BigTV English

Nindu Noorella Saavasam Serial Today October 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఘోరాను కొట్టిన అమర్‌ – టెన్షన్‌ పడ్డ శివరాం, నిర్మల  

Nindu Noorella Saavasam Serial Today October 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఘోరాను కొట్టిన అమర్‌ – టెన్షన్‌ పడ్డ శివరాం, నిర్మల  

Nindu Noorella Saavasam Serial Today Episode:  అంజు  తాయోత్తు కట్టగ్గానే మనోహరి లేచి వెళ్లిపోతుంది. ఇంట్లో వాళ్లు ఎంత ఆపినా ఆగదు. గుప్త కూడా బాలిక నువ్వు అక్కడకు వెళ్లొద్దు అని హెచ్చరించినా ఆగదు. ప్రతి పౌర్ణమికి మన ఇంట్లో ఏదో అపశకునం జరుగుతూనే ఉంది అనాగానే మిస్సమ్మ షాక్‌ అవుతుంది. తన పెళ్లి జరిగింది. అమ్ము ఎక్కడికో వెళ్లిపోయింది. అన్ని గుర్తు చేసుకుంటుంది.


మనోహరి కారు దగ్గరకు వెళ్లి కారు స్టార్ట్‌ చేస్తుంటే కూడా గుప్త వెళ్లి ఆపాలని చూస్తాడు. ఎంత చెప్పినా మనోహరిలో ఉన్న ఆత్మ బంధనం జరిగిపోయి ఉంటుంది కాబట్టి గుప్త మాటలు పట్టించుకోకుండా ఘోర దగ్గరకు వెళ్తుంది. ఘోర పూజలు చేస్తుంటాడడు. తన గురువుకు చెప్తుంటాడు. ఆత్మ వస్తుందని నన్ను ఈ లోకానికి అధిపతిని చేస్తుందని మరోవైపు మనోహరి కారులో స్పీడుగా వెళ్లడం చూసిన అమర్‌, యూటర్న్‌ తీసుకుని మనోహరి కారును ఫాలో అవుతాడు.

మనోహరి కారేసుకుని ఘోర దగ్గరకు వెళ్తుంది. ఆత్మను చూసిన ఘోర సంతోషంగా ఫీలవుతాడు. ఆత్మా వచ్చి నా ఎదురుగా కూర్చో అనగానే వెళ్లి కూర్చుంటుంది. ఘోర ఏవేవో మంత్రాలు  చదువుతుంటాడు. ఇంతలో మనోహరి కారును ఫాలో అవుతున్న అమర్‌. రోడ్డు పక్కన మనోహరి కారును ఆపి తను కూడా ఆ ఇంటోకి వెళ్తాడు. అక్కడ మనోహరి మత్తుగా కూర్చోవడం.. ఘోర పూజలు  చేస్తుండటం చూసి షాక్‌ అవుతాడు.


అరేయ్‌ ఏం చేస్తున్నావురా.. అంటూ ఘోరను కొడతాడు అమర్‌. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి ఫైటింగ్‌ జరుగుతుంది. అమర్‌ ఘోరను పట్టుకుని పోలీసులకు అప్పగించాలనుకుంటాడు. ఇంతలో ఘోర తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు. అమర్‌ మనోహరిని ఎంత పిలిచినా పలకదు. అయితే ఈ క్రమంలో మనోహరి చేతికి ఉన్న తాయోత్తు ఊడిపోతుంది. ఎంత పిలిచినా మనోహరి పలకకపోవడంతో అమర్‌  మనోహరిని ఎత్తుకుని కారులో తీసుకుని ఇంటికి వెళ్తాడు.

తర్వాత ఆరు గార్డెన్ లో కూర్చుని రణవీర్‌ మాటలు  గుర్తు చేసుకుంటుంది ఆరు. అంజు కన్నతల్లి మనోహరా..?అనుకుంటూ బాధపడుతుంది. మనోహరి చెడ్డదే  అనుకున్నాను. కానీ కన్నబిడ్డను  వదిలేసేంత కసాయిదా అనుకుంటుంది. మరోవైపు మనోహరిని తన రూంలో పడుకోబెట్టిన అమర్‌ ఆమె నిద్ర ఎప్పుడు లేస్తుందా? అని ఎదురుచూస్తుంటాడు. ఇంట్లో వాళ్లందరూ అక్కడే కూర్చుని ఉంటారు.

గుప్త కూడా ఆరు ఇంకా మనోహరి శరీరంలోనే ఉంది అనుకుని అక్కడే ఉంటాడు. నాకే ఎందుకు ఈ కర్మ అని బాధపడుతుంటాడు. మా నరక నగర సొగసుల మధ్య జలపాతముల వద్దకు వెళ్లి జలకాళాటలలో అంటూ పాటలు పాడుకుంటూ ఉండాల్సిన నేను ఇక్కడ ఉండటమేంటి?  నా కెందుకు ఈ గోల. అసలు ఈ పరిస్థితి ఏ శత్రువుకు కూడా రాకూడదు. ఈ సైనిక దళం మొత్తం ఆ బాలిక మేల్కోనుటకు నా వలే వేచి చూస్తున్నారు. అని బాధపడుతుంటాడు.

అసలు మన చుట్టు ఏం జరుగుతుంది అమర్‌. నాకేమీ అర్థం కావడం లేదు అంటుంది నిర్మల. దీంతో శివరాం కూడా ఆరును చంపిన వాడు మళ్లీ మన చుట్టు ఎందుకు తిరుగుతున్నాడు. ఈ మంత్రాలు తంత్రాలు చేసుకునే వాడు మన కుటుంబంలోని మనుషులనే ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు.  మొన్నేమో అమ్మును ఇలానే ఎత్తుకెళ్లి ఏదో పూజ చేయబోయాడు. ఇవాళేమో మనోహరితో ఏదో పూజ చేస్తున్నాడని చెప్పావు. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది నాన్నా అంటుంది నిర్మల.

పోనీ డబ్బుల కొరకు ఇదంతా  చేస్తున్నాడా..?  అనుకుంటే ఇలాంటి వాళ్లకు డబ్బుల మీద ఆశ ఉండదు అమర్‌ అని చెప్తాడు శివరాం. దీంతో అవును మామయ్యగారు అంటే వాడు దేనికోసమో మన ఇంటికి వస్తున్నాడు అంటున్నారా? అతనికి కావాల్సింది ఈ ఇంట్లో ఏదైనా ఉండి ఉంటుందా? అందుకోసమే ఇన్నిసార్లు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడా? అంటూ మిస్సమ్మ డౌట్‌  క్రియేట్‌ చేస్తుంది. మిస్సమ్మ మాటలకు గుప్త కంగారుపడతాడు. ఈ బాలిక ఆత్మ గురించి పసిగట్టేలా ఉంది అనుకుంటాడు.

ఇంతలో మిస్సమ్మ వాడికి ఈ ఇంటి నుంచి ఏం కావాలి. ఎందుకు మళ్లీ మళ్లీ వస్తున్నాడు. అంటూ ఆలోచిస్తుంది. చావు చూసి కన్నీళ్లు మిగిలిన ఇల్లు మిస్సమ్మ ఇది. వాడికి ఇక్కడేం ఉంటుంది అంటాడు. ఇంతలో మనోహరి ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది. గుప్త బాలిక నేను ఇచట ఉన్నాను అంటాడు. మనోహరి పలకదు. దీంతో ఆరు ఇక్కడ లేదని గుప్త వెళ్లిపోతాడు.

మనోహరి అందరినీ ప్రశ్నార్థకంగా చూస్తూ ఏం జరిగింది మీరంతా ఇక్కడ  ఎందుకు ఉన్నారు? అని అడుగుతుంది. అంటే ఇంతసేపు  జరిగింది ఏదీ నీకు  గుర్త లేదా అని అమర్‌ అడుగుతాడు. నాకేం గుర్తు  లేదు అమర్‌. నేను నా రూంలో ఉన్నాను తర్వాత ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఇదిగో ఇప్పుడు  ఇలా నిద్ర లేచాను అంటుంది మనోహరి.  అవునా అంటూ అమర్‌ జరిగింది మొత్తం చెప్తాడు.

అమర్‌  మాటలకు మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. ఆ ఆరును ఘోర బంధించి ఉంటాడని మనులో అనుకుంటూ నవ్వుకుంటుంది. మనోహరి చిన్నగా నవ్వుకోవడం చూసిన మిస్సమ్మ. ఏంటి మనోహరి గారు ఇంత జరిగినా  మీరు నవ్వుకుంటున్నారు అని అడుగుతుంది. దీంతో ఇంత జరిగినా నేనే సేఫ్‌గా ఇంటికి వచ్చాను కదా అందుకు నవ్వుకుంటున్నాను అని చెప్తుంది మనోహరి. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

అంజలి, మనోహరి కూతురన్న నిజం తెలుసుకున్న ఆరు ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు మనోహరి మంచిది కాదనుకున్నాను కానీ అది కన్నబిడ్డనే వదిలించుకునే కసాయిది అని ఇప్పుడే అర్థం అయింది అని బాధపడుతుంది. ఇంతలో గుప్త రాగానే అంజలి గురించి నిజం తెలిసింది గుప్త గారు. ఇక అంజలి, మనోహరి కూతురు అన్న విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉంచాలి అంటుంది. దీంతో గుప్త మళ్లీ విధికి ఎదురువెళ్తున్నావు బాలిక అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×