Fire Accident: హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ చౌరస్తాలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఫైర్ డిపార్ట్మెంట్‌కు సమాచారం అందించడంతో హుటాహుటిన స్పాట్‌కి చేరుకొని బస్సులోని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
SRనగర్ చౌరస్తాలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద ఘటన
హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్ చౌరస్తా వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు మంటల ఘటన గురువారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిందని చెప్పారు. మియాపూర్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ఎస్‌ఆర్‌నగర్ మెట్రో స్టేషన్ కింది రోడ్డు వద్ద ఉమేష్ చంద్ర విగ్రహం సమీపంలో ఒక్కసారిగా మంటలకు వచ్చాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రయాణికులు వెంటనే తప్పించుకున్నారు, అయితే ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగలేదు. అప్రమత్తమైన డ్రైవర్ వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టు అధికారులు తెలిపారు.
అన్నవరం ఆలయంలో అగ్నిప్రమాదం..
అంతేకాకుండా కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ పరిసరాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై పడమటి రాజగోపురం వద్ద దుకాణ సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే గమనించిన భద్రతా సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఫ్యాన్సీ, మరో ఐదు దుకాణాలకు మంటలు వ్యాపించాయని చెబుతున్నారు. ఈ ఘటనకు ప్రమాదానికి ముఖ్య కారణం విద్యుదాఘాతమేనని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భారీగా ఆస్తినష్టం కూడా జరిగినట్లు సమాచారం..
Also Read: బలపడిన వాయుగుండం.. మరో మూడు రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. బయటకు రాకండి
ఇదిలా ఉంటే.. నెల్లూరులో మరో అగ్ని ప్రమాదం
నెల్లూరు జిల్లా సంతపేట పాత క్లాత్ మార్కెట్లో అగ్నిప్రమాదం జరిగింది. సడన్‌గా అంటుకున్న మంటలకు దాదాపు ఎనిమిది షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. హుటాహుటినా స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. అయితే 10 లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.