BigTV English

Bramhamudi Serial: హీరోయిన్స్ రేంజ్ లో డిమాండ్ చేస్తున్న బుల్లితెర అత్తాకోడళ్లు..?

Bramhamudi Serial: హీరోయిన్స్ రేంజ్ లో డిమాండ్ చేస్తున్న బుల్లితెర అత్తాకోడళ్లు..?

Bramhamudi Serial: ముఖ్యంగా సినిమాలకు ఎంత క్రేజ్ అయితే ఉందో బుల్లితెర సీరియల్స్ కి కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పవచ్చు. సీరియల్స్ కూడా నిత్యం మన ఇంట్లో జరిగే సంఘటన లాగే అనిపిస్తూ ఉంటాయి. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సీరియల్స్ కోసం ఆడ, మగ , చిన్న, పెద్ద అని తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అలా చాలా సీరియల్స్ ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నాయి. అంతేకాదు ఈ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన నటీనటులు కూడా సినిమా హీరో, హీరోయిన్ల రేంజ్ లో పారితోషకం తీసుకుంటూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక వారిలో బ్రహ్మముడి సీరియల్ కావ్య కూడా ఒకరు.


టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసిన బ్రహ్మముడి సీరియల్
.రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా ఫేమస్ అయిన కావ్య ఇప్పుడు పలు షోలలో కూడా తన కామెడీ పంచ్ లతో మరింత ఫేమస్ అయ్యింది. బ్రహ్మముడి సీరియల్ తో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె.. ఈ సీరియల్ కోసం భారీగానే డిమాండ్ చేస్తోంది. ఈ సీరియల్ కోసం ఈమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం బుల్లితెరపై కార్తీకదీపం 2 సీరియల్ కి గట్టి పోటీ ఇస్తూ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసిన సీరియల్ బ్రహ్మముడి. ఇందులో కావ్య పాత్రలో దీపిక రంగరాజు , రాజ్ పాత్రలో మానస్ నాగులపల్లి హీరో, హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా.. షర్మిత గౌడ, నైనిషా రాయ్, శ్రీ ప్రియ శ్రీకర్, గిరి శంకర్ తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. ఇకపోతే ఈ సీరియల్ కోసం పనిచేస్తున్న ప్రధాన పాత్రధారులతో పాటు మిగతా నటీనటుల పారితోషకాలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

ఆశ్చర్యపరుస్తున్న అత్తా కోడళ్ళ రెమ్యూనరేషన్.


ఇందులో నటీనటుల పారితోషకం విషయానికి వస్తే.. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న మానస్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.30 వేలు పారితోషకం తీసుకుంటూ ఉండగా.. నెలకు 20 రోజుల వరకు బ్రహ్మముడి సీరియల్ షూటింగ్ సాగుతుంది. అంటే ఈ సీరియల్ ద్వారా నెలకు రూ.6 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. ఇక కావ్య విషయానికి వస్తే.. ఇందులో రాజ్ కంటే కావ్య ఎక్కువ పారితోషకం తీసుకుంటుంది. ప్రస్తుతం ఈమెకు ఉన్న పాపులారిటీ కారణంగా ఒక్కరోజు ఎపిసోడ్ కోసం రూ.35 వేల వరకు పారితోషకం తీసుకుంటూ ఉండటం గమనార్హం. వీరితోపాటు ఇందులో విలన్ పాత్రలో.. కావ్య అత్తగా నటిస్తున్న రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ కూడా రాజ్ , కావ్య పాత్రలకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకుంది.ఈమె కూడా ఒక్కో ఎపిసోడ్ కోసం ఏకంగా 25 వేల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా బుల్లితెరపై ఈ అత్తాకోడళ్లు హీరోయిన్స్ రేంజ్ లో పోటీపడుతూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు వీరి రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.

Vishwambhara: విశ్వంభర ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్.. “రామ రామ” అంటూ భక్తి పారవశ్యంలో ముంచేసిన చిరు..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×