Illu Illalu Pillalu Today Episode September 27th: ప్రేమ ధీరజ్ ని ఇంకా జీవితంలో కలవలేను అని బాధ పడిపోతూ ఉంటుంది.. కొన్నిసార్లు ధీరజ్ తీసుకునే కఠినమైన నిర్ణయాలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి అని ప్రేమ అనుకుంటుంది. ధీరజ్ వల్ల నేను చాలా బాధపడిపోతున్నాను. వీడు తీసుకుని నిర్ణయాలు నా కుటుంబానికి నన్ను దూరం చేస్తూనే అందరితో మాటలు అనిపించేలా చేస్తున్నాయి. ఇక జీవితంలో నేను ధీరజ్ మొహం చూడలేనా అని ప్రేమ బాధ పడిపోతూ ఉంటుంది. అయితే ప్రేమ అలా బాధ పడిపోవడం చూసిన చింతామణి ఏంటమ్మా బాధపడిపోతున్నావా? మగాడు ఆడదాని అవసరం కోసం వెయిట్ చేయాలి.. కానీ ఆడదే మగాడి కోసం వెయిట్ చేయకూడదు. ఆడవాళ్ళని లొంగ తీసుకోవడానికి మగాళ్లు చేసే ప్లాన్ ఏది అని ప్రేమకు బ్రెయిన్ వాష్ చేస్తుంది.. ఇక ప్రేమ ఆలోచనలో పడిపోతుంది.
అందరూ పెళ్లి మండపానికి వెళ్ళిపొమ్మని నర్మదా శ్రీవల్లి నేను ప్రేమని తీసుకొని వస్తామని చెప్తుంది. నర్మదా శ్రీవల్లిని తీసుకొని మనము చింతామణి ఇంటికి వెళ్లి ప్రేమను తీసుకురావాలి అని ఎంత చెప్తున్నా సరే శ్రీవల్లి మాత్రం భయపడిపోతూ ఉంటుంది.. ఇక మొత్తానికి శ్రీవల్లి వాళ్ళ అమ్మానాన్నని కూడా తీసుకొని వచ్చి ఎలాగైనా సరే చింతామణి దగ్గరనుంచి ప్రేమను తీసుకురావాలి అని నర్మదా ప్లాన్ చేస్తుంది. నర్మదా మీరు యూత్ లాగా మోపిదేవికి వెళ్లి ప్రేమ గురించి తెలుసుకున్నప్పుడు మీరు యువత 25 ఏళ్ల వయసులో ఉన్నారా అని నర్మదా అందరికీ ఒకేసారి దిమ్మ తిరిగిపోయిన షాకిస్తుంది. అయితే శ్రీవల్లి మాత్రం తన గురించి ఎటువంటి నిజాలు చెప్పొద్దు అని కాళ్లు పట్టుకుంటుంది.
ప్రేమను చింతామణి ఇంటి నుంచి తీసుకొచ్చేందుకు భాగ్యం నర్మదా ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. ఆ చింతమనే ఒక రాక్షసి మమ్మల్ని ఒకరోజంతా కొడుతూనే ఉంది. ఆ ఇంట్లోకి వెళ్లాలంటే మాకు పులి బోన్లోకి వెళ్లినట్టు ఉంది.. మమ్మల్ని వదిలి అమ్మాయి నువ్వు ఏ పని చేయలేము అని భాగ్యం ఎంత చెప్తున్నా సరే నర్మద మాత్రం చేసినంత చేసి ఇప్పుడు ఇలా అంటున్నారా అని అంటుంది. మీరు లోపలికి వెళ్లి ప్రేమను తీసుకుని రావాలి అని చెప్పగానే శ్రీవల్లి కాస్త కంగారు పడిపోతుంది. మీరు గనక వెళ్లి ప్రేమను తీసుకురాకపోతే ఖచ్చితంగా మీ గురించి ప్రతి విషయాన్ని నేను మావయ్యతో చెప్పేస్తాను అని తర్వాత బెదిరిస్తుంది. అయితే శ్రీవల్లి ప్రేమను తీసుకొచ్చి ఎందుకు ఒప్పుకుంటుంది.. ఎలాగైనా సరే ప్రేమను మీరు తీసుకొస్తే మళ్లీ ఆ ఇంట్లోకి మీకు అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం మీ గురించి అందరికీ తెలుసు కాబట్టి మీరు రాకపోయినా పెద్ద పట్టించుకోరు. గట్టు నర్మద చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది..
తిరుపతి సుకన్య తీసుకుని పెళ్లికి రావడం చూసినా రామరాజు ఏంట్రా ఎదవ చుట్టాలు ఇప్పుడు వచ్చారండి ముందే రావాలి అని తెలియదా..? బయటి వాళ్లు పిలిచినట్టు నీకు ఒక పెళ్లి పత్రిక తీసి పిలవాలా ఏంటి అని తిట్టేస్తాడు. నన్ను పిలవలేదు కానీ నేనే నా మేనల్లుడు పెళ్లికి వచ్చాను అని తిరుపతి అనగానే నిన్ను పిలవాలా ఏంట్రా ఇంట్లో పెళ్లి గురించి నీకు తెలియదా అని తిరుపతి తిడతాడు ఇక లోపలికి వెళ్ళగానే అందరూ కూడా ఇప్పుడు వచ్చావ్ ఏంటి మామ పెళ్లికి ముందే రావాలి కానీ అడుగుతారు. నన్ను పిలవలేదు కానీ నేనే వచ్చాను అయితే మీరందరూ నన్ను ఇలా అంటున్నారు ఏంట్రా అంటే తిరుపతి చాలా ఫీల్ అవుతాడు..
ఏంటి ఈయన గారు చేసిన పనికి కార్డేశ్వరి దేవాలయం ఏంటి అంటూ వేదవతి అనగానే తిరుపతి అక్క చాలా కోపంగా ఉంది అంటూ కంగారు పడిపోతూ ఉంటాడు. అయితే వేరేది ఇంట్లో వారిని పిలిచినట్టు వేరే వాళ్ళని పిలిచినట్టు ఇలా పిలవాలి అంటే అడుగుతుంది. అయితే సుకన్య తిరుపతి ఇద్దరు కూడా ఏదో అది చాలా కోపంగా ఉందని అనుకుంటారు. ఇక కామాక్షి దొంగ మామ పెళ్లి చేసుకున్నావు మాట తప్పవు నాకు బంగారు పెడతాను అన్నావు కదా.. అని సుకన్య మెడలో ఉన్న బంగారు చూసి కామాక్షి రెచ్చిపోతుంది నాకు అది కావాలి అంటూ గోల చేస్తుంది. ఇక వేదవతి అక్కడ ప్రేమ వస్తుందో రాదు అని టెన్షన్ పడిపోతూ ఉంటే మీ కాల్ ఏంటి పెద్దమ్మాయి నోరు మూసుకొని కూర్చుంటావా లేదా అంటూ వేదవతి గట్టిగా అరుస్తుంది.. కానీ సాగర్ నర్మద వెళ్ళింది కదా ఎలాగైనా సరే ప్రేమను తీసుకొని వస్తుంది అని ఎంత చెప్తున్నా సరే వేదవది మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :ఆదివారం టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్.. వీటిని మిస్ చెయ్యకండి..