E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 12th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని ఫాలో అయిన అమర్‌ – ఆరు డైరీ చదివిన మిస్సమ్మ  

Nindu Noorella Saavasam Serial Today February 12th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని ఫాలో అయిన అమర్‌ – ఆరు డైరీ చదివిన మిస్సమ్మ  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  రణవీర్‌ వచ్చినప్పటి నుంచి మనోహరిలో మార్పు గమనించాను. మనోహరి మన దగ్గర ఏదో దాస్తుంది అనుకుంటున్నాను అని అమర్‌ చెప్పగానే.. రాథోడ్‌ ఇన్నాళ్లకు కరెక్టు రూట్‌ లో ఆలోచిస్తున్నారు సార్‌. డొంక లాగండి.. తీగంతా కదులుతుంది అని చెప్తాడు. అలాగే ఆ బాబ్జీ గురించి కూడా కొంచెం గట్టిగా వెతకండి సార్‌ అని చెప్తాడు. వాణ్నే ప్రయారిటీగా పెట్టుకున్నాను రాథోడ్‌. వాడికోసం ఒక టీం వెతుకుతుంది. అరుందతి లాంటి అమాయకురాలిని చంపిన వాడి ముఖాన్ని చూడాలి. నా భార్యను ఎందుకు చంపారో కారణం తెలుసుకోవాలి అని చెప్తుండగానే.. ఒక టర్నింగ్‌ దగ్గర మనోహరి స్పీడుగా కారులో వెళ్లడం చూస్తారు. సార్‌ ఆ కారులో మనోహరి ఉంది అంటాడు రాథోడ్‌.. అమర్‌ కూడా అవును రాథోడ్‌ మనోహరి ఎందుకు అంత స్పీడుగా వెళ్తుంది. ముందు ఆ కారును ఫాలో చేయ్‌ రాథోడ్‌ అని చెప్పగానే రాథోడ్‌ అలాగే సార్‌ అంటూ ఫాలో చేస్తాడు.

ఇంట్లో మిస్సమ్మ ఫైల్స్‌ సర్దుతూ.. ఆరు రాసిన డైరీ చూస్తుంది. వెంటనే అమర్‌ తిట్టిన విషయం గుర్తుకు వచ్చి అక్క డైరీ చదివే రైట్స్‌ భర్తగా ఆయనకు మాత్రమే ఉంది కదా అనుకుంటుంది. మళ్లీ ఇప్పుడు నేను ఆయన భార్యను.. అంటే ఆయనలో సగం.. అంటే ఇప్పుడు ఈ డైరీ సగం చదివే రైట్స్‌ నాకు ఉన్నాయి కొంచెం చదివితే తప్పేం కాదులే అని డైరీ ఓపెన్‌ చేసి చదువుతుంది. ఆరు అక్కకు కూడా ఎఫ్‌ఎం వింటుందా..? నాకు తెలిసిన అక్క..ఆరు అక్కా ఒక్కరేనా ఏంటి అని అనుమానపడుతుంటే.. వెంటనే కిటికీ దగ్గరకు వచ్చిన ఆరు మిస్సమ్మ డైరీ చూడటం చూసి కంగారుపడుతుంది. దగ్గరకు పిలిచి కొంచెం మాట్లాడాలి బయటకు రా అంటుంది. మిస్సమ్మ సరే వస్తున్నాను అంటూ బయటకు వెళ్తుంది.

Advertisement

మనోహరి కారును ఫాలో అయిన అమర్‌ ఒక దగ్గర కారు ఆగడంతో మనోహరి ఇక్కడ దిగిందేంటి..? అనుకుంటాడు అమర్‌. రాథోడ్‌ కూడా అమ్మ మనోహరి కరెక్టు టైంకు కరెక్టుగా దొరికిపోయావు. నాకు తెలిసి రణవీర్‌ ముంబై వెళ్లి ఉండడు. వాన్ని  కలవడానికే వచ్చినట్టు ఉన్నావు. ఇప్పుడు సార్‌ను లోపలికి పంపిస్తా.. నిన్ను అడ్డంగా బుక్‌ చేస్తా.. అని మనసులో అనుకుని.. సార్‌ ఆవిడ వెళ్లిన స్పీడు చూస్తుంటే.. మనిషి కంగారుగా ఉన్నారని అర్థం అవుతుంది. నాకు తెలిసి మీ అన్ని ప్రశ్నలకు లోపల సమాధానం ఉందేమో అనిపిస్తుంది సార్‌ అంటాడు. అమర్‌ అనుమానంగా చూస్తుంటాడు.

గార్డెన్‌ లోకి వెళ్లిన మిస్సమ్మ అక్కా ఏంటి మాట్లాడాలి అన్నారు అంటూ వస్తుంది.  ఆ విషయం తర్వాత ముందు చెప్పు నువ్వు డైరీలో ఏం చదివావు అని అడుగుతుంది ఆరు. అక్క ఫ్యామిలీ గురించి తనకు ఇష్టమైన ఆర్‌జే గురించి రాసి ఉంటే చదివాను అంటుంది. ఆరు కంగారుగా చదివేశావా..? మొత్తం తెలిసిపోయిందా అని అడుగుతుంది. ఏం చదవడం గురించి మాట్లాడుతున్నారు అక్కా అంటుంది మిస్సమ్మ. ఇంత కూల్‌గా అడిగింది అంటే ఏం చదవలేదని అర్థం అవుతుంది అని మనసులో అనుకుంటుంది ఆరు.

Advertisement

తర్వాత మిస్సమ్మకు రాథోడ్‌ ఫోన్‌ చేసి మనోహరి సార్‌కు అడ్డంగా దొరికిపోతుంది అని చెప్తాడు. ఏం జరిగింది అని మిస్సమ్మ అడగ్గానే జరిగింది చెప్తాడు రాథోడ్‌. దీంతో మిస్సమ్మ  సంతోషంగా ఈ హ్యాపీనెస్‌ను వెంటనే అక్కతో షేర్‌ చేసుకోవాలి అనుకుని బయటకు వచ్చి మనోహరి ఎక్కడికో వెళ్లిందని.. ఆయనకు తెలిసిపోయిందని హ్యాపీగా ఫీలవుతుంది.

మనోహరి రాగానే రణవీర్‌ కోపంగా అంతా ప్లాన్‌ చేసి ప్రిపేర్‌ అయ్యి కరెక్టుగా అంజును కోల్‌కతా తీసుకునివెళ్లే టైంకి ఎందుకు రానని చెప్పావు. ఇప్పుడు నా ఆస్తి నాకు దక్కకుండా పోవడానికి కారణం నువ్వే.. అంటాడు. మనోహరి బాధగా రణవీర్‌ నీకు నా పరిస్థితి గురించి చెప్పలేను చాలా పెద్ద ప్రాబ్లమ్‌ లో ఇరుక్కున్నాను. అందుకే మన ప్లానంతా పాడవుతుందని తెలిసినా నేన నీతో పాటు రాలేకపోయాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు.. ఇంతకు కోర్టులో ఏమన్నారు..? అని అడుగుతుంది. దీంతో రణవీర్‌ కూల్‌గా దుర్గకు ఒంట్లో బాగాలేదని లాయర్‌ హాస్పిటల్‌ రిపోర్ట్స్‌ సబ్మిట్‌ చేశాడు. కొంచెం టైం కావాలని ఇంకోక వాయిదా తీసుకున్నారు అని చెప్తాడు. హమ్మయ్య మన ఆస్థి సేఫ్‌ కదా..? ఎక్కడ నీ బంధువులు రాబంధువుల్లా లాక్కెళ్లిపోతారని భయపడ్డాను అంటుంది. దీంతో మన ఆస్థా అంటూ రణవీర్‌ అడగ్గానే.. మనం భార్యాభర్తలం అయినప్పుడు ఆస్థిలో కూడా నాకు సగం వాటా ఉంటుంది కదా అంటుంది మనోహరి.

నేను కూడా అదే అనుకున్నాను. అందుకే పేపర్స్‌ కూడా రెడీ చేయించి పెట్టుకున్నాను అంటూ పేపర్స్‌ తీసుకొచ్చి మనోహరికి ఇచ్చి సంతకం చేయమంటాడు. పేపర్స్‌ మీద మనోహరి సంతకం చేస్తుంది. హమ్మయ్య నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు అంటుంది మనోహరి. దీంతో ఇవి ఆస్థిలో వాటా ఇచ్చే పేపర్స్‌ కాదు మన డివోర్స్‌ పేపర్స్‌ అని రణవీర్‌ చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో అమర్‌, రాథోడ్‌ వచ్చి డోర్‌ తెరుస్తారు. వాళ్లను చూసిన మనోహరి మరింత షాక్ అవుతుంది. అమర్‌ రావడం కిటికీలోంచి చూసిన రణవీర్‌ చాటుకు వెళ్లిపోతాడు. ఇక్కడేం చేస్తున్నావు మనోహరి అని అమర్‌ అడగ్గానే.. ఆశ్రమం కోసం ఈ ఇంటిని రెంట్‌కు తీసుకోవడానికి వచ్చాను అని చెప్తుంది. దీంతో అమర్‌, రాథోడ్‌ వెళ్లిపోతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!

బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Podarillu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారక్టర్ అవుట్..

Nindu Noorella Saavasam Serial Today EpisodeSeptember 8th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ శక్తులు హరించేందుకు వెళ్లిన ప్రచండ

Big Stories

Advertisement
×