Allwyn Colony: జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో ఆల్విన్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి పది సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. బాలుడు జయశిత్ చౌహాన్ స్కూల్ కి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో స్కూల్ బస్సు పై నుంచి వెళ్లింది. ఇక స్థానికులు గోకుల్ ఫ్లాట్స్‌కి చెందిన క్వాంటం లీప్ స్కూలు బస్సుగా గురించారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కేమెరాల్లో రికార్డు అయ్యింది.
Also Read: లోకేష్ అలా.. జగన్ ఇలా..
ఆల్విన్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలుడు స్కూలు వెళ్తుండగా సైకిళ్ స్కిడ్ అవ్వడంతో కిందపడటం జరిగింది. అయితే కేవలం సైకిళ్ స్కిడ్ అవ్వడం వల్లనే బస్సు కింద పడటం జరిగింది. అప్పటికే బస్సు డ్రైవర్ అపే సమయంలో కింద పడిన బాలుడు బస్సు చక్రాల కింద పడటంతో అక్కడిక్కడే మృతి చెందడం జరిగింది. అయితే అక్కడి సీసీ కేమెరా ఫోటోలను పోలీసులు స్వాధినం చేసుకుని కేసుని నమోదు చేసి ఇన్వేస్టీగేషన్ చేస్తున్నారు. కేవలం ప్రమాదవశాత్తు వల్లనే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తు్న్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఒకే ఒక్క కోడుకు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం అని, కానీ ఈ ఘటన జరగడంతో బాలుడుని కోల్పోడంతో బాధను తట్టుకోలేకపోతున్నారు.