Jofra Archer on Vaibhav Suryavanshi: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే మూడు టి20 లు పూర్తయ్యాయి. రెండింటిలో టీమిండియా ఓడిపోయింది. నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (England vs India, 3rd T20I) మధ్య మూడవ టి20 మ్యాచ్ నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ (Trent Bridge, Nottingham) వేదికగా జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో మరోసారి చెత్త ప్రదర్శన కనబరిచిన టీమిండియా, ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాప్ ఆర్డర్ నుంచి బౌలర్ల వరకు ఎవ్వరు కూడా బ్యాటింగ్ చేయలేదు. ఈ క్రమంలో 76 పరుగులకు ఆల్ అవుట్ అయి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా చెప్పినట్లుగానే వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) వికెట్ పడగొట్టాడు ఇంగ్లాండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్. నెల రోజుల ముందు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిగా జోఫ్రా ఆర్చర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ వీక్నెస్ మొత్తం తనకు తెలుసని.. అతడిని కచ్చితంగా ఇంగ్లాండ్ లో ఔట్ చేస్తానని వెల్లడించారు. సరిగ్గా నిన్న జరిగిన మూడవ టి20 సందర్భంగా వైభవ్ వీక్నెస్, తెలిసిన జోఫ్రా ఆర్చర్..అతడి వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో గతంలో వైభవ్ పై జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
జోఫ్రా ఆర్చర్, వైభవ్ సూర్య వంశీ ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీకి నెట్స్ లో ప్రతిరోజు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేసేవాడు. ఇదే ఆర్చర్ కు ఇప్పుడు కలిసి వచ్చింది. తోపు బౌలర్లు అందరూ వైభవ్ కు బౌలింగ్ చేయాలంటే భయపడుతున్న నేపథ్యంలో.. గతంలో ఆడిన అనుభవం ఆర్చర్ కు హెల్ప్ అవుతోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడినప్పుడు వైభవ్ వీక్నెస్ లు తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని 30 రోజుల కిందట ఐపిఎల్ ముగిసే సమయంలో పేర్కొన్నాడు. వైభవ్ కు ఎలా బౌలింగ్ చేయాలో తనకు తెలుసా అని.. కానీ దాన్ని తనకు అవసరమైన సమయంలో వాడుకుంటానని ప్రకటించాడు.
30 రోజుల కింద చెప్పినట్లుగానే.. వైభవ్ పై ఆర్చర్ తన బాణాన్ని వదిలాడు. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడవ టి20 సందర్భంగా… తన ఆస్త్రాన్ని వదిలి వైభవ్ ను 13 పరుగులకే పెవిలియన్ కు పంపించాడు. ఇక ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున నెట్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో వైభవ్ కు చాలా సార్లు బౌలింగ్ చేశానని వెల్లడించాడు ఆర్చర్. ఆ సమయంలో వైభవ్ వీక్నెస్ లు అన్నీ తెలుసుకున్నానని స్పష్టం చేశాడు. అదే ప్లాన్ ఇక్కడ వర్క్ అవుట్ అయిందని వెల్లడించారు. దీంతో వైభవ్ పై ఆర్చర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఐపీఎలే వైభవ్ కొంప ముంచుతోందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా నిన్న జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ 201 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 76 పరుగులకే ఆలౌట్ అయింది టీమిండియా.
Jofra Archer during IPL-
I’ll tell where to bowl Vaibhav after IPL.Jofra Archer is a man of words💀 pic.twitter.com/l86Eb1PPRN
— Dinda Academy (@academy_dinda) July 7, 2026