Ninnu kori serial today Episode: హాస్పిటల్ నుంచి విరాట్‌ను దాక్షాయణి తమ ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్లిన విరాట్‌ను చూసి అందరు ప్రేమగా ఇంట్లోకి తీసుకెళ్తారు. అందరూ తనను ఇంట్లోకి తీసుకెళ్తుంటే.. విరాట్ కొత్తగా చూస్తుంటాడు. దాక్షాయణి శ్రీజను హారతి తీసుకురమ్మని చెప్తుంది. శ్రీజ హారతి తీసుకురాగానే విరాట్‌కు దిష్టి తీస్తుంది. ఏడుస్తూ.. హగ్ చేసుకోబోతుంటే.. విరాట్ ఫ్లీజ్ ఆగండి అసలు మీరంగా ఎవరు ఏం చేస్తున్నారు అంటూ అడగ్గానే.. దాక్షాయణి బాధగా సామ్రాట్ అలా అంటావేంట్రా.. నేను మీ అమ్మనురా నువ్వు ఏమైపోయావో తెలియక నీకోసం వెతికి వెతికి అలిసిపోయాను. నీ రాక కోసం మొక్కని దేవుడు లేడు.. తిరగని గుడి లేడు.. ఇన్ని రోజులు నువ్వేం అయిపోయావురా అంటూ అడగ్గానే..
విరాట్ ఆలోచిస్తూ.. ఇప్పుడేమన్నారు.. సామ్రాట్టా..? అంటే మీరేనా నన్ను చంపడానికి మనుషులను పంపారు.. అనగానే.. దాక్షాయణి కోపంగా నిన్ను చంపడానికి వచ్చారా..? ఎవరు నాన్న చెప్పు నేను చంపేస్తాను వాళ్లను అంటుంది. విరాట్ తల పట్టుకుని అసలు మీరందరూ ఎవరు..? అందరూ షాక్ అవుతారు. ఇంట్లో వాళ్లు సామ్రాట్‌కు ఏమైందని అడిగితే.. తనకు గతం గుర్తు లేదని దాక్షాయని చెప్తుంది. అంందరూ కలిసి ఇంట్లోకి తీసుకెళ్లి విరాట్‌కు గతం గుర్తు చేయాలని ప్రయత్నిస్తారు. ఫోటోలు, వస్తువులు చూపిస్తూ.. గత గుర్తులు చూపిస్తారు. సామ్రాట్టు ఫోటోలు చూస్తూ.. షాక్ అవుతాడు. తనకు ఏమీ గుర్తుకు రావడం లేదని విరాట్ బయటకు వెళ్లిపోతాడు.
శ్రీజ బాధగా బావకు గతం గుర్తుకు లేదంటే బావతో జరిగే నా పెళ్లి గురించ కూడా మర్చిపోయి ఉంటాడా..? అని ఏడుస్తుంది. అంతా కిటికీలోంచి వింటున్న మదన్ దేవుడా ఏంటి అనాథ అనుకుని సామ్రాట్ గారి ఫేస్‌ను విరాట్ గారికి పెట్టి తెలియకుండానే పెద్ద ప్రమాదంలోకి నెట్టేశాము. అక్కడ సామ్రాట్ గారి శత్రువులు విరాట్ గారిని చంపాలని చూశారు. ఈ నిజం తెలిస్తే చంద్ర గారి పరిస్థితి ఏంటి..? విరాట్ గారిని ఈ ఉచ్చు నుంచి ఎలా తిరిగి దక్కించుకోవాలి అనుకుంటూ మదన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
హాస్పిటల్‌లో ఉన్న చంద్ర దేవుడి ముందు కూర్చుని ఏడుస్తుంది. బావ రూపం మారింది.. ఇంట్లో వాళ్లకు ఎలా చెప్పాలన్న భయం ఒకవైపు ఇప్పుడు బావను ఎవరో తీసుకుపోవడం ఏంటి నాకు ఈ బాధ అంటూ ఏడుస్తుంది. డాక్టర్ వచ్చి చంద్రను ఓదారుస్తాడు. దేవుడనే వాడుంటే.. మళ్లీ మీరు కలిసే మార్గం చూపిస్తారు అని చెప్తుండగానే.. మదన్ వస్తాడు. మదన్‌ను చూసి కోపంగా నీ అజాగ్రత్త వల్ల అయన నాకు దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో నేను ఎలా కనిపెట్టాలి అనగానే.. విరాట్ గారు ఎక్కడున్నారో నాకు తెలుసు చంద్ర గారు. విరాట్ గారిని ఎవరో తీసుకెళ్లడం చూసి ఫాలో అయ్యాను అంటూ తాను చూసింది మొత్తం చెప్పేస్తాడు విరాట్. చంద్ర హ్యాపీగా పీలవుతూనే షాక్ అవుతుంది. ఇద్దరూ కలిసి విరాట్ కోసం వెళ్లాలని డిసైడ్ అవుతారు.
ఇంట్లో జగదీశ్వరి కోపంగా ఏంటి భార్యాభర్తలు కలిసి నాతో నాటకం ఆడుతున్నారా..? నిన్నటి దాకా నా ఆరోగ్యం గురించి చెప్పారు.. ఇప్పుడు బిడ్డ కోసం వెళ్తామనడం బాగాలేదు.. అంటూ తిడుతుంది. రఘురాం కూడా అవును చంద్ర మీరిద్దరూ బిడ్డ కోసం వెళ్లడం ఏంటి..? మాకు ఇష్టం లేదు అంటాడు. మీరు లేకపోతే మేము హ్యాపీగా ఎలా ఉంటాము చంద్ర అని అడగ్గానే.. మేము వెళ్లేది బెంగుళూరే కదా ఎప్పుడైనా రావొచ్చు పోవచ్చు అని చంద్ర చెబితే.. క్రాంతి కూడా వదిన నువ్వు వెలితే అన్నయ్య రాడు. నువ్వు ఇక్కడే ఉంటే అన్నయ్య వస్తాడు అని చెప్పగానే.. షాలిని మాత్రం అసలు బావగారు బతికే ఉన్నాడా..? గాయాలతో ఉన్న వ్యక్తి బెంగుళూరు ఎలా వెళ్లారు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.