Karthika Deepam 2 serial today Episode: దీపకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం జరిగిందో తెలియడం లేదు.. అసలు చచ్చిందా..? బతికిందా ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ మాలిని ఇంట్లో ఆలోచిస్తుంది. అప్పుడే సూరజ్ వస్తాడు. షర్ట్ నిండా రక్తపు మరకలు ఉంటాయి. అవి చూసిన మాలిన కంగారు పడుతుంది. ఏమైందని సూరజ్‌ను కంగారు పడుతూ అడుగుతుంది. సూరజ్ జరిగిన విషయం చెప్తాడు.
దీప వదినకు యాక్సిడెంట్ అయింది. తనను హాస్పిటల్‌కు తీసుకెళ్లి అడ్మిట్ చేసి వస్తున్నాను అని చెబితే.. నువ్వు ఎంత సాయం చేసినా వాళ్లు నిన్ను శత్రువు కొడుకుగానే చూస్తారు.. కానీ నీకేం హారతి ఇచ్చి స్వాగతం పలకరు అంటూ మాలిని తిట్టగానే.. సూరజ్ మాత్రం కనీసం హాస్పిటల్ లో ఉన్న దీప పరిస్థితి ఎలా ఉంది అని కూడా అడగడం లేదేంటి అమ్మ.. ఒక ప్రాణం పోతే ఆ ప్రాణం విలువ ఏంటో మనం తెలుసుకున్నాం అని చెప్తుంటే.. సరేలే రేపటి నుంచి నువ్వు కొత్త బ్రాంచ్‌కు వెళ్లు.. అక్కడి ఆఫీసు వ్యవహారాలు చూసుకో అని చెప్తుంది మాలిని. సూరజ్ సరే అంటాడు.
హాస్పిటల్‌లో ఉన్న దీపతో కార్తీక్ మాట్లాడుతుంటాడు. తనకు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే సూరజ్, జ్యోత్స్న కలిసి కాపాడారు.. మనం వాళ్లకు రుణపడేలా చేశారు అంటూ కార్తీక్ చెప్తాడు. ఇంకా జ్యోత్స్న రెస్టారెంట్స్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి కూడా చెప్తాడు కార్తీక్. అప్పుడే దీప నువ్వు వెళ్లి అమ్మ వాళ్లను పలకరించావా..? అని అడిగితే కార్తీక్ లేదని చెప్తాడు. అయితే వెంటనే వెళ్లి నువ్వు తాతకు నాన్నకు ఫైర్ యాక్సిడెంట్ గురించి తెలుసుకుని ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందా కనుక్కో బావ అని చెప్తుంది. దీప చెప్పినట్టుగానే.. కార్తీక్ వెంటనే శివనారాయణ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఒక్క మేనేజర్ తప్పా ఎవరూ ఉండరు. కార్తీక్ అడిగితే.. మేనేజర్ జరిగింది మొత్తం చెప్తాడు. శివనారాయణ వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారని అడిగితే.. తెలియదని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లిపోయారని చెప్తాడు మేనేజర్. కార్తీక్ కోపంగా మేనేజర్‌ను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
తన ఫోన్ ఎక్కడో మర్చిపోయానని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే సూరజ్ తన కారులో వెళ్తూ.. జ్యోత్స్న ఫోన్ గమనిస్తాడు. ఫోన్ తీసుకుని ఇది జ్యోత్స్న ఫోన్ లా ఉందే అనుకుంటుండగానే.. జ్యోత్స్న తన ఉన్న దగ్గర ఒక వ్యక్తి ఫోన్ తీసుకుని తన ఫోన్‌కు కాల్ చేస్తుంది. సూరజ్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ నా దగ్గరే ఉంది.. ఎక్కడ ఉన్నావో చెబితే వచ్చి ఫోన్ ఇస్తానని సూరజ్ అంటే జ్యోత్స్న కోపంగా తిడుతూ.. ఎక్కడ ఉన్నానని చెప్పాలి.. అంతా మోసం చేసి మమ్మల్ని నడ్డిరోడ్డు మీద నిలబెట్టారు కదరా అంటూ కాల్ కట్ చేస్తుంది. సూరజ్ ఆదే నెంబర్‌కు ఫోన్ చేసి ఆ వ్యక్తిని జ్యోత్స్న వాళ్లు ఎక్కడున్నారని అడుగుతాడు. ఆ వ్యక్తి అడ్రస్ చెప్తాడు. సూరజ్ నోట్ చేసుకుంటాడు.
కాంచన వాళ్లు శివనారాయణ వాళ్ల గురించి మాట్లాడుకుంటారు. ఎక్కడికి వెళ్లిపోయారోనని బాధపడుతుంటారు. అప్పుడే ఇంట్లోంచి వచ్చిన దీప వింటుంది. ఏమైంది అని అడిగితే జరిగిన విషయాలు మొత్తం చెప్తాడు కార్తీక్. కార్తీక్ చెప్పగానే.. దీప ఎమోషనల్ అవుతుంది. బాధతో మా అమ్మ ఎన్ని కష్టాలు పడుతుందో అని మనసులో అనుకుంటూ బావ మనం వెళ్లి అమ్మ వాళ్లను వెతుకుదాం పద అంటుంది. ఇద్దరూ కలిసి శివనారాయణ వాళ్లను వెతికే పనిలో పడతారు.
కార్తీక్, దీప ఎంత వెతికినా శివనారాయణ వాళ్ల జాడ కనిపెట్టలేకపోతారు. సూరజ్ తనకు శివనారాయణ వాళ్ల అడ్రస్ చెప్పిన వ్యక్తికి ఫోన్ చేసి వాళ్ల గురించి తాను ఇచ్చే నంబర్‌కు ఫోన్ చేసి చెప్పమంటాడు. ఆ వ్యక్తి సరే అంటే కార్తీక్ నెంబర్ ఇస్తాడు సూరజ్. సూరజ్ చెప్పినట్టుగానే.. ఆ వ్యక్తి కార్తీక్‌కు ఫోన్ చేసి శివనారాయణ వాళ్లు మణికొండ బస్టాండ్‌లో ఉన్నారని చెప్తాడు. దీప, కార్తీక్ అక్కడకు వెళ్తారు. వాళ్లను చూసి బాధపడుతూ.. నీ కూతురి ఇల్లు కంటే రోడ్డే బెటర్ అనుకున్నావా..? తాత అంటూ కార్తీక్ అంటే.. మేం ఇక్కడ ఉన్నామని ఎవరు చెప్పారని శివనారాయణ అడిగితే.. మేము మీ కోసం రెండు రోజుల నుంచి వెతుకుతున్నామని కార్తీక్ చెప్తాడు. ఇంటికి రమ్మని కార్తీక్ ప్రాధేయపడితే శివనారాయణ రానని చెప్తాడు. కార్తీక్, దీప బాధపడుతుంటారు. మీరు రాకపోతే మేము కూడా ఇక్కడే ఉండిపోతామని చెప్తారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.