Bigg Boss 10 Telugu Winner: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ రియాలిటీ షో ఇప్పటివరకు 9 సీజన్లో విజయవంతం కాక పదవ సీజన్ కూడా చివరి దశకు వచ్చింది. ఇప్పటికే 11 వారాలు పూర్తికాగా 12వ వారం కూడా పూర్తి కావస్తోంది. ఇలా ఈ కార్యక్రమం 12 వారాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో విజేత ఎవరు అవుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే త్రిగుణ్ ( trigun)విన్నర్ అవుతారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా త్రిగుణ్, రోహిత్ మద్య గట్టి పోటీ ఉండేది. అనుకోకుండా రోహిత్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కావడంతో త్రిగుణ్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే తాజాగా కంటెస్టెంట్ సుధీర్ (Sudheer Reddy)హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్లతో మాట్లాడుతూ పొరపాటున ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే విషయాన్ని బయటపెట్టారు. తోటి కంటెస్టెంట్లతో సుధీర్ మాట్లాడుతూ ఇప్పటికే టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఎవరు అనేది జనాలు ఫిక్స్ అయి ఉంటారు. ఇక్కడి నుంచి కొట్టామంటే ఒక వైబ్ పుడుతుంది.. కప్పు మాకెవరికి రాదు అన్న, అది మీకే అంటూ సుధీర్ విన్నర్ త్రిగుణ్ అనే విషయాన్ని పొరపాటున బయటపెట్టేసారు.
అనంతరం సారీ చెబుతూ విన్నర్ విషయంలో మాకు క్లారిటీ ఉందని తెలిపారు. ఈ విధంగా సుధీర్ కూడా త్రిగుణ్ విన్నర్ అవుతారని చెప్పడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడా త్రిగుణ్ విన్నర్ రేసులోనే దూసుకుపోతున్నారు. అయితే ఈయనకు పోటీగా రోహిత్ కూడా విన్నర్ రేస్ లో కొనసాగారు. కచ్చితంగా రోహిత్ విన్నర్ అవుతారని చాలామంది భావించారు కానీ రోహిత్ ఎనిమిదవ వారం ఊహించని విధంగా బయటకు రావడంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు.
ఇలా రోహిత్ ఎలిమినేట్ కావడంతో త్రిగుణ్ విన్నర్ అవ్వడం కోసమే రోహిత్ ను బిగ్ బాస్ ఎలిమినేట్ చేశారు అంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక రోహిత్ బయటకు రావడంతో ముఖేష్,త్రిగుణ్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. మరి వీరిద్దరిలో విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు అనేది తెలియాలి అంటే మరొక 3 వారాలు ఎదురుచూడాల్సిందే. ఇక 12వ వారంలో భాగంగా నామినేషన్స్ లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు.ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం త్రిగుణ్ మరియు ముకేశ్ ముందు వరుసలో నిలిచారు.వంశీ, వర్షిణి, అలాగే రామకృష్ణ డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి ఈ వారం హౌస్ నుంచి బయటకు ఎవరు వస్తారనేది తెలియాల్సి ఉంది.
Also Read: జనవరి 12 విడుదల డబ్బింగ్ షురూ…యమ స్పీడు మీదున్న అనిల్ రావిపూడి!