్ గా ఫీల్ అవుతాడు. మి-సూక్ తల్లి అతన్ని ఆర్ఫనేజ్‌కు తిరిగి పంపాలని సూచిస్తారు. జిన్-సంగ్ ఒక వర్షపు రాత్రి అతను అదృశ్యమవుతాడు. ఆ తర్వాత అకేషియా ట్రీ పూలు వికసిస్తాయి. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీలో అసాధారణ సంఘటనలు మొదలవుతాయి. ఫ్లవర్స్, ఆంట్స్, పారానార్మల్ యాక్టివిటీలు వారిని టార్చర్ చేస్తాయి. మిన్-జీ కూడా ట్రీతో అటాచ్ అవుతుంది. అంతేకాదు ట్రీలో జిన్-సంగ్ వాయిస్ వినిపిస్తుందని అంటుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, జిన్-సంగ్ డెత్ ట్రాజిక్ యాక్సిడెంట్ అనే విషయం రివీల్ అవుతుంది. మరి దత్తత తీసుకున్న అబ్బాయి ఎలా చనిపోయాడు? దాని పరిణామాలు ఏంటి? ఫ్యామిలీపై చెట్టు ఎందుకు పగ తీర్చుకుంటోంది? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : స్కూల్ నుంచి తిరిగొచ్చేలోపు బాయ్ ఫ్రెండ్ తో తల్లి… వాడిచ్చే ట్విస్టుకు వణుకు పుట్టాల్సిందే మావా