E-Paper
Advertisement

Podarillu Today Episode : గుడ్ న్యూస్ చెప్పిన గాయత్రి.. రాఖీ కట్టిన తాయారు.. ఇదా అసలు ప్లాన్..?

Podarillu Today Episode : గుడ్ న్యూస్ చెప్పిన గాయత్రి.. రాఖీ కట్టిన తాయారు.. ఇదా అసలు ప్లాన్..?
Advertisement

Podarillu Today Episode august 31st : గాయత్రి కనిపించలేదు అని తయార్ ఇల్లంతా వెతకగా అప్పుడే గాయత్రి వస్తుంది. ఏంటే ఆ ఇంటికి వెళ్ళుతున్నావా నువ్వు అని అరుస్తుంది. నేను ఆ ఇంటికి వెళ్లి వస్తున్నాను. ఇప్పుడు ఏంటి తప్పు ఏమైంది అని గాయత్రి వాదనకు దిగుతుంది. రమణయ్య రాఖీలు తీసుకొని రావడంతో ఇతను మాత్రమే నీకు అన్నయ్య ఆ నారాయణ నీకెందుకు అన్నయ్య కాదు మావయ్య నీ గురించి ఎంత గొప్పగా చెప్పాడో తెలుసా అని గాయత్రి అంటుంది. చెల్లమ్మ ఇది మంచి సమయమే నువ్వు ఆ నారాయణ కు రాఖీ కట్టి సంతకం అడుగు ఆ ఇల్లు మన సొంతమవుతుంది అంటూ రమణయ్య సలహా ఇస్తాడు.. తయారుకు ఇష్టం లేకపోయినా సరే తన అన్న ఆస్తి కోసమని కాంప్రమైజ్ అవుతుంది.

మహా, ఆదిని కలిపేందుకు ప్లాన్..

మహాలక్ష్మి చేత వాళ్ళ అన్నయ్యకి ఎలాగైనా రాఖీ కట్టించాలి అని ఆలోచించిన చక్రి హారిక కు ఫోన్ చేస్తాడు. మహాలక్ష్మి చాలా బాధపడిపోతుంది అండి వాళ్ళ అన్నయ్యకు రాఖీ కట్టాలని చాలా ఆనందంగా వెయిట్ చేస్తుంది అని చక్రి అనగానే ఆది ఉన్న మూడులో అది ఇప్పుడు జరగదు అని హారిక చెబుతుంది. వాళ్ళు ఇంట్లో కలవడం కుదరదు కానీ బయట కలిస్తే వాళ్ళ మధ్య ప్రేమ చిగురుస్తుంది కదా రాఖీ పౌర్ణమితో వారిద్దరు దగ్గరవుతారు కదా అని చక్రి హారిక ప్లాన్ చేస్తారు. మరి మహాలక్ష్మి ఆదిని చక్రి కలుపుతాడా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఇక తాయారుకు గాయత్రీ చెప్పడంతో రాఖీ కట్టాలని అక్కడికి వెళ్లాలి అని అనుకుంటుంది. అయితే ఏ రమణయ్య రాఖి పేరు చెప్పి ఆ స్థలం మీద సంతకం పెట్టించుకొని నాలుగు ఎక్కిచ్చి తాయారు అని పంపిస్తాడు. నిజంగానే గాయత్రి వాళ్ళ అమ్మ తన మాట విని ఒప్పుకుంది అని చాలా సంతోషంగా ఉంటుంది.

గుడ్ న్యూస్ చెప్పిన గాయత్రి..

Advertisement

గాయత్రి చాలా సంతోషంగా మాధవ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. మా అమ్మ వస్తుంది అని మావయ్య ఎక్కడ అని హడావిడి చేస్తుంది.. ఏమైంది గాయత్రి ఎందుకు నువ్వు అంతగా గాబరా పడుతున్నావు ఏమైనా జరిగిందా అని వాళ్ళందరూ అడుగుతారు.. కానీ మా అమ్మ మావయ్యకి రాఖీ కట్టడానికి ఇక్కడికి రాబోతుంది అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏంటి మీ అమ్మ రాఖీ కట్టడానికి ఈ ఇంటికి వస్తుందా? ఇదెక్కడి విచిత్రం అంటూ అందరూ ఒకరినొకరు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ గాయత్రి మాత్రం నేను చెప్పడం వల్ల మా అమ్మ ఇక్కడికి వస్తుంది అని అంత ఇంట్లో హడావిడి చేస్తుంది.. నిజంగానే మీ అమ్మ వస్తుందని అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.

తాయారు రాకతో బృందావనం హ్యాపీ..

తాయారు బయటికి రాగానే అందరూ చూసి నిజంగానే తాయారు అత్త వచ్చింది అని సంతోషంగా బయటికి వెళ్తారు. మాధవ్ చాలా సంతోషంగా వెళ్లి రా అత్త ఇంట్లోకి కాళ్లు కడుక్కొని మగ్గుతో నీళ్లు తెచ్చి ఇవ్వగానే. ఏంటి మీ నాన్న కనీసం కడుక్కోడానికి నీళ్లు కూడా ఇవ్వడా ఇంట్లోకి రావడం ఇష్టం లేదా అని మాట్లాడుతుంది తాయారు. కానీ నారాయణ వచ్చి తాయారుకి ఇష్టం లేకపోయినా నీళ్ళు తెచ్చి ఇస్తాడు. కాల్లు కడుక్కుని లోపలికి వెళ్ళిన తాయారు ఇంట్లోకి వెళ్ళగానే అంతా తను అనుకున్న ప్రకారం అంత జరిగేలా చూడాలని అనుకుంటుంది నిజంగానే అన్న మీద ప్రేమతో వచ్చినట్లుగానే అంత హడావిడి చేస్తుంది తాయారు. మహాలక్ష్మి ఈ ఇంటికి కొత్త కళ వచ్చింది అని సంతోష్ పడిపోతూ ఉంటుంది..

తాయారు ప్లాన్ ఇదా..?

Advertisement

తాయారు రాఖీ కట్టిన తర్వాత అందరూ డబ్బులు పెడతారు.. అంతే కాదు మహాలక్ష్మి చీర పెట్టడంతో తయారు చాలా సంతోషంగా ఉంటుంది. ఏంట్రా నారిగా నువ్వేమి పెట్టవా అని అడుగుతుంది. నేనేం పెట్టాలి? ఏం కావాలి నీకు అడుగు అని అడుగుతాడు. నాకు ఒక సంతకం కావాలి అని అడగ్గాని అందరూ షాక్ అవుతారు. ఈ స్థలంలో నాకు వాటా కావాలి అని తను కొన్ని పత్రాలు తీసుకొని వస్తుంది. నువ్వు రాఖీ కట్టింది ఇందుకోసం అని నారాయణ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. నువ్వు నిజంగా దీనస్థితిలో ఉండి నా ఇంటికి వచ్చి ఉంటే నిన్ను నీ బిడ్డని చూసుకోలేని అసమర్ధుడిని కాదు అని నారాయణ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. తాయరు ప్లాన్ ఇదా అని అందరూ కంగారు పడిపోతుంటారు.. తాయారు మనసులోని మాట తెలుసుకున్న అందరూ కూడా నువ్వు ఇలాంటి దానివని అస్సలు ఊహించలేదు అంటారు. కానీ గాయత్రి మాత్రం తన తల్లి ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు అని ఎమోషనల్ అయిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..

Related News

Intinti Ramayanam Pallavi : పల్లవి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: బాలు కోసం మీనా టెన్షన్.. రోహిణి కోపం కొల్లేరు.. గుణకు సాయం..

Podarillu Today Episode : జమున పై మహాకు అనుమానం.. కేశవకు అండగా కుటుంబం.. కన్నీళ్లు పెట్టుకున్న కేశవ..

Karthika Deepam 2 Serial Today Episode October 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తిరిగొచ్చిన జ్యోత్స్న – కొట్టబోయిన సూరజ్           

Intinti Ramayanam Today Episode: వదిన కోసం కమల్ కన్నీళ్లు.. భానుమతికి వార్నింగ్.. అవనికి షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్.. బాధపడ్డ రామరాజు.. భద్రకు ధీరజ్ వార్నింగ్..

Brahmamudi Serial Today Episode October 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ రాసిన ఒక్క లవ్‌ లెటర్‌ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేసిందో తెలిసా..?  

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×