Podarillu Today Episode September 27th : మహా అందరూ కలిసి కూర్చుని తింటూ ఉండగా చక్రి రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. కన్నా మొదటి నుంచి ఆమ్లెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ మాధవ్ మాత్రం అది చక్రి కోసం వేసిన ఆమ్లెట్ రా వాడు వచ్చి తింటాడు కదా అని చెప్తూ ఉంటాడు అప్పుడే చక్రి టైం కి వచ్చేసానా అయితే నాకు కూడా పెట్టు అన్నయ్య అని అంటాడు ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. బర్త్డే పార్టీ అని వెళ్లావు కదరా అక్కడ అన్నం కూడా పెట్టుకున్న కేకు స్నాక్స్ మాత్రమే పెట్టి పంపించారా ఏంటి అని కేశవ్ అంటాడు. స్టార్ హోటల్ రేంజ్ లో ఫుడ్ పెట్టారు కానీ నాకు మా అన్నయ్య ఫుడ్ అంటేనే ఇష్టం అని నేను వచ్చేసాను అని చక్రి చెప్తాడు. అంతేకాదు చక్రి గోపిక గురించి పొగుడుతూ ఉండగా మహాలక్ష్మి కాస్త సీరియస్ అవుతూనే వస్తుంది. అంత మంచి వాళ్ళైతే ఎందుకు వచ్చేసారు ఫుడ్ కూడా తినకుండా ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చేసారు అని సెటైర్ల వర్షం కురిపిస్తుంది.
మాధవ్ వంటగదిలో ఉండగా మహాలక్ష్మి తనకి సాయం చేస్తూ ఉంటుంది. మహా వంటగదిలో పని చేస్తూ ఉండగా కన్నా అన్నయ్య అంటూ సంతోషంగా వెనకాల నుంచి ఆఫ్ చేసుకుంటాడు. ఏమైందిరా ఎందుకు ఇలా సంతోషంగా వచ్చి వాటేసుకున్నావు ఏమైనా కావాలా ఈరోజు కాలేజ్ లేదా అని మాధవ్ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. నాకు నువ్వంటే ఎప్పుడు స్పెషల్ అన్నయ్య. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అందుకే నేను కూడా సంతోషంగా ఉన్నాను అని మాధవ్ అంటాడు. కర్ణ ఆ మాట అనగానే డబ్బులు ఏమైనా కావాలా అని అడుగుతాడు మాధవ్. ఏంటి అన్నయ్య నేను నీ మీద ప్రేమతోనే వచ్చాను అంటే నువ్వు మాత్రం డబ్బులు అది అంటావు అని కన్నా చాలా ఫీల్ అవుతాడు. ఇక మహాలక్ష్మి తన ఫ్రెండు దివ్య ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉండగా నారాయణ మాత్రం జ్వరంతో బాధపడడం చూసి చాలా బాధపడిపోతుంది..
నారాయణ కు జ్వరం వచ్చింది అని ఇంట్లోని వాళ్ళందరూ చాలా బాధపడిపోతూ ఉంటారు. నారాయణ అందరూ బాధపడుతున్న సరే నాకేం కాదు ఉక్కు లాంటి వాడిని మీ అందరి పెళ్లి మీ పని చూసుకోండి అని అంటాడు.. మహాలక్ష్మి నారాయణను విడిచి వెళ్ళబుద్ధి కాకపోయినా సరే తను నేను చూసుకుంటాను అని చెప్పడంతో ఆఫీస్ కి వెళ్లేందుకు రెడీ అవుతుంది. అందరూ కూడా వెళ్లిపోతారు కానీ నారాయణ అని మాత్రం మాధవ్ విడిచిపెట్టుకున్న తనకి అన్ని సేవలు చేసి జ్వరం తగ్గే వరకు చూసుకోవాలని అనుకుంటాడు. కానీ మాధవను కూడా వెళ్లిపోమని నారాయణ చెప్పగానే తను కూడా వెళ్ళిపోతాడు.. నారాయణ ఒక్కడే ఇంటి దగ్గర కూర్చుని బాధపడిపోతూ ఉంటాడు. ఇది అది మహాలక్ష్మి నారాయణని వదిలిపెట్టి వచ్చినందుకు కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది.
చక్రీ గోపిక ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయదు.. ఏమైంది చక్రికి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. చక్రి తను ఫోన్ చేస్తుంది తనని ఇంకాస్త బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని చక్రి మనసులో అనుకుంటాడు. కస్టమర్లు ఉన్నా సరే గోపిక వరుసగా ఫోన్ చేయడంతో నేను తర్వాత మాట్లాడుకుంటాను అని కష్టమర్ తో అంటాడు. ఇక కారు దిగిన తర్వాత ఏమైంది అని గోపికకు ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఎందుకు ఎన్నిసార్లు ఫోన్లు చేసావు ఏమైనా జరిగిందా అని చక్రి అడుగుతాడు. నువ్వు రాత్రి ఎందుకు వెళ్లిపోయావు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఏమనుకోవాలి అని గోపిక చాలా చాలా ఫీల్ అవుతుంది. కానీ చక్రీ మాత్రం ఎలాగైనా సరే తనకు నిజం చెప్పి దూరం అవ్వాలి అనుకుంటాడు..
సత్య అలాగే తన ఫ్రెండు రాత్రి చక్రి వాళ్ళ ఇంటికి రావడంతో ఏంటి మీరు ఇక్కడికి వచ్చేసరికి అడుగుతాడు. గోపికి నీకెందుకు దూరం పెడుతున్నావ్ తన లైఫ్ లోకి ఎందుకు వచ్చావు అని సత్య అడుగుతుంది. ఏమైంది తనకి ఏంటి తను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది నేను అంతగా ఇష్టపడింది కాబట్టి నీతో ఉండాలి అని కోరుకుంటుంది అని సత్య చెప్తుంది. కానీ చక్రి మాత్రం సత్యకు నిజం చెప్పేలా కనిపిస్తున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్కు మారింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..