BigTV English
Advertisement

Jr Ntr : నిరాధారణ ఆరోపణలు చేస్తుంటే చూస్తూ కూర్చోం.. కొండా సురేఖ వ్యాఖ్యల పై ఫైర్..

Jr Ntr : నిరాధారణ ఆరోపణలు చేస్తుంటే చూస్తూ కూర్చోం.. కొండా సురేఖ వ్యాఖ్యల పై ఫైర్..

Jr Ntr- kondasurekha : టాలీవుడ్ హీరో హీరోయిన్లపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అలాగే రాజకీయాల్లోనే ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని చెప్పిన కొండా సురేఖ మరో హాట్ కామెంట్స్ చేశారు. సమంతను తన దగ్గరకు రావాలని కండిషన్ పెట్టడం వల్లే నాగచైతన్యను వదిలేసి వెళ్లింది. చివరకు అతను టాచర్ భరించలేకే విడాకులు తీసుకుందని ఆమె అన్నారు. అంతేకాదు సెలెబ్రేటీలకు మత్తు ముందుకు బానిసలుగా మార్చింది కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం పై టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక తాటిపై నిలబడి ఆమె మాటలను కొట్టిపడేస్తున్నారు..


ఈ వ్యాఖ్యల పై స్టార్ హీరోలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు.. తాజాగా ఈ విషయం పై ఎన్టీఆర్ స్పందించారు. ఆయన తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో.. ఇతరుల పై నిరాధారణ వ్యాఖ్యలు చేస్తుంటే చూస్తూ కూర్చోలేము.. కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం.. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం మన భాద్యత.. సినీ ఇండస్ట్రీ గురించి ఇలాంటి నిరధారణ వ్యాఖ్యలు చెయ్యడం భాదాకారం.. ఇలాంటివి ఫిలిం ఇండస్ట్రీ సహించదు.. అంటూ ఎన్టీఆర్ పోస్ట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ విషయం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దుమారం రేపుతుంది. ఈ విషయం పై ఒక్కొక్కరు స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. కొండా సురేఖ వ్యాఖ్యల ను ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు.. అసహ్యం వేస్తుంది. బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయ్యడం భాధాకరం. సమాజం పై చెడు ధోరణి కలిగించే ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని పోస్ట్ పెట్టారు.. ఈ విషయం పై అక్కినేని నాగార్జున, నాగచైతన్య స్పందించారు. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు స్పందించారు. ఇటు ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయాలోని కొండా సురేఖ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి.. ఇది చినికి చినికి గాలి వానలా మారుతుంది. చివరకు ఎక్కడకు వెళ్తుందో చూడాలి..


 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×