Podarillu Today Episode September 17th :జయంతి వలన నీకు ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఇష్టమేనా అని మళ్ళీ మళ్ళీ అడుగుతాడు.. కానీ జయంతి మాత్రం ఎన్ని సార్లు అడుగుతారు నాన్న నాకు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఇష్టమే అని అంటుంది.. అదేవిధంగా మాధవ్ కూడా నాకు ఇష్టమైన చెప్పగానే.. ఈ పెళ్లి ఆగిపోయే మార్గమే లేదా అని అందరూ బాధపడిపోతూ ఉంటారు.. అయితే ఇక తాంబూలాలు మార్చుకోవడానికి చక్రి మహాని అడుగుతారు వాళ్ళిద్దరూ ఇష్టంగానే తాంబూలాలను అందుకుంటారు. ఆ తర్వాత బట్టలు మార్చుకో రమ్మని పంతులుగారు చెప్తారు ఇక అందరూ వాళ్ళింక రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటారు. మాధవ వస్తాడు కానీ జయంతి ఇంకా బట్టలు మార్చుకోలేదేమో అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ జయంతి ఈ ఎంగేజ్మెంట్ జరగట్లేదు..
జయంతి ఆ మాట అనగానే ఏమైంది ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఇందాక తాంబూలాలు మార్చుకునేటప్పుడు కూడా ఇష్టమే అన్నావు కదా.. లోపలికి వెళ్ళగానే నీకు ఏమైంది అని అందరూ అడుగుతారు. ఏమీ లేదు మేమిద్దరము మళ్ళీ కలిసి బతకాలి అనుకుంటున్నాము అని శేఖర్ అనగానే అంతా లోలోపల చాలా సంతోషంగా ఉంటారు. అవును నాన్న శేఖర్ నాకు ప్రామిస్ చేశాడు నా ఇష్టప్రకారమే ఉంటాను అని అన్నాడు. అందుకే నేను తనని మళ్లీ ఇష్టపడుతున్నాను. ఈ పెళ్లి క్యాన్సిల్ అయినందుకు నన్ను క్షమించండి అని జయంతి అంటుంది.. ఈ మాట వినగానే చెక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా ఒక్కసారిగా సంతోషంతో ఎగిరి గంతేస్తారు. ఇక జయంతితో పెళ్లి క్యాన్సిల్ అయినందుకు మాధవ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు.
పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పగానే అందరూ లోలోపల సంతోషపడుతున్న కూడా పైకి మాత్రం ఈ పెళ్లి ఆగిపోయిందని బాధలో ఉన్నట్లు నటిస్తారు. జయంతి తన పాత భర్తతోనే మళ్లీ కలిసిపోవడానికి ఒప్పుకోవడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఏంటి వాళ్ళ అమ్మ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు ఏంటి ఆటలాడుతున్నావా అని అంటుంది. అయితే తాయారు మాత్రం ఏంటి ఇదంతా.. ఇలా నాటకాలు ఆడడం మీకు ఏమైనా అలవాట ఎందుకలా అంటున్నారు. పాత మొగుడితో వెళ్లిపోతాను పాత పద్ధతిని ఫాలో అవుతాను అని అంటున్నారు కొంచమైనా మీకు లేదా అని తాయారు పెద్ద రచ్చ చేస్తుంది. మా అక్క అలానే ఉంటుంది మా అక్క ఏమంటే అదే గ్రేట్ అంటూ జయంతి తమ్ముడు అనగానే చక్రి ఒక్కసారి ఇలా వస్తావా నీతో పని ఉంది అని చెంప పగలగొడతాడు. ఇలా మీరు చేయడం ఏమైనా బాగుందా అని తాయారు కూడా పెద్ద రచ్చ చేస్తుంది.
ఏది ఏమైనా కూడా మాధవ్ పెళ్లి జరగకుండా ఆగిపోయింది అని ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇలా జరగడం నిజంగానే కొత్త ఉంది అని అనుకుంటారు. ఇక లోపలికి గదిలోకి వెళ్ళగానే అందరూ కూడా అదిరిపోయే సాంగ్ పెట్టుకొని చాలా సంతోషంగా ఉంటారు. ఇన్ని రోజులు ఆ జయంతి పెద్దికి కరెక్టు కాదు అని నేను అనుకున్నాను ఈ పెళ్లి ఎలా క్యాన్సల్ అయిపోతే బాగుండు అని ఆలోచిస్తున్నాను అప్పుడే ఇలాంటి వార్త వినడం చాలా సంతోషంగా ఉంది అని మహాలక్ష్మి కూడా చాలా సంతోషంగా కనిపిస్తుంది.. అది చూసిన మిగిలిన వాళ్ళందరూ కూడా డాన్సులు వేసి చాలా సంతోషంగా ఉంటారు ఎపిసోడ్ కి ఇదే హైలెట్గా నిలుస్తుంది. వీళ్ళందరూ డాన్స్లు వేసి చాలా సంతోషంగా ఉండడం చూసిన మాధవ్ నా పెళ్లి క్యాన్సిల్ అయింది అని మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా అని అంటాడు ఆ మాట వినగానే అందరూ కాస్త సీరియస్ ఫేస్ పెడతారు. కానీ ఈ పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నట్లు చెబుతారు.
చక్రి వాళ్ళందరూ గదిలో సంతోషంగా ఉండగా అప్పుడే లోపలికి జయంతి పాత మొగుడు శేఖర్ వస్తాడు. తమ్ముడు నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడువి అంటూ చాలా సంతోషంగా చెప్తాడు. అసలు ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి చక్రీ ఏం చేశాడు అని శేఖర్ ని అందరూ అడుగుతారు.. శేఖరు జయంతిని ఎలా ఒప్పించాడు అని చెప్పమని అందరూ అడుగుతారు.. శేఖర్ చెప్పిన మాట విని అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. జయంతి కాళ్లు పట్టుకున్న తర్వాతే తను రియలైజ్ అయిందని అనుకుంటారు.. జయంతి మనసు కరిగిపోవడానికి కారణం చక్రినే అతను చెప్పినట్టే నేను చేశాను.. దేవుడిచ్చిన తమ్ముడు అంటూ శేఖర్ చక్రిని సెగ పొగిడేస్తూ ఉంటాడు.. మొత్తానికి చక్రి అనుకున్న ప్లాన్ ప్రకారం పెళ్లి సంబంధం క్యాన్సల్ అవ్వడం అందరూ చక్రిని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు.
ఇంట్లోని వాళ్ళందరూ కూడా మాధవ సంబంధం చెడిపోయిందని చాలా సంతోషంగా ఉంటారు కానీ… మాధవ్ తన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోవడానికి ఈ కారణం చక్రిని చాలా కోపంగా ఉంటాడు. అయితే ఈ పెళ్లి సంబంధం చెడిపోవడానికి కారణం నేనే అన్నయ్య.. జయంతి మన ఇంటికి రావడం ఇష్టం లేకే నేను ఇదంతా చేశాను అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అని చక్రి అనగానే ఎందుకురా నేను నా సంతోషం కోసం ఇదంతా చేశానా నా తర్వాత మీ అందరికీ పెళ్లిళ్లు కావాలనే కదా ఇదంతా చేశాను. మీరు ఎప్పటికీ ఇలానే ఉండిపోతారా నాకు నచ్చినట్టు నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను తప్ప నా సుఖాన్ని నేను ఏ రోజు చూసుకోలేదు అని మాధవ్ అంటాడు.. ఆ మాట వినగానే మిగిలిన వాళ్ళందరూ చాలా ఫీల్ అవుతారు. ఇక అటు శైలు కేశవ తో గొడవ పడిందని ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కానీ శైలు మాత్రం వరాలకి షాకిచ్చేలా మాట్లాడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…