Thandel Collections: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య తాజాగా నటించిన మూవీ తండేల్.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ‘తండేల్ ‘ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ప్రేమ కథ, దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య-సాయిపల్లవి రొమాన్స్, దేవీ శ్రీ మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్.. ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండటంతో మూవీ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు నుంచే తాండవం చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.. థియేటర్లలోకి వచ్చిన 5 రోజులకే 100 కోట్ల క్లబ్ లోకి చేరడం మామూలు విషయం కాదు.. ఇక ఐదు రోజులకు ఎన్ని కోట్ల గ్రాస్ ను వసూల్ చేసిందో ఒకసారి చూద్దాం..
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న కొన్ని పరిణామాలతో కూడిన రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన తండేల్ సినిమాను దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. చందూ మొండేటి- నాగ చైతన్య కాంబో రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి.. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువగానే జరిగింది. తండేల్ సినిమా వరల్డ్ వైడ్ రూ.52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి… కేవలం నాలుగు రోజులకే 75 కోట్లు వసూల్ చేసి బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తుంది తండేల్ మూవీ..
తండేల్ మూవీ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. ఈ సినిమా ఫస్ట్ డే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కాసుల వర్షం కురుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఇలా తండేల్ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసి, హీరో నాగ చైతన్య కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా నిలించింది.. అదే జోరు రెండో రోజు కూడా కొనసాగింది. రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ. 22 కోట్లు. ఇక నాలుగవ రోజు రూ. 10 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఐదో రోజు కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌తో కలిపి తండేల్ మూవీ 5 డే రూ. 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే 85 కోట్లకు పైగా వసూల్ చేసిందనే టాక్. దాదాపు 100 కోట్లకు పైగా వసూల్ చేసిందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కేవలం ఐదు రోజుల్లో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదే జోరు కొనసాగితే మాత్రం 200 కోట్లు త్వరలోనే రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక నిన్న ఈ మూవీ సక్సెస్ అనుకున్నందుకు సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఆ ఈవెంట్ కి నాగార్జున స్పీచ్ హైలైట్ గా నిలిచింది.