Intinti Ramayanam Today Episode September 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. తర్వాత రోజు ఉదయం అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా పల్లవి శ్రీకర్ కమల్ శ్రియ అందరూ వచ్చేస్తారు. రేపు పెళ్లి రోజు వేడుకంటే ఇప్పుడే వచ్చేసారేంటి ఏంట్రా అనేసి అడుగుతారు. పూజలు వ్రతాలు అన్ని మన ఇంట్లో చేసుకుంటున్నాం. మన ఇంటి వేడుకను మన ఇంట్లోనే చేసుకోవాలి కదా.. ఇక్కడ ఎందుకు చేసుకోవాలి వేరే వాళ్ళ ఇళ్లల్లో అని పల్లవి అంటుంది.. మొదట వద్దని అన్న పార్వతి తర్వాత వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా రా మన ఇంట్లోనే ఈ వేడుకను చేసుకుందామని అక్షయతో అంటుంది. రాజేంద్రప్రసాద్ కూడా ఒకపక్క పల్లవి వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతాడు. కానీ అవని అక్షయ్ లు మాత్రం అందుకు ఒప్పుకోరు.. పల్లవి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అక్షయ్ ఒప్పుకోవడంతో ఫంక్షన్ కోసం అందరు ఆ ఇంటికి వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతి నగలు వేసుకోవడం చూస్తున్న అవని ఈ నగలని నీకు ఎవరు ఇచ్చారు అని అడుగుతుంది. పల్లవి వదిన ఈ నగలను వేసుకోమని ఇచ్చింది వదిన అని అంటుంది. ఇంటి తాళాలు చిన్నపిల్లవి నీకెందుకు.. పెద్దవాళ్ళకి ఇవ్వు నీకెందుకు ఈ పెత్తనం అని అంటుంది. పార్వతిని పిలిచి అవని తాళాలను ఇస్తుంది. ఇంటి పెద్ద కోడలు నువ్వు ఈ తాళాలు నీ దగ్గర పెట్టుకోవాలి అని అంటుంది.
ఆ తర్వాత పల్లవి భరత్ ను లోపలికి పిలిచి చూసావా మీ అక్క ఎలా మాట్లాడుతున్నావ్ అని ప్రణతి దగ్గర తాళాలు ఉంటే మీ అక్క ఎలా మాట్లాడుతుందో చూసావా.. పెళ్లి చేసింది అయితే నీకు కావాల్సినవన్నీ సమకూరేలా చూసుకోవాలిసిన బాధ్యత కూడా మీ అక్కదే కదా.. ప్రగతికి ఎన్నో కోరికలు ఉంటాయి కానీ అవన్నీ కూడా చేసింది మీ అక్క.. మీ అక్క చెడ్డది అని నేను చెప్పట్లేదు కానీ ఏది మంచో ఏది చెడు ఆలోచించాలి అని భరత్ తో పల్లవి కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.
వీళ్ల మాటలు విన్న ప్రణతి వదిన అలాంటిది కాదు.. కానీ చూస్తుంటే పరిస్థితులు అలానే అనిపిస్తున్నాయి అని పల్లవి మాటలు ప్రణతి కూడా నమ్ముతుంది.. ఎంత చెప్పినా కూడా అవని మాటని ఎవరు లెక్క చేయరు. ఇక భానుమతి కమల్ గదిలోకి వెళ్లి కమలాకర్ డ్రెస్ చూసి షాక్ అవుతుంది. ఈ కమలే ఇలా కమలాకర్లకు వచ్చి నన్ను మోసం చేశాడు అని భానుమతి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కమల్ ను చూసి భానుమతి నువ్వే నా భర్త లాగా వచ్చి నన్ను మోసం చేసావా అని అడుగుతుంది. ఎందుకు ఇలా చేసావు అందరి ముందర ఇది బయట పెట్టేస్తాను అని అంటుంది.
కమల్ ఏదొక విధంగా భానుమతిని బురిడీ కొట్టించి.. అసలు నిజం దాచి పెట్టేస్తారు. భానుమతి నిజంగానే కమలాకర్ నే అనుకుని నమ్మేసి మోసపోతుంది. అక్షయ్ ని అవని అలానే చూస్తూ ఉంటుంది. ఏమైంది ఎందుకలా చూస్తున్నావ్ అంటే.. భలే అందంగా ఉన్నావు అని పొగిడేస్తుంది. నువ్వేంచేసినా కూడా భరిస్తున్నాను కదా.. అందుకే ఇలా చేస్తున్నావని అవని తో అక్షయ్ అంటాడు. శ్రీకర్, శ్రీయా వెళ్తుంటే.. అవని మాట్లాడిన సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు.
Also Read :Gu ఇంట్లో రచ్చ చేసిన రోహిణి.. బాలుకు వరుస షాక్.. మీనాకు ఘోర అవమానం..
ఇక అప్పుడే ఇంట్లోకి అక్షయ వాళ్ళ బాస్ వస్తుంది. ఆమె రావడంతో ఇంట్లోనే వాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. అయితే అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని చాముండేశ్వరి కూడా అనుకుంటుంది. కానీ అవని మాత్రం మనం కూడా కొన్ని విషయాన్నీ మీ బాస్ కు పరిస్థితిలో తెలియకుండా మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నారు… పల్లవి, శ్రీయా ఇద్దరు కూడా ఈ ఫంక్షన్ ఎలా ఆపాలని అనుకుంటారు. అయితే ఏదో ఒకటి చేసి ఫంక్షన్ జరగకుండా చేయాలి అని పల్లవి అనుకుంటుంది. అక్కడికి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…