Actress Shailaja Priya :అటు సినిమాలతో.. ఇటు సీరియల్స్ తో.. మరోవైపు బుల్లితెర షోలతో నిత్యం బిజీగా గడిపేస్తూ.. అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న నటి ప్రియ (Sailaja Priya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటిగానే కాకుండా బిగ్ బాస్ సీజన్ 5తో మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాంటి ఈమె తాజాగా తన కాలికి గాయమై.. కట్టు కట్టి మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోలను వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
బెడ్ పైన కాలికి బ్యాండేజ్ తో ఉన్న వీడియోని ఆమె షేర్ చేస్తూ.. ” మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నాను.. వేడివేడి సూపు తాగుతూ.. ముదురు గులాబీ రంగు కాలి పట్టీతో నెమ్మదిగా కాలం గడుపుతున్నాను. మీరు ప్రేమను, మంచి ఆలోచనలను, తక్కువ శ్రమతో చేసే లేదా కూర్చొని చేసే హాబీల లిస్టు నాకు పంపండి. నా కాలు నయమయ్యే లోపు నా మనసును నేను మరింత బిజీగా ఉంచడానికి అన్ని ఆలోచనలు కావాలి. అలాగే మీ ఆశీస్సులు, ప్రార్థనలు కూడా కావాలి” అంటూ ప్రియ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ప్రియ తన కాలికి గాయమైనట్టు అభిమానులతో పంచుకోవడంతో అసలు ప్రియకి ఏమయింది? ఎలా కాలుకు గాయమైంది? అంటూ పలు విషయాలపై అభిమానులు, నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.
1997లోనే మాస్టర్ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టిన శైలజా ప్రియా.. జెమినీలో శక్తి సీరియల్ ద్వారా సీరియల్ ప్రయాణాన్ని కూడా ఆరంభించింది. ఇక ఈమె నటించిన ప్రియసఖి సీరియల్ లో తన పాత్రకు ఏకంగా నంది అవార్డు కూడా అందుకుంది. ప్రియ నటించిన సినిమాల విషయానికి వస్తే .. మాస్టర్, దొంగాట, గోకులంలో సీత, మావిడాకులు, శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ,చంద్రలేఖ, సూర్యుడు, సుప్రభాతం , రాజకుమారుడు ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాది నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు చిత్రంలో కూడా మెరిసింది ప్రియ.
also read: విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?
పదుల సంఖ్యలో సినిమాలు , సీరియల్స్ చేసి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రియ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత పేరు సొంతం చేసుకుంది. ఇక్కడ తనదైన ఆట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు ఇటీవల కొన్ని స్పెషల్ షోలలో కూడా ప్రియా. సందడి చేసిన విషయం తెలిసిందే. అలా నిత్యం హడావిడిగా కెరియర్ను బిజీబిజీగా గడిపేస్తున్న ప్రియ ఇలా ఉన్నట్టుండి బెడ్ కే పరిమితం అవ్వడంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా రికవరీ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అయితే ప్రియ కాలికి గాయం ఎలా అయ్యింది? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.