 
					Gundeninda GudiGantalu Today episode October 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ షాపుకి కొందరు వ్యక్తులు వచ్చి నాలుగు లక్షలకు ఫర్నిచర్స్ కొనుక్కొని వెళ్తారు. డబ్బులు వచ్చినాయన సంతోషంతో రోహిణి తో ఆ విషయాన్ని చెప్పి చాలా సంతోషంగా ఉంటాడు. ఇక వెంటనే షాప్ కి విజిలెన్స్ అధికారులు అంటూ మరో ఇద్దరు వస్తారు. వాళ్లు కూడా మనోజ్ ని నమ్మించి అక్కడున్న డబ్బులని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్లు ఫ్రాడ్స్ మిమ్మల్ని పట్టుకున్నాము పోలీస్ స్టేషన్కు వెళ్లి మీ ఫర్నిచర్స్ ని తెచ్చుకోండి అని అంటారు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తే, ఎక్కడున్నావ్ ఎస్సై కూడా మనోజ్ ని దారుణంగా తిడతాడు. ఇంత తింగ్రోడివి ఎలా బిజినెస్ చేస్తున్నావని తిట్టడంతో పాటుగా నిన్ను కూడా జైల్లో వేస్తానని షాక్ ఇస్తాడు. అక్కడి నుంచి ఎలాగోలాగా మేనేజ్ చేసి వచ్చేస్తాడు మనోజ్.. బాలు మీనా ఇద్దరు సొంత ఇంటికి కోసం డబ్బులను కూడ పెట్టాలని అనుకుంటారు. ఇక మనోజు జరిగిన విషయాన్ని ప్రభావతితో చెప్పి ఎలాగైనా కాపాడమ్మా అని అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మనోజ్ ప్రభావతిని బలవంతంగా లోపలికి తీసుకొని వస్తాడు. ఏమైందిరా అంటే నన్ను మోసం చేశారమ్మ దారుణంగా మోసపోయాను. నాలుగు లక్షలు నన్ను మోసం చేసి తీసుకెళ్లిపోయారు. ఏదో ఒకటి చేయాలి అమ్మ అని కాళ్ళ వెళ్ళపడతాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి రా నువ్వు ఏ పని సరిగ్గా చేయవని ప్రభావతి మనోజ్ ని కొడుతుంది. అన్ని డిగ్రీలు ఉన్నాయి నువ్వు ఒకటి చెవిటివి అని దారుణంగా తిట్టేస్తుంది.. మీనా నగలు నాకు ఇవ్వమ్మా నేను మళ్ళీ ఎలాగోలాగా చేసి ఆ నగలను తీసుకొచ్చి ఇస్తాను అని అంటాడు.. చేసేదేమీ లేక తీసుకొని వచ్చి ఇస్తుంది. మధ్యలో సత్యం ఏంటవే అని అడుగుతాడు.. మొత్తానికి మనోజ్ కి ఇవ్వాలని అనుకుంటుంది.
ఎలాగైనా సరే ఈ నగలని మనోజ్ కి ఇవ్వాలి లేకపోతే రోహిణి దగ్గర పరువు పోతుందని ఆలోచిస్తుంది ప్రభావతి. సరే నేను వెళ్లి నగలను తీసుకొని వస్తానని ప్రభావతి లోపలికి వెళ్లి నగలను తీసుకొని వస్తుంది. సత్యం కబుర్లు ఏంటి అవి అని అడుగుతాడు.. నేను నగలు తీసిన విషయం ఈయనకు తెలిసిపోయిందా ఏంటి అని ప్రభావతి కంగారుపడుతుంది. ఏంటి ఏముంది అంతగా కంగారు పడుతున్నావ్ అసలు నువ్వు చేసింది ఏమైనా బాగుందా అని సత్యం అడుగుతాడు. నేనేం చేశానండి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే ఇంత వయసొచ్చింది బీరువాలో బంగారం ఉన్నాయి. నువ్వు తలుపెయ్యకుండా పోతే నీ నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు అని తిడతాడు.
తలుపె కదా ఇప్పుడే వేసేస్తానండి అని ప్రభావతి అంటుంది ఇక నువ్వేం అనుకున్నావు అని సత్యం అడుగుతాడు. ప్రభావతి కంగారుగా సత్యం ఎక్కడ మళ్ళీ పిలుస్తాడు అని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లిపోతుంది. మీనా బాలు కోసమని చాపలు తీసుకొచ్చాను అని అంటుంది.. అయితే నీకోసం పులుసు పెడతాను మీరు రెస్ట్ తీసుకోమంటే బయట ఇలా చేస్తున్నారేంటి అని మీనా తిడుతుంది. నాకు రెస్టు తీసుకోవాలని ఆలోచన లేదు ఇండ్లు అవే కలలోకి వస్తున్నాయి. సరేగాని పులుసుతో పాటు ఫ్రై కూడా చెయ్యి అని అడుగుతాడు..
ఫ్రై ఉంటే ముక్కతో పాటు చుక్క కూడా ఉంటే బాగుంటుంది ఇవాళ ఒక్కరోజే నేను మందు తాగుతాను అని పర్మిషన్ తీసుకుంటాడు. అవునా అయితే మామయ్య గారికి ఆ మాట చెప్పి మీరు తెచ్చుకోండి నేను వెళ్లి ఈ విషయాన్ని మామయ్యతో చెప్తాను అని మీనా అంటుంది.. నాని ఆపడానికి బాలు వస్తాడు వీళ్లిద్దరూ కలిసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లడంతో మీనా ప్రభావతిని గుద్దేస్తుంది. ఈ క్రమంలో రెండు సంచులు మారిపోతాయి. ఏంటి చిన్నపిల్లవనుకుంటున్నావా? పరిగెడుతున్నావేంటి అని ప్రభావతి అంటుంది.
Also Read : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి..
చిన్నపిల్లలాగా ఈ వయసులో ఈ ఆటలు ఏంటి కొంచమైనా బుద్ధి ఉండాలి అని ప్రభావతి మీనా అని తిడుతుంది. మీనా చిన్న పిల్ల కాదు నువ్వు ఎందుకు కంగారుగా బయటికి పరిగెడుతూ వచ్చావు నువ్వు ఏమైనా చిన్న పిల్లవాని బాలు అడుగుతాడు. ఇక తర్వాత ఆ కవర్లను తీసుకొని ప్రభావతి మీనా వెళ్లిపోతారు. మీనా తెచ్చిన చేపల కవర్ ని ప్రభావతి తీసుకొని బయటికి వచ్చేసి మనోజ్ కు ఇస్తుంది. మనోజు తాకట్టు కోసమని బంగారు కొట్టుకు వెళ్తాడు. మరి ఏదో పచ్చి చేపల వాసన వస్తుంది అని అనగానే అంతా వెతుకుతారు కానీ మనోజ్ చేతిలో ఉన్న కవర్లో ఆ చేపలు ఉన్నాయని తెలుసుకోలేక పోతాడు. సేటు దగ్గరికి వెళ్లి నాకు ఒక నాలుగు లక్షలు కావాలి అని చేపలని అతని ముందు వేస్తాడు. అతను నాలుగు తిట్టడంతో మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..