Getup Sreenu: బుల్లి తెరపై ప్రసారమవుతున్న కామెడీ షోలలో జబర్దస్త్ (Jabardasth)కామెడీ షోకు ఎంతో మంచి ఆదరణ ఉంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగాను దర్శకులు కాను అలాగే కమెడియన్లుగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా జబర్దస్త్ ద్వారా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో కమెడియన్ గెటప్ శ్రీను(Getup Sreenu) ఒకరు. జబర్దస్త్ వేదికపై ఎన్నో గెటప్స్ వేస్తూ తన అద్భుతమైన స్కిట్ల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమంతో మంచి సక్సెస్ అందుకున్న గెటప్ శ్రీను ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న గెటప్ శ్రీను భారీగా రెమ్యూనరేషన్ కూడా పెంచారని తెలుస్తోంది. ఈ ఏడాది గెటప్ శ్రీను మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న గెటప్ శ్రీను ఒక కాల్ షీట్ కోసం 3 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
ఇలా ఈయన ఒక రోజుకు మూడు లక్షలు అంటే వరుసగా నెల రోజులు ఒక సినిమా షూటింగ్లో పాల్గొంటే దాదాపు 90 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటారని తెలుస్తుంది. ఇలా ఏడాదికి సుమారు 10 కోట్ల వరకు గెటప్ శ్రీను సంపాదిస్తున్నారు. ఇక గెటప్ శ్రీను తీసుకుంటున్న ఈ రెమ్యూనరేషన్ ఒక మిడిల్ రేంజ్ హీరో రెమ్యునరేషన్ కంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. రెమ్యూనరేషన్ విషయంలో హీరోలను మించిపోయి గెటప్ శీను సంపాదిస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు జబర్దస్త్ కార్యక్రమంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గెటప్ శ్రీను కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ కార్యక్రమానికి పూర్తిగా దూరమయ్యారు. ఇలా జబర్దస్త్ కు దూరమైన ఈయన వెండి తెరపై సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు కాని ఉన్నఫలంగా తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బుల్లితెర వెండితెరపై వరుస ప్రాజెక్టులతో గెటప్ శ్రీను బిజీగా గడుపుతున్నారు. ఇటీవల నిహారిక నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాకాసా సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. నిహారిక నిర్మాణంలో వరుణ్ తేజ్ నటిస్తున్న బరి సినిమాలో గెటప్ శ్రీను నటిస్తున్నారు.
Also Read: నేను చేస్తే తప్పు? మీరు చేస్తుందేంటీ..డ్రెస్సింగ్ స్టైల్ పై ఉదయభాను ఫైర్!