E-Paper
Advertisement

నాగవ్వ, వైష్ణవి సోనీ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్స్ ఇవే.. ఎన్ని హిట్లో తెలుసా?

నాగవ్వ, వైష్ణవి సోనీ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్స్ ఇవే.. ఎన్ని హిట్లో తెలుసా?
Advertisement

Nagavva and Vaishnavi Sony Folk Songs:నాగవ్వ ..నాగవ్వ..నాగవ్వ ..ఇపుడు ఎక్కడ చూసినా ఈ పేరే మారుమ్రోగిపోతుంది.ముఖ్యంగా తనదైన పెక్యులర్ వాయిస్ తో ఎన్నో పాటల్ని మిలియన్ల వ్యూస్ కి చేరుస్తుంది ఈ ఫోక్ సింగర్.ఇక నాగవ్వ ,ఫోక్ డాన్సర్ వైష్ణవీ సోనీతో జత కట్టి చేసిన పాటలైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ క్రేజీ సెన్సేషన్ ఫోక్ సాంగ్స్ ఏంటో మనమూ చూసేద్దాం !

”బిందె మీద బిందె పెట్టి”

Advertisement

వీరి కాంబోలో వచ్చిన పాటలని చెప్పుకోవాల్సి వస్తే మొదటగా అందరికి గుర్తొచ్చే పాట ”బిందె మీద బిందె పెట్టి”.వైదిక్ ప్రొడక్షన్ లో వచ్చిన ఈ పాటని శ్రీనిధితో కలిసి నాగవ్వ పాడటమే కాకుండా వైష్ణవి సోనీతో కలిసి కనిపించడం విశేషం.ఇక తిరుపతి సాహో అధ్బుతమైన లిరిక్స్ అందించిన ఈ పాట ఇప్పటికి ఏకంగా 37 మిలియన్ల మంది మనసుల్ని దోచేసిందంటే పాట ఆడియన్స్ కి ఎంతలా ఎక్కేసిందో అర్థం అవుతుంది.మొత్తంగా ఈ పాట ఇంతటి జనాధరణ పొందిందంటే దానికి వైష్ణవీ సోనీ స్టెప్పులతో పాటు నాగవ్వ వాయిస్ అనే చెప్పాలి.

Advertisement

‘ఎద్దులచ్చే ముద్దు వెట్టె’

ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన మరో పాట ‘ఎద్దులచ్చే ముద్దు వెట్టె’. రెండు నెలల కిందటే విడుదలైన ఈ పాట ఇప్పటికి ఏకంగా 5 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం.ఈ పాటని నాగవ్వ ,ప్రభతో కలిసి పోటా పోటీగా పాడటమే కాకుండా వైష్ణవీ సోనీతో కలిసి తెరపై కనిపిస్తుంది కూడా.అయితే ఫోక్ ఇండస్ట్రీని శాసిస్తున్న లీడింగ్ బాయ్స్ శ్రీకాంత్ లేక శేఖర్ వైరసో కాకుండా శివ గణేష్ అనే కొరియోగ్రాఫర్ ఈ పాటకి అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేయడం పాటకి బాగా కలిసి వచ్చింది.దానికి తోడు తిరుపతి సాహో పదాలు ,వెంకట్ అజ్మీరా సరిగమలు పాటని మరో లెవెల్ కి తీసికెళ్లాయనడంలో సందేహం లేదు.

”ఎండి గజ్జే పైడి మువ్వ”

ఇకపోతే వీరి కాంబినేషన్ లో ముచ్చటగా వచ్చిన మూడో పాట ”ఎండి గజ్జే పైడి మువ్వ”.కళ్యాణ్ కీస్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటకి ఫోక్ స్టార్ శేఖర్ వైరస్ కోరియోగ్రఫీ చేయగా ఎప్పటిలాగే తో కలిసి అదరగొట్టింది నాగవ్వ.ఇక ఈ పాటలో కూడా వైష్ణవీ సోనీతో కలిసి నాగవ్వ కనిపించి మెప్పించడంతో పాటకి రిపీట్ వాల్యూ పెరిగిపోయింది. ఇక పాటని నాగవ్వతో కల్సి పాడిన వనిలా గుజ్జేటినే రాయడం విశేషం.ఇక ఈ పాట ఇప్పటికి దాదాపు 4 లక్షల వ్యూస్ కొల్లగొట్టగా వచ్చే రోజుల్లో మరింతగా దూసుకుపోతుందని వస్తున్న ఆదరణని చూస్తే అర్థమవుతుంది.

ఇలా నాగవ్వ ,వైష్ణవీ సోనీ కలిసి ఇప్పటి వరకు మూడు సాలిడ్ సెన్సేషన్ ఫోక్ సాంగ్స్ లో కలిసి కనిపించగా ,ముందు ముందు మరిన్ని పాటల్లో కలిసి సందడి చేయాలని కోరుకుంటున్నారు ఫోక్ లవర్స్. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఈ జోడీ ఇంకెన్ని సంచలనాలకి తెర తీస్తుందో !

ALSO READ:గాజులు గలగల హిట్.. గజ్జెలు గలగల ఫ్లాప్.. రాధమ్మ కూతురికి ఏంటీ షాక్!

Tags

Related News

గాజులు గలగల హిట్.. గజ్జెలు గలగల ఫ్లాప్.. రాధమ్మ కూతురికి ఏంటీ షాక్!

నా జీవితంలో దారుణమైన చీకటి రోజులవే: రోహిత్!

ఝాన్సీ పుట్టినరోజు.. మంచి పనికి శ్రీకారం చుట్టిన రైతుబిడ్డ.. ఫ్యాన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్!

నాపై కేస్ పెడతామని బెదిరించారు..నిజాలు బయటపెట్టిన రోహిత్!

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపుమంట.. బాలు దెబ్బకు మీనా షాక్.. ఇదేం ట్విస్ట్ గురు..

Big Stories

Advertisement
×