Jabardasth Emmanuel: ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ -2(Kirrak Boys Khiladi Girls-2) షో చివరికి వచ్చేసింది. తాజాగా ఈ షోకి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ప్రోమో యూట్యూబ్ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ ప్రోమోలో ఇమ్మానుయేల్ ఏడవడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.మరి ఇంతకీ ఇమ్మానుయేల్ ఎందుకు ఏడ్చారు? ఆయన్ని అవమానించింది ఎవరు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. శ్రీముఖి (Sreemukhi) యాంకర్ గా ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ కి సంబంధించి ఇప్పటికే ఒక సీజన్ పూర్తయింది. తాజాగా రెండో సీజన్ కూడా స్టార్ట్ అయ్యి ఫినాలేకి చేరుకుంది. ఇక ఈ కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ సీజన్ 2 లో కూడా జడ్జిలుగా డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్(Sekhar Master), యాంకర్ అనసూయ(Anasuya)లు ఉన్నారు.
ఖిలాడీ గర్ల్స్ ను ఇమిటేట్ చేసిన ఇమ్మానుయేల్..
అయితే ఈ షోలో ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్లు, బుల్లితెర సీరియల్ ఆర్టిస్టులు, బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన కంటెస్టెంట్లు పాల్గొని షోని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు. ఈ షో గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. అందులో శ్రీముఖి మీరు ఇక్కడ ఉన్న ఖిలాడి గర్ల్స్ ని ఇమిటేట్ చేయండి అని ఇమ్మానుయేల్ (Emmanuel)కు చెబుతుంది. అయితే ఇమ్మానుయేల్ గర్ల్స్ ని ఇమిటేట్ చేసే టైంలో జబర్దస్త్ కమెడియన్ రోహిణి (Rohini)ని ఇమిటేట్ చేశారు.
షోలో కమెడియన్ కి ఘోర అవమానం..
మెమొరీ పాయింట్ మీద మీ సైడ్ నుండి స్టేజ్ మీదకి ఎవరు వస్తున్నారని యాంకర్ అడగగా.. మా టీంలో మెమొరీ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఎవరు రావడం లేదు అంటూ రోహిణి ఫుడ్ ఎలా తింటుందో ఇమిటేట్ చేసి చూపించడంతో.. ఇది చూసి బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రేరణ (Prerana) కోపంతో ఇమిటేషన్ చేయడం అనేది ఏదో సరదా కోసం చేయాలి కానీ ఇలా అతి చేయకూడదు అంటూ ఇమ్మానుయేల్ పై మండిపడుతుంది.
గుక్కపెట్టి ఏడ్చిన ఇమ్మానుయేల్..
అయితే ప్రేరణ మాటలకు హర్ట్ అయిపోయిన ఇమ్మానుయేల్ కామెడీ అనేది ఎప్పుడైనా సరే అతి చేస్తేనే నవ్వు వస్తుంది. ఇలా నార్మల్గా చేస్తే ఎవరు చూసి నవ్వరు. అతి చేస్తేనే అందరూ చూసి నవ్వుతారు. ఎలా తింటున్నారంటే ఇలా తింటున్నారని అంటే ఎవ్వరు నవ్వరు.ఇలా వెరైటీగా తింటేనే కదా సెట్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు అలా చేస్తేనే కామెడీ. వాళ్ళందరూ నేనేదో తప్పు చేస్తున్నట్లు ఒకేసారి నా మీద మాట్లాడారు. నాకది నచ్చలేదు. నేనేం తప్పు చేశాను అంటూ ఇమ్మానుయేల్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి గుక్కపెట్టి ఏడ్చాడు.
ఇమ్మానుయేల్ కి ఖిలాడీ గర్ల్స్ సారీ చెబుతారా?
ఇక ఆయన్ని ఓదార్చడానికి శ్రీముఖి ఆయన దగ్గరికి వెళ్ళింది. అలాగే శేఖర్ మాస్టర్ కూడా ఇమ్ము ప్లీజ్ ఏడవద్దు అంటూ ఓదార్చారు. అలా ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది ప్రోమో చూసి గొడవలు ఎక్కడ ఉంటే ప్రేరణ అక్కడ ఉంటుంది అంటూ నెటిజన్స్ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇమ్మానుయేల్ ఏడవడంతో ఖిలాడీ గర్ల్స్ తగ్గి ఆయనకు సారీ చెప్పారా.. లేదా అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.