E-Paper
Advertisement

కనకవ్వ వర్సెస్ నాగవ్వ.. పాటలతోనే పోటీ.. వీరిద్దరిలో టాప్ ఎవరు?

కనకవ్వ వర్సెస్ నాగవ్వ.. పాటలతోనే పోటీ.. వీరిద్దరిలో టాప్ ఎవరు?
Advertisement

Kanakavva vs Nagavva: ఒకప్పుడు పల్లెటూర్లకే పరిమితమైన జానపదాలు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నాయి.ఇక ఈ పాటలని పాడిన సింగర్స్ కూడా ఇపుడు అదే రేంజ్ లో పాపులర్ అవుతున్నారు.

ఇక ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన వాళ్లలో చెప్పుకోవాల్సిన వారు కనకవ్వ మరియు నాగవ్వ.వీరిద్దరూ పాడిన పాటలు ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుండటంతో అసలు వీరిద్దరిలో ఎవరు టాప్ అనే చర్చ ఇపుడు ఫోక్ ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తుంది.

Advertisement

కనకవ్వ విషయానికి వస్తే

కనకవ్వ విషయానికి వస్తే 1957లో సిద్ధిపేట జిల్లా అక్కన్న పేట మండలంలోని బొడిగె పల్లి అనే ఊరిలో పుట్టింది.ఇక కనకవ్వ కి ముగ్గురు తమ్ముళ్లు ,ఐదు మంది అక్కా చెల్లెలతో ఇల్లంతా సందడిగా ఉండేది.

Advertisement

అయితే చిన్నప్పుడు నుండే ఎన్నో కష్టాలు పడ్డ కనకవ్వ తల్లితో పాటు పొలం పనులకి వెళ్ళేది .అలా పాటని ఒంటబట్టించుకున్న కనకవ్వ క్రమంగా పాటలని నేర్చుకుని పాడటం అలవాటు చేసుకుంది.అలా పాటలు పాడుతు పాడుతూ ఉన్న సమయంలో మైక్ టీవీ ఇచ్చిన సపోర్ట్ తో క్రమంగా జానపదాలని పాడుతూ మరింత రాటుదేలింది.

పాటల విషయానికి వస్తే

ఇక కనకవ్వ పాటల విషయానికి వస్తే కనకవ్వ కి బాగా పేరు తెచ్చిన పాట ఏదైనా ఉందంటే అది నర్సపల్లె అనే చెప్పాలి.మంగ్లీ ,జానూ లితో కలిసి పాడిన ఈ పాట ఏకంగా 370 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడం విశేషం.

ఇక ఆ తర్వాత గిన్నె రామ,టుంగుటుయ్యాల,గిజ్జగిరి ,అవ్వ మనవడి పాట ,గంజి కుండ,మేడారం పాట అంటూ ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడి తన సత్తా చాటింది.ఇక కనకవ్వ మట్టికథ ,లగ్గం ,kcr అనే సినిమాలలో తలుక్కుమంది కూడా. కనకవ్వ బలం తన సహజమైన పల్లె గొంతు అని చెప్పాలి.ఆమె పాడే పాటల్లో మట్టి వాసనలు కనిపించడం వల్లే ఆడియన్స్ అంతగా ఆమె పాటలకి అట్రాక్ట్ అవుతున్నారు.

నాగవ్వ విషయానికి వస్తే

ఇక నాగవ్వ విషయానికి వస్తే కరీంనగర్ జిల్లా ,అంబారీపేటలో పుట్టిన నాగవ్వది యక్ష గాన కళాకారుల కుటుంబం.చిన్నప్పటి నుండే తండ్రి పాడే పాటలని ఒంటబట్టించుకున్న నాగవ్వ అప్పటి నుండి పాటనే తన ప్రాణం చేసుకుంది.

అయితే తన కొడుకుల కారణంగానే నాగవ్వకి గుర్తింపు వచ్చింది .ఇక నాగవ్వ ని ఫోక్ ఇండస్ట్రీలో స్టార్ గా నిలబెట్టిన పాట బాయిలోన బల్లి పలికే.మంగ్లీ తో కలిసి పాడిన ఈ పాటలో నాగవ్వ కూడా మెరవడం విశేషం.

పాటల విషయానికి వస్తే

అక్కడ మొదలైన చుంచు నాగవ్వ ప్రయాణం మామిడికోనాల మీద,యెద్దులచ్చే ముద్దు వెట్టె ,ఎండి గజ్జ వంటి పాటలతో జోరుగా సాగుతుంది.ఇక ఈ మధ్య 37 మిలియన్ల వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బిందె మీద బిందె పెట్టి సాంగ్ తో మరోసారి వార్తల్లో నిలిచింది నాగవ్వ . నాగవ్వ బలం తన గొంతులోని ఎనర్జిటిక్ వాయిస్ అనే చెప్పాలి.మాస్ ఆడియన్స్ కి నాగవ్వ గొంతు ఒక మ్యాగ్నట్ అని చెప్పాలి.

ఎవరు టాప్?

ఇక వీరిద్దరిలో ఎవరు టాప్ అనే విషయానికి వస్తే వీరిద్దరూ తమ తమ గొంతులతో ఆడియన్స్ ని అలరిస్తూ మిలియన్ల కొద్దీ వ్యూస్ కొల్లగొడుతున్న వారే .పైగా ఎవరి సొంత గుర్తింపు వారికి ఉంది.

కాబట్టి వీరిలో ఎవరు టాప్ అని లెక్కలు వేయడం కన్నా వీరిద్దరూ మంచి పాటలు మరిన్ని అందించాలని ,కుదిరితే వీరిద్దరూ కలిసి ఒకే పాటలో వినిపించి కనిపించాలని కోరుకుందాం !

also read:నాగవ్వ, వైష్ణవి సోనీ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్స్ ఇవే.. ఎన్ని హిట్లో తెలుసా?

Tags

Related News

పెళ్లి పీటలు ఎక్కిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటుడు చందు..

బిగ్ బాస్ 10 విన్నర్ అతనే.. పుసుక్కున నోరు జారిన సుధీర్..

నాగవ్వ, వైష్ణవి సోనీ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్స్ ఇవే.. ఎన్ని హిట్లో తెలుసా?

గాజులు గలగల హిట్.. గజ్జెలు గలగల ఫ్లాప్.. రాధమ్మ కూతురికి ఏంటీ షాక్!

నా జీవితంలో దారుణమైన చీకటి రోజులవే: రోహిత్!

ఝాన్సీ పుట్టినరోజు.. మంచి పనికి శ్రీకారం చుట్టిన రైతుబిడ్డ.. ఫ్యాన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్!

నాపై కేస్ పెడతామని బెదిరించారు..నిజాలు బయటపెట్టిన రోహిత్!

Big Stories

Advertisement
×