BigTV English

Vennela Kishore: నాకంటే తాగుబోతు రమేష్ బెస్ట్.. కానీ అలాంటిది అవసరం లేదు – వెన్నెల కిషోర్

Vennela Kishore: నాకంటే తాగుబోతు రమేష్ బెస్ట్.. కానీ అలాంటిది అవసరం లేదు – వెన్నెల కిషోర్

Vennela Kishore:  తెలుగు సినిమా ఇండస్ట్రీలో, హాస్యనటులుగా గుర్తింపు తెచ్చుకోవడం అంతా సులభం కాదు. నటన అందరూ చేస్తారు కానీ, హాస్యాన్ని పండించడం చాలా కష్టం. హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం. తరువాత ఆలీ, నరేష్, సునీల్, ఇలా చాలామంది ఉన్నారు. ఆ తర్వాత ఆ జాబితాలో షకలక శంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, సత్య, తాగుబోతు రమేష్, ప్రియదర్శి , వెన్నెల కిషోర్, హర్ష ఇలా ఈ తరాన్ని నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్తున్న వారు ఉన్నారు.వెన్నెల కిషోర్ ఇప్పుడు వచ్చే ప్రతి సినిమా లో కనిపిస్తున్నారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఎక్కువగా కనిపిస్తారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ,ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి, రూప కోడువాయుర్ జంటగా నటిస్తున్నారు. ఈ వేసవి కానుకగా ఈ సినిమా థియేటర్లో సందడి చేయండి. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ షురూ చేశారు. తాజాగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి హర్ష ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో వెన్నెల కిశోర్ తాగుబోతు రమేష్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


నాకన్నా ఆయనే బెటర్ ..

సారంగపాణి జాతకం ప్రమోషన్స్ లోభాగం గా  వెన్నెల కిషోర్ ను యాంకర్ మీరు ఇటువంటి పాత్ర నేను చేయలేను అని ఎప్పుడైనా అనుకున్నారా, అని అడగ్గా.. వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. తాగుబోతు క్యారెక్టర్ చేయడం అంటే చాలా కష్టం. నేను ఎటువంటి క్యారెక్టర్ నైనా చేస్తాను కానీ, తాగుబోతు లాగా యాక్టింగ్ చేయమంటే మాత్రం నా వల్ల కాదు. దానికి బెస్ట్ గా నాకంటే బాగా తాగుబోతు రమేష్ చేస్తాడు. మెలోడీ డ్రామా అండ్ ఫన్నీ లో తాగుబోతు రమేష్ తరువాత హర్ష బాగా చేస్తాడు. అలాంటి క్యారెక్టర్ నన్ను చేయమంటే నావల్ల కాదు సార్. నేను వెంటనే డైరెక్టర్ కి చెప్తాను తాగుబోతు క్యారెక్టర్ అయితే, అటు ఇటు ఊగకుండా మామూలుగా డైలాగ్ చెప్పమంటారా అని డైరెక్టుగా అడిగేస్తాను. రమేష్ చేసినంత బాగా నాకు రాదు. ఏదో మేనేజ్ చేస్తూ ఉంటాను అంతే అని వెన్నెల కిషోర్ తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనకంటే రమేషే బాగా చేస్తాడని తన మనసులో మాటని కిషోర్ బయట పెట్టడం నిజంగా అభినందించాల్సిన విషయం అని అంటున్నారు అభిమానులు.


పూర్తి  నవ్వులతో ..

సినిమా విషయానికి వస్తే సారంగపాణి జాతకం సినిమా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలింగ కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా మెయిన్ పాయింట్ జాతకాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జాతకాలను ఎక్కువగా నమ్మే హీరో క్యారెక్టర్ లోప్రియదర్శి ,నటిస్తున్నాడు.ఈ సినిమా పూర్తి కామెడీ సినిమా గా మన ముందుకు రానుంది .ఈ సినిమాలో ప్రియదర్శి , హర్ష, నరేష్, తనికెళ్ల భరణి కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ వేసవి కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతుంది.

RGV: హార్రర్ కామెడీతో వస్తున్న రామ్ గోపాల్ వర్మ.. ఎన్ని యుద్ధాలు జరుగుతాయో

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×