BigTV English
Advertisement

Horoscope  Today February 12th: ఆ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి

Horoscope  Today February 12th: ఆ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 12న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం: ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. దూరప్రయాణాలు వీలైనంత వాయిదా వేయుట మంచిది. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు.

వృషభం: సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.


మిధునం: వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

కర్కాటకం: ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం: కుటుంబ సభ్యుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు.

కన్య: ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తుల: నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

వృశ్చికం: ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి విమర్శలు తప్పవు. కుటుంబ విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.

ధనస్సు: విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తికానీ పనులు చిన్న ప్రయత్నంతో పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.

మకరం: సంతానం విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.

కుంభం: చిన్ననాటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై ఇంట్లో ప్రస్తావన వస్తుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మీనం: చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో భాగస్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×