Illu Illalu Pillalu Today Episode September 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం త్వరగా చందు రెడీ అయ్యి వెళ్తుంటే శ్రీవల్లి అక్కడికి వెళుతుంది. ఇష్టం లేనట్టు చందు మాట్లాడతాడు. మావాళ్లు చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తున్నావా బావ అని అడుగుతుంది.. నువ్వు నన్ను దూరం పెడితే తిరిగి ఆ డబ్బులు మళ్లీ వస్తాయా? నన్ను దూరం పెట్టొద్దు బావ నా ప్రాణం గుంజేస్తుంది అని ఎంతగా బ్రతిమిలాడినా చందు మాత్రం నీ విషయం నువ్వు చూసుకో నా విషయాలు నేను చూసుకుంటాను అని మొహం మీద తేల్చి చెప్పేస్తాడు..
అదేంటి బావ మా ఇంట్లో వాళ్ళు చేసిన తప్పుకి నన్ను దూరం పెడుతున్నారా? మనిద్దరి మధ్య ఇప్పుడే ఇంత దూరం అయితే ఎలా బావ అని బాధపడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. చందు వల్లి కన్నీళ్లు పెట్టుకున్న కరగడు.. అయితే నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటానని చందు అనడంతో శ్రీవల్లి గుండె ముక్కలు అయినంత పని అవుతుంది. ఈ విషయాన్ని శ్రీ వల్లి తన పుట్టింట్లో చెప్పడానికి వెళుతుంది.. నా కాపురం ముక్కలవుతుంది అని బాధపడుతూ తన తల్లి ఒడిలో కన్నీళ్లు పెట్టుకుంటుంది.. భద్ర 10 లక్షల ఆఫర్ ను భాగ్యం తీసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. ఈ విషయం ఎలాగైనా శ్రీవల్లితో చెప్పి ఒప్పించాలని అనుకుంటారు. 10 లక్షలు తీసుకొని శ్రీవల్లికి ఇవ్వబోతారు. దీని గురించి అమ్మాయితో మాట్లాడాలి అనుకుంటారు. ప్రేమ ఆ కళ్యాణ్ గాని ఊరంతా తిప్పించి మరీ కొట్టాను ఇక జీవితంలో వాడు నాకు ఫోన్ చేయడు అని సంతోషంగా ఉంటుంది. ధీరజ్ ప్రేమ టెన్షన్ కి కారణం ఏంటో తెలుసుకోవాలని కనిపించిన తన ఫ్రెండ్స్ అందరిని అడుగుతూ ఉంటాడు. అయితే ఎవరు ఈ ఏమైందో తెలియదు అని అంటారు. ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళిన ధీరజ్ ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటాడు.
ప్రేమ కాలేజీకి రెడీ అవుతుంటే కళ్యాణ్ ఫోన్ చేసి నువ్వు ఒక గంటలో నా పక్కలో ఉండాలి లేదంటే మాత్రం ఈ విషయాన్ని మీ మామతో చెప్తాను అని వార్నింగ్ ఇస్తాడు.. నా ముందు చేయడానికి ఇంకేమీ లేదు వాడు అడిగినట్టు వాడి కోరిక ఎంత ఇచ్చాను నేను ప్రేమ అనుకుంటుంది. అటు ధీరజ్ ప్రేమ టెన్షన్ కి కారణం ఏంటని తన ఫ్రెండ్స్ అందరిని అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చిన ధీరజ్ ప్రేమను చూసి బాధపడతాడు. నేను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను . నీ సమస్య నుంచి నేను బయట పడేస్తాను అని మనసులో అనుకుంటాడు.
ప్రేమ నా కున్నది ఒకటే దారి ఆ కళ్యాణ్ చెప్పినట్టు వాడి కోరిక తీర్చాలని అనుకుంటుంది. నేను అర్జెంటుగా బయటకు వెళ్లాలి అని ప్రేమ వెన్నపోతుంటే ధీరజ్ నువ్వు ఎక్కడికైనా చెప్పు నేను డ్రాప్ చేస్తానని అంటాడు.. ఎక్కడికి వద్దు నేను వెళ్తాను అని ప్రేమ ఎంత చెప్పినా సరే ఈరోజు మాత్రం మాట వినకుండా నేను నిన్ను డ్రాప్ చేస్తాను బైక్ ఎక్కువ అని అంటారు. కళ్యాణ్ రమ్మన్న చోటికి దగ్గరలో ప్రేమ ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోరా అనేసి అంటుంది. ప్రేమ చెప్పినట్లే ధీరజ్ ఒకచోట వదిలేసి వెళ్ళిపోతాడు..
Also Read : అవని వంటను మెచ్చుకున్న బాస్.. విడగొట్టేందుకు ప్లాన్.. పల్లవికి మైండ్ బ్లాక్..
ఇక ప్రేమ నడుచుకుంటూ ఆ కళ్యాణ్ దగ్గరికి వెళ్లిపోతుంది. ప్రేమను చూసిన కళ్యాణ్ నా కోరిక తీర్చడానికి వచ్చావని సైకోలా గా ప్రవర్తిస్తాడు. ప్రేమని గదిలోకి తీసుకొని వెళ్తాడు. నేను మాత్రం మౌనంగా ఓడిపోయానని బాధపడుతూ ఉంటుంది.. అయితే కళ్యాణ్ ప్రేమను చూసి ఈరోజుతో నువ్వు నా సొంతం అయిపోతున్నావని సంబరపడిపోతూ ఉంటాడు. ప్రేమ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి కళ్యాణ్ కోరిక నెరవేరుతుందా? ధీరజ్ ప్రేమను కాపాడుతాడా? శ్రీవల్లి అమూల్యను విశ్వంతో కలపడానికి ప్రయత్నిస్తుందా? సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..