BigTV English

Ghaati Movie: అనుష్క ‘ఘాటి ‘ మళ్లీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..?

Ghaati Movie: అనుష్క ‘ఘాటి ‘ మళ్లీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..?

Ghaati Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జేజేమ్మ అనుష్క శెట్టి ఈ మధ్య బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించలేదు. కేవలం ఒకటి, రెండు సినిమాలతో మాత్రమే ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’.. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనుష్క ఓ గిరిజన మహిళ పాత్రలో నటిస్తుంది.. ఇప్పటివరకు విడుదలైన ఈ మూవీ అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.. ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని చాలామంది వెయిట్ చేస్తున్నారు.. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది. మొన్నటి వరకు ఈ నెల 11న థియేటర్లలోకి రాబోతుందని ప్రకటించారు  మేకర్స్.. కానీ ఇప్పుడు కొన్ని కారణాలవల్ల ఆ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.. ఇప్పుడు మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని ఓ వార్త ప్రచారంలో ఉంది.


‘ఘాటి’ వాయిదా పడుతుందా..?

హీరోయిన్ అనుష్కమిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’  తర్వాత ఆమె బయట కనిపించడమే మానేసింది. అంతేకాదు ఏ ఫంక్షన్‌ లోనూ, ఏ వేదిక పైనా, ఏ ప్రోగ్రామ్‌లోనూ కనిపించడం లేదు.. ఘాటీ’ సందర్భంగా అయినా ఆమె బయటకు వస్తుందని అనుకుంటే.. అది కాస్త వాయిదా పడింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి , నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఎవరూ కూడా అభిమానుల సందేహాలకు సమాధానం ఇవ్వడం లేదు. అయితే ‘ఘాటీ’ సినిమా సెప్టెంబర్ నెలలో దాదాపుగా రిలీజ్ కాకపోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకు పాన్ ఇండియా మూవీ మిరాయ్ రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు ఆ టీమ్ రెడీ అవుతోంది. దీంతో ‘ఘాటి’ మేకర్స్ పోటీ లేని సోలో రిలీజ్ కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో రిలీజ్ కాకపోతే, సినిమా ఆ తర్వాత నెలల్లో రావచ్చొనే టాక్ వినిపిస్తోంది. మరి అదే డేట్ న వస్తుందో కొత్త డేట్ ను లాక్ చేసుకుంటుందో చూడాలి..


Also Read :బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఏ ఒక్కటి మిస్ చెయ్యకండి..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..

అనుష్క గతంలో ఎన్నడు లేని విధంగా ఈ మూవీలో కనిపిస్తుంది. ఓ మారుమూల ప్రాంతంలోని గిరిజన మహిళగా అన్యాయాన్ని ఎదురిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ మూవీ అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చేతిలో కత్తి పట్టుకుని తలలు నరుకుతూ అనుష్క కనిపించిన టీజర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు సింపుల్ గా కనిపించే అమ్మడు ఈ సినిమాలో బాగా వైల్డ్ గా కనిపించినట్టు తెలుస్తుంది.. మొత్తానికి ఈ సినిమాలో అనుష్క చాలా భయంకరంగా కనిపిస్తుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ వస్తే అర్థమవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

Tollywood : చిరు కాదు.. బాలయ్యే కరెక్ట్? ఇండస్ట్రీకి పెద్ద దొరికేసినట్లేనా?

War 2 Song Teaser: అదరగొట్టేసిన డాన్స్ ఐకాన్స్.. రెండు కళ్ళు చాల్లేదు గురూ!

Kajol : కాజోల్‌ను హిందీలో మాట్లాడమన్న విలేకరి.. ఆమె సమాధానం విని అంతా షాక్..

Allu Arjun : బాలీవుడ్ బడా హీరోతో బన్నీ మూవీ..బాక్సాఫీస్ పరిస్థితి ఏంటబ్బా..?

PVNS Rohit: మొన్న నేషనల్ అవార్డు.. నేడు నిశ్చితార్థం.. జోరు పెంచిన బేబీ సింగర్!

Rajinikanth : రజినీకాంత్ మనసు బంగారమే మామా.. 350 మందికి సాయం..

Big Stories

×