Vishwambhara..మెగా అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్న విశ్వంభర(Vishwambhara ) సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. “రామ రామ” అంటూ సాగే ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శ్రీరాముడి గొప్పతనం ఈ పాటలో మనకు వివరించారు.ఇక ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ లిరికల్ వీడియో మెగా అభిమానులనే కాదు రామ భక్తులను కూడా భక్తి పారవశ్యంలో ముంచేస్తోంది. ఇకపోతే అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూసిన చిరంజీవి అభిమానులకు ఇది మంచి ట్రీట్ అని చెప్పవచ్చు. ఇక ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇలాంటి పాటను విడుదల చేయడం శుభారంభంగా అభిమానులు సైతం భావిస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) హీరోగా వశిష్ట మల్లిడి (Vassista Mallidi) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. ఇందులో త్రిష (Trisha ) చాలా ఏళ్ల తర్వాత మళ్లీ చిరంజీవితో జతకట్టబోతోంది. ఆషికారంగనాథ్ కూడా మరో హీరోయిన్గా నటిస్తోంది.
లిరికల్ సాంగ్ వీడియో విషయానికి వస్తే..
రామా.. శ్రీ రామా.. రామా.. అంటూ పండుగ వాతావరణం క్రియేట్ చేశారు.. రామా అనే పదం వింటేనే రోమాలు నిక్కబొడుచుకునేలా.. అందుకు తగ్గట్టుగా వీఎఫ్ఎక్స్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక లిరికల్ సాంగ్ విషయానికి వస్తే.. శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపిస్తూ..జైశ్రీరామ్.. అంటూ శంఖం పూరిస్తూ.. చిరంజీవి పాటను ఆరంభించారు. “రమ..రామా..రామా.. రామ..రామా.. హేయ్.. తయ్యాతక్కా.. తక్కాదిమ్మి .. చెక్కా భజనలాడి రాములోరీ గొప్ప చెప్పుకుందామా..ఆ సాములోరి పక్కనున్న సీతామాలచ్చుమమ్మా లక్షణాలు ముచ్చటించుకుందామా..” అంటూ ప్రతి అక్షరాన్ని చాలా లోతుగా వర్ణించినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ప్రతి పదంలో కూడా రాములోరి గొప్పతనం.. వింటుంటే భక్తులు సైతం పరవశించి పోయేలా చాలా అద్భుతంగా రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు పదాలు సమకూర్చారు. మొత్తానికైతే పాటతోనే భారీ అంచనాలు క్రియేట్ చేశారు చిరంజీవి.
Ranbir Kapoor: అందుకే దీపికా మా ఇంటి కోడలు కాలేదు – ఆలియా అత్త..!
విశ్వంభర విడుదల తేదీ..
చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ విశ్వంభర సినిమా.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేస్తామని.. సినిమా ప్రకటించిన రోజే అనౌన్స్మెంట్ చేశారు. కానీ చిరంజీవికి అనారోగ్య సమస్యల కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దాంతో విడుదల తేదీని కూడా వాయిదా వేశారు. ఇక మే 9వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అది కూడా ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఇక మరొకవైపు జూన్ 24వ తేదీన ‘ఇంద్ర’ సినిమా రిలీజ్ అయింది. కాబట్టి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో అనే కోణంలో, అదే రోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా విడుదల తేదీ పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కానీ ఈ సినిమా కోసం మాత్రం అభిమానులు చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.
అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ✨ #Vishwambhara First Single #RamaRaama out now 📷 https://t.co/mEvlv8wIbl #Chiranjeevi #BIGTVcinema #HanumanJayanti2025 @KChiruTweets
Music by the Legendary @mmkeeravaani
📷Lyrics by 'Saraswatiputra' @ramjowrites
📷Sung by… pic.twitter.com/gbf1pSnBbN
— BIG TV Cinema (@BigtvCinema) April 12, 2025