Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10 (Bigg Boss season 10) అలా ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే మిడ్ వీక్ ఎలిమినేషన్స్, లవ్ ట్రాక్ లు, గొడవలు అన్నీ జరిగిపోతున్నాయి. ఒకరిని ఒకరు నిందించుకోవడం, ఒకరిపై మరొకరు ప్రేమ పెంచుకోవడం, ఒకరితో ఇంకొకరు ఉండడం చూసి ఓర్వలేక ఈర్ష్య పడడం అన్నీ కూడా ఒకే షోలో కనిపించడంతో ఆడియన్స్ లో ఈ షోపై మరింత ఆసక్తి పెరుగుతోంది. పైగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లతో ప్రారంభమైన బిగ్ బాస్ అన్నింటికంటే తెలుగు ఓటీటీలో నంబర్వన్ స్థానాన్ని దక్కించుకోవడం బట్టి చూస్తే ఈ షో కి ఆదరణ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్ బిగ్ బాస్ ఎప్పుడూ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అందులో కొంతమంది నిజంగానే ప్రేమలో పడితే.. మరి కొంతమంది గేమ్ కోసం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సీరియల్ నటిగా హౌస్ లోకి అడుగుపెట్టిన దేబ్జానీ (Debjani), హోస్ట్ నాగార్జున(Nagarjuna ) ముందే మరో సీరియల్ నటుడు ముఖేష్ (Mukhesh) అంటే తనకు చాలా ఇష్టమని, కానీ తనను పట్టించుకోవట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది .
ఇక ఈమె నేరుగా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టడంతో నిజంగానే బిగ్ బాస్ హౌస్ లో కొత్త లవ్ ట్రాక్ మొదలైందా ? అనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి. ఇక ఈరోజు మరో మెట్టు ఎక్కింది దేబ్జానీ. ఏకంగా వర్షిణితో ముఖేష్ పూల్ లో సరదాగా ఆడుతుంటే.. ఈమె అతడిపై ఫైర్ అయ్యింది . ఇది చూసిన ఆడియన్స్ నిజంగానే దేబ్జానీ ముఖేష్ పై ప్రేమ పెంచుకుందా? లేక బిగ్ బాస్ చెప్పిన ప్రకారమే గేమ్ కోసం నటిస్తోందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇకపోతే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య సాగిన సంభాషణ ఎపిసోడ్ కె హైలెట్గా నిలిచింది. దేబ్జానీ మాటలు, ముఖేష్ సంజాయిషీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇక తాజా ఎపిసోడ్ లో వర్షినితో పూల్ లో సందడి చేసిన ముఖేష్ ను ఒక ఆట ఆడుకుంది దేబ్జానీ. ఎపిసోడ్లో భాగంగా ముఖేష్ వర్షిణితో కలిసి స్విమ్మింగ్ పూల్ లో సమయం గడిపి, వాష్ రూమ్ దగ్గరకు వచ్చారు .అక్కడ ఉన్న దేబ్జానీని చూసి పొరపాటున వర్షిణి అని పిలిచాడు. దీంతో “హలో నా ముఖం నీకు వర్షిణిలా కనిపిస్తుందా? నువ్వు నా దగ్గరకు రాకు” అంటూ ముఖేష్ ని ఆట పట్టించింది దేబ్జానీ. దానికి ముఖేష్ కూడా వివరణ ఇస్తూ.. పూల్ లో వర్షిణి వేరే అబ్బాయిని పొగుడుతుంటే విన్నాను అని చెప్పాడు. వెంటనే అది కాదు మ్యాటర్.. నాగ్ సార్ ముందే నేను చెప్పాను కదా.. నాకు నువ్వంటే ఇష్టం అని అంటూ మరోసారి ప్రపోజ్ చేసింది.
అంతటితో ఆగకుండా ఒక పరాయి ఆడదానితో.. అది కూడా స్విమ్మింగ్ పూల్ లో బట్టల్లేకుండా ఎలా దిగుతావు? అంటూ సరదాగా నిలదీసింది. నాగ్ సార్ రాకముందే నువ్వంటే ఇష్టమని చెప్పాను కదా.. మళ్లీ నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు నువ్వు ఇష్టం అని చెప్పాను కదా.. అని దేబ్జానీ అంటుండగానే.. వచ్చినందుకు ఇష్టమా ? వచ్చిన తర్వాత ఇష్టమా? అని అడిగాడు ముఖేష్ . అర్థం అదే వస్తుంది అంటూ డైలాగ్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ . ఒక పరాయి ఆడదానితో నువ్వు ఎలా స్విమ్మింగ్ పూల్ లో ఉన్నావ్? బట్టల్లేకుండా అమ్మాయితో పూల్ లోఉంటావా ? అంటూ గట్టిగానే నిలదీసింది. దానికి అక్కడ మిగతా అబ్బాయిలు కూడా ఉన్నారని ముఖేష్ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు.
ALSO READ:ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. కానీ- ఉదయభాను
వెంటనే గొడవలోకి వర్షిణి , రాంప్రసాద్ కూడా ప్రవేశించడంతో సీన్ మరింత నవ్వులు పూయించింది. మా చెల్లి అన్యాయం చేస్తుందని తెలుసు.. కానీ వీడు మా చెల్లికే అన్యాయం చేస్తున్నాడు. వీళ్ళిద్దరికీ కరెక్ట్ కాదు అనిపిస్తుంది అంటూ తనదైన స్టైల్ లో పంచ్ వేశాడు. నాకు అన్యాయం చేస్తున్నాడు అంటూ అలిగింది దేబ్జానీ. మధ్యలోకి వర్షిణి రావడంతో నువ్వు ఆమెకు లాయర్ వా అంటూ కౌంటర్ ఇచ్చింది. నేను త్రిగుణ్ కి కాఫీ మాత్రమే ఇచ్చాను. కానీ నువ్వు ఆమెతో పూల్ లోకి దిగావ్ అని దేబ్జానీ క్యూట్గా అరిచింది. ఇక వచ్చే కొత్త వాళ్ళతో నేను కూడా పూల్లో దిగి నేను ఏంటో నీకు చూపిస్తా అంటూ ముఖేష్ కి దేబ్జానీ వార్నింగ్ ఇచ్చింది. మొత్తానికి అయితే వీరిద్దరి లవ్ ట్రాక్ ఎపిసోడ్ కే ఆకర్షణగా నిలిచింది. కానీ ఇదంతా గేమ్ కోసమే అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.