Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles).. ఈ పచ్చళ్లకు సోషల్ మీడియాలో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత రుచిగా ఉంటాయో అంతే ఖరీదు కూడా అని రుచి చూసిన చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయితే 11 నెలల్లోనే భారీ లాభాలను చవి చూసిన ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్.. అనూహ్యంగా చూపించిన ఈగో కారణంగా వ్యాపారం ఒక్కసారిగా దెబ్బతినింది. ధరలు ఎందుకు అంత అధికంగా ఉన్నాయి అంటూ వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు.. అలేఖ్య సిస్టర్స్ చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్ కు గురయ్యేలా చేసింది.
అలేఖ్య పికిల్స్ కొనాలంటే కెరియర్ పై ఫోకస్ చేయాల్సిందేనా?
అలేఖ్య చిట్టి పికిల్స్ కొనాలి అంటే ఫస్ట్ కెరియర్ పైన ఫోకస్ చేయాలి అని, అలేఖ్య చిట్టి పికిల్స్ కొనలేని వాడివి పెళ్లయ్యాక భార్యను ఎలా చూసుకుంటావు అంటూ వీరు మాట్లాడిన మాటలు నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యాయి. ఈ కామెంట్స్ పై చాలామంది ట్రోల్స్ చేశారు. విపరీతమైన మీమ్స్ క్రియేట్ చేశారు. ఆఖరికి సినిమా ప్రమోషన్స్ లో కూడా ఈ సిస్టర్స్ డైలాగ్ ని ఉపయోగించారు అంటే ఇక వీరు ఏ రేంజ్ లో పాపులారిటీ అందుకున్నారో అర్థం చేసుకోవచ్చు. నెటిజన్స్ దెబ్బకి బిజినెస్ క్లోజ్ చేసుకున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. అంతేకాదు ట్రోల్స్ దెబ్బకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఐసీయూలో కూడా చేరింది అలేఖ్య. ఒక రోజు రోజుకి ట్రోల్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. మళ్లీ తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు షేర్ చేసి.. తప్పు తమదేనని తెలిపారు.
అలేఖ్య చిట్టి పికిల్స్ 2.0..
ఇక ఇన్ని రోజులు సైలెంట్ అయినా ఈ అక్కాచెల్లెళ్లు.. మళ్లీ మీ ముందుకు వస్తున్నాం అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు.ఈ మేరకు ఇప్పుడు మళ్లీ బిజినెస్ మొదలు పెట్టాము అని అలేఖ్య సిస్టర్స్ ఒక్కొక్కరిగా తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని కస్టమర్స్ తో తెలియజేశారు. గత మూడు రోజుల క్రితం అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో ఒకరైన సుమ త్వరలోనే అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తామని తెలుపగా.. ఇప్పుడు మళ్ళీ రమ్య కూడా అదే వీడియోని పంచుకుంటూ పలు విషయాలు తెలియజేసింది.
కెరియర్ పై ఫోకస్.. అందరికీ అందుబాటులో..
అయితే ఈసారి వినూత్నంగా వీరు చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పవచ్చు. ఈ మేరకు అలేఖ్య సిస్టర్స్ లో ఒకరైన రమ్య తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేస్తూ.. “అలేఖ్య చిట్టి పికిల్స్ 2.0 తో అయితే మళ్లీ మీ ముందుకు వచ్చేశాం. మేము బిజినెస్ క్లోజ్ చేసిన తర్వాత ఈ రెండు నెలల్లో మేము ఏ తప్పులు చేసాము? ఎక్కడ ఎలాంటి తప్పు జరిగింది? ఇలా అన్ని విషయాలను పరిశీలించుకొని.. ఇక మేము సెట్ అయ్యాం అనుకున్న తర్వాతనే ఇప్పుడు మీ ముందుకి వచ్చాము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మా పచ్చళ్ళు కొనగలిగే ధరలతోనే మీ ముందుకు వచ్చాము. ఇక కెరియర్ పై ఫోకస్ పెట్టి మళ్ళీ మా పచ్చళ్ళ బిజినెస్ ని మొదలుపెట్టాము” అంటూ రమ్య తెలిపింది. ప్రస్తుతం రమ్య షేర్ చేసిన ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ:Anasuya: ఆ విషయంలో నేను చాలా బ్యాడ్.. రిలేషన్‌షిప్స్‌పై అనసూయ కామెంట్స్!
అలేఖ్య సిస్టర్స్ పై ఆగని ట్రోల్స్..
ఇకపోతే అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ బిజినెస్ మళ్ళీ మొదలు పెట్టామని వీడియోలు వదలడంతో.. ఎప్పటిలాగే నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.” ముందు నేను కెరియర్ పై ఫోకస్ పెట్టాలి.. అప్పుడే నీ పచ్చళ్ళు కొంటా”అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్..” ఎంత కొట్టినా చావని పాములే మీరు” అంటూ కామెంట్లు చేశారు. ఇంకొకరేమో “అలేఖ్య ముష్టి పికిల్స్” అని కామెంట్లు పెడుతుంటే.. ఇంకొంతమంది..” నేను నా కెరియర్ పైనే కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఇంకా మీ పచ్చడి కొనే స్తోమత రాలేదు. దయచేసి తిట్టకండి” అంటూ ఇలా ఎవరికి వారు తమకు నచ్చినట్టు ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.