Jagadatri Deepthi : సీరియల్ లో నటిస్తున్న హీరో హీరోయిన్లు ఈమధ్య సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానులని ఆకట్టుకుంటూ వస్తున్నారు. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ.. తమ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటుగా సీరియల్స్ గురించి కూడా చెప్పడంతో సోషల్ మీడియాలో వాళ్ల గురించి తెలుసుకునేందుకు అభిమానులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది సీరియల్ హీరో హీరోయిన్లు సోషల్ మీడియాలోనే ఎక్కువ టైం గడుపుతున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా జీ తెలుగు సీరియల్ ఓ కీలక నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ సీరియల్ హీరోయిన్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? సీరియల్స్ కి గుడ్ బై చెప్తుందా అన్న వివరాల గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో సీరియల్ హీరోయిన్ కున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని రోజులుగా వీళ్ళకి సినిమా హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ కూడా వస్తుంది. అయితే చాలామంది సీరియల్స్ తో పాటుగా సోషల్ మీడియాకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్న విషయం అందరికీ తెలుసు.. కొంతమంది సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడిపేందుకు సీరియల్స్ ను కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా చాలామంది సీరియల్స్ చాలా బిజీగా గడపడానికి కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటే, కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకునేందుకు మరెన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జగదాత్రి హీరోయిన్ దీప్తి మన్నె కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండాలని భావిస్తున్నట్లు తాజాగా ఒక వీడియోని రిలీజ్ చేస్తుంది. అయితే ఆ వీడియోని చూసిన అభిమానులు ఇకమీదట ఈమె సీరియల్స్ చేయదు అని కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై దీప్తి ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది చూడాలి..
కన్నడ ముద్దుగుమ్మ దీప్తి మన్నె తెలుగులో కూడా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. 2019లో రాధమ్మ కూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సీరియల్లో అక్షరాన్ని పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో బాగా ఆకట్టుకునేలా చేసింది.. ఒకవైపు తెలుగులోనే వరుసగా సీరియల్స్ చేస్తూ మరోవైపు కన్నడలో కూడా పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని వస్తుంది. ఇటీవల కాలంలో ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ని సొంతం చేసుకోవడంతో ఈమెకి డిమాండ్ కూడా పెరిగింది ప్రస్తుతం జగదాత్రి సీరియల్ తో పాటుగా మరో రెండు కన్నడ సీరియల్స్లలో నటిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు.. అటు పలు టీవీ యాడ్లలో కూడా కనిపిస్తూ బాగానే సంపాదిస్తుంది దీప్తి..
?jplx=OWtjeXFicXBpMnJ5
Also Read :శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..