BigTV English

Eggless Omelette Pure Veg: గుడ్డు లేకుండా ఆమ్లేట్.. అదే రుచితో పూర్తి శాఖాహారం.. ఎలా చేయాలంటే

Eggless Omelette Pure Veg: గుడ్డు లేకుండా ఆమ్లేట్.. అదే రుచితో పూర్తి శాఖాహారం.. ఎలా చేయాలంటే

Eggless Omelette Pure Veg| ఆమ్లేట్ అంటే అందరూ ఇష్టపడతారు. ఇంట్లో భోజనంతో పాటు గుడ్డు లేదా ఆమ్లేట్ ఉంటే రెండు ముద్దలు ఎక్కువ తింటారు. పైగా ఆమ్లేట్ చేయడం చాలా ఈజీ. దీంతో కోడి గుడ్డు మనఅందరి జీవితం దైనిక జీవితంలో ఓ భాగం. డాక్టర్లు కూడా గుడ్డు పూర్తిగా శాఖాహారమని చెబుతుండగా.. కొంతమంది మాత్రం తాము స్వచ్ఛమైన శాఖాహారులమని గుడ్డు కూడా తినకూడదని అభిప్రయాపడుతుంటారు. అలాంటి వారి కోసం గుడ్డు లేకుండా ఆమ్లేట్ తయారు చేసే రెసిపీ ఒకటి ఉంది. ఆశ్చర్యం అనిపించినా గుడ్డు లేకుండా ఆమ్లెట్ తయారుచేయడం అసాధ్యమేమీ కాదు. ఈ విధంగా చేస్తే శాకాహారులు కూడా ఆమ్లేట్ టేస్ట్‌ను ఆస్వాదించవచ్చు. గుడ్డు తినని వారు లేదా పూర్తిగా వెజిటేరియన్‌లకు ఇది ఓ బెస్ట్ ఆప్షన్. ఈ ఆమ్లెట్‌ను బ్రేక్‌ఫాస్ట్‌కి లేదా ఈవెనింగ్ స్నాక్స్‌గా తినచ్చు.


ఈ వెజిటేరియన్ బ్రెడ్ ఆమ్లెట్‌ను ఎలా తయారుచేయాలో చూద్దాం. తయారీకి కావాల్సిన పదార్థాలు ఇవే:

  • శనగపిండి – ఒకటిన్నర కప్పు
  • బేకింగ్‌ పౌడర్‌ – 1 టేబుల్‌ స్పూన్
  • బియ్యపిండి – అరకప్పు
  • ఉప్పు – రుచికి తగినంత
  • మిరియాల పొడి – పావు టీస్పూన్
  • పసుపు – పావు టీస్పూన్
  • పచ్చిమిర్చి తరిగినవి – 1 టేబుల్‌ స్పూన్
  • కొత్తిమీర తరిగినది – 3 టేబుల్‌ స్పూన్లు
  • టమాటా తరిగినవి – 3 టేబుల్‌ స్పూన్లు
  • ఉల్లిపాయ తరిగినవి – 2 టేబుల్‌ స్పూన్లు
  • చాట్ మసాలా – అరకప్పు
  • బ్రెడ్‌ స్లైసెస్‌ – 4 లేదా 5
  • నెయ్యి లేదా నూనె – అవసరమైనంత

Also Read: వ్యాధుల బారిన పడకుండా, ఫిట్‌గా ఉండాలంటే తినాల్సినవి ఇవే !


తయారీ విధానం ఇలా

మొదటిగా, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బియ్యపిండి, శనగపిండి, చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు, బేకింగ్ పౌడర్, పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పొడి మిశ్రమంలో తగినంత నీరు పోసుకుంటూ మిశ్రమాన్ని 3-4 నిమిషాల పాటు బీట్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో గింజలు తీసేసిన తరిగిన టమాటా ముక్కలు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మళ్లీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచాలి.

ఇప్పుడు స్టవ్‌పై పాన్ ఉంచి నెయ్యి లేదా నూనె వేసి కాగాక అందులో బ్రెడ్ స్లైస్ ఉంచాలి. అది దోరగా కాలాక రెండో వైపున కూడా నెయ్యి రాసి క్రిస్పీగా కాల్చాలి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసులు కాల్చి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత మళ్లీ పాన్‌పై నెయ్యి వేసి వేడి అయ్యాక ముందు తయారుచేసిన పిండి మిశ్రమాన్ని పోయాలి. పాన్‌పై అన్ని వైపులా మిశ్రమాన్ని విస్తరించాలి. అయితే అది చాలా పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఉండాలి.

అంచుల చుట్టూ కొద్దిగా నెయ్యి రాసి, మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్‌లో బాగా రోస్ట్ చేయాలి. ఇప్పుడు పిండి మధ్యలో కాస్త తడిగా ఉన్నపుడు, ముందే కాల్చిన బ్రెడ్ స్లైస్‌ను ఉంచాలి. ఆ బ్రెడ్ చుట్టూ ఉన్న పిండి అంచులను నాలుగు వైపులా లోపలికి మడవాలి. ఆపై రెండువైపులా కొద్దిగా నెయ్యి వేసి బాగా కాల్చాలి.

ఇలాగే మిగిలిన పిండి మిశ్రమం మరియు బ్రెడ్ స్లైసులతో ఆమ్లెట్‌లను (Eggless Bread Omelette)  తయారుచేయొచ్చు. తెలిసిందిగా.. ఇంకెందుకు ఆలస్యం త్వరగా వంటింట్లో దూరి ట్రై చేయండి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×