Bigg Boss 10 Ram Prasad: అగ్నిపరీక్ష సీజన్ 2 లో భల్లాలదేవగా పాపులారిటీ అందుకొని.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన రెండు రోజుల్లోనే.. అనూహ్యంగా తన స్మార్ట్ స్ట్రాటజీ ఉపయోగించి, మిథిలేష్ రెడ్డి (Mithilesh Reddy) బయటకు రావడంపై ప్రశంసలు కురుస్తున్నా.. హౌస్ లో మిగతా కంటెస్టెంట్స్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా త్రిగుణ్ .. రామ్ ప్రసాద్, అమన్ లపై ఒక రేంజ్ లో మండిపడుతుంటే .. నిన్నటి శనివారం ఎపిసోడ్ చూసిన నెటిజన్స్, ఆడియన్స్ మాత్రం రాంప్రసాద్ అసలైన ఆట మొదలుపెట్టాడు అనే కామెంట్లు వ్యక్తపరుస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ 10 లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి.. శనివారం ఎపిసోడ్లో నాగార్జున ఇచ్చిన ఆఫర్ ని అందుకొని హౌస్ నుండి వెళ్ళిపోయినట్టు చూపించారు. మొదట రూ.5 లక్షలు ఉన్న ఒక బ్రీఫ్ కేసు తీసుకొని ఎవరైతే వెళ్లిపోవాలనుకుంటున్నారో వెళ్లిపొమ్మని చెప్పారు నాగార్జున. కానీ ఎవరు ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత నంబర్ మారింది. రూ.10 లక్షలు అన్నారు. ఎవరు ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత 15 లక్షలు అని నాగార్జున చెప్పగానే మిథిలేష్ వెంటనే తాను వెళ్లిపోతానని నిర్ణయించుకున్నారు. మిథిలేష్ తీసుకున్న నిర్ణయాన్ని హౌస్ మేట్స్ అంగీకరిస్తారా? అని అడగగా.. కొంతమంది చేతులు ఎత్తి మరీ మిథిలేష్ కి సపోర్ట్ చేశారు. పైగా రాంప్రసాద్ ఆ బ్రీఫ్ కేస్ ని మిథిలేష్ కి ఇచ్చి, ఇతను బిగ్ బాస్ కి సూట్ కాడు అంటూ చెప్పి మరీ డబ్బులు ఇచ్చి పంపించేశారు. అయితే ఈ డబ్బులను విన్నింగ్ ప్రైజ్ మనీలో కట్ చేస్తామని నాగార్జున చెప్పినా సరే రాంప్రసాద్ వినకుండా పంపిచేయడంతో త్రిగుణ్ మండిపడ్డారు.
నిజానికి రామ్ ప్రసాద్ నాగార్జున చెప్పిన మాటలను గట్టిగా పట్టుకున్నారనే కామెంట్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రూ.15 లక్షల ఆఫర్ చెప్పగానే.. నాగార్జున రామ్ ప్రసాద్, నరేష్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఎవరు కూడా ఇప్పటివరకు విన్నింగ్ కాలేదు. మీరు తీసుకొని వెళ్ళిపోతారా? అని అడిగాడు. అయితే ఇది గమనించిన రాంప్రసాద్ ఎలాగో విన్నర్స్ కాలేము కదా.. అందుకే విన్నర్ కి ఇంత మనీ అవసరం లేదు ..అందులో కట్ చేస్తే సరిపోతుంది అని మిథిలేష్ కి ఆ బ్రీఫ్ కేస్ ఇచ్చి పంపించి ఉండొచ్చు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది రాంప్రసాద్ ఎలాగో విజేత కాలేడు కాబట్టే ఇలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
also read: కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?
మరొకవైపు ముఖేష్ , త్రిగుణ్ .. రాంప్రసాద్, అమన్ లపై మండిపడ్డారు . విన్నర్ డబ్బులలో నుంచి కట్ చేస్తారు.. అలా ఎలా పంపిస్తారు.. లోపలే ఉంచి నామినేట్ చేసి పంపాలి కదా అంటూ ఫైర్ అయ్యారు. డబ్బులు ఇచ్చి పంపించడానికి సపోర్ట్ చేసిన వాళ్లకు సిగ్గు శరం లేదు అంటూ త్రిగుణ్ కూడా మండిపడ్డారు. దీంతో మాట అనుకొని అమన్ – త్రిగుణ్ కొట్టుకునే వరకు వెళ్లారు. మధ్యలో వంశీ కూడా ఫైర్ అవ్వడం జరిగింది. మొత్తానికి 15 లక్షలు తీసుకొని మిథిలేష్ బయటకు వెళ్ళిపోతే ఆ డబ్బుల కారణ.. ఇంట్లో వాళ్ళ మధ్య గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీనికి తోడు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున చెప్పిన మాటలు కూడా అవుననే ఆలోచనలు రప్పిస్తున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.