Aishwarya Pisse:సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిన నేపథ్యంలో బుల్లితెర, వెండితెర, యూట్యూబ్ అని తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా వల్ల గుర్తింపు ఏ రేంజ్ లో అయితే లభిస్తోందో.. చిన్నపాటి తేడా వచ్చినా.. అంతే విమర్శలు, రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక బుల్లితెర నటి తన భర్తతో కలిసి కనిపించకపోవడం, పైగా వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో లేకపోవడం.. ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో నిజంగానే విడాకులు తీసుకున్నారా? లేక తీసుకోబోతున్నారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వారెవరో కాదు ప్రముఖ బుల్లితెర నటీమణి ఐశ్వర్య పిస్సే (Aishwarya pisse). అగ్నిసాక్షి సినిమాలో గౌరీ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె.. ఆ తర్వాత కస్తూరి, ముక్కుపుడక వంటి సీరియల్స్ లో లీడ్ రోల్ చేసి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. కన్నడలో అన్నపూర్ణ , సర్వమంగళ మాంగల్యే వంటి విజయవంతమైన సీరియల్స్ లో నటించిన ఈమె.. యశ్ హీరోగా నటించిన కన్నడ సూపర్ హిట్ సినిమా ‘సంతు స్ట్రైట్ ఫార్వర్డ్” చిత్రంలో చిన్న పాత్ర చేసి ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
ఇక ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. మరో బుల్లితెర నటి నవ్య స్వామి (Navya Swamy) సోదరుడు హరి వినయ్ (Hari Vinay) తో 2019 జూలైలో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే.. వివాహం తర్వాత చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ పలు వీడియోలు, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసిన ఈ జంట.. అనూహ్యంగా గత కొంతకాలంగా ఒకేచోట కలిసి కనిపించడం లేదు. పైగా ఫోటోలను షేర్ చేయడం లేదు. అంతేకాదు తమ ఖాతాలలో ఫోటోలు డిలీట్ చేయడం గమనార్హం.
ఏం జరిగింది అని అభిమానులు ఆరా తీసేలోపే.. ఇటీవల ప్రముఖ సీరియల్ నటి నవ్యా స్వామి తన ఇంట్లో జరిగిన వినాయక చవితి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నవ్య స్వామి తన ఇంటి వినాయక చవితికి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అందులో నవ్య సింపుల్ లుక్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక నవ్య షేర్ చేసిన ఫోటోలలో తన సోదరుడు హరి వినయ్ తో పాటు ఆమె తల్లి కనిపించారు. అయితే ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో వీటిని చూసిన నెటిజన్స్ ఐశ్వర్య ఎక్కడ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐశ్వర్య ఎవరో కాదు హరి భార్య, ప్రముఖ సీరియల్ నటి.
ALSO READ:ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?
చాలా రోజులుగా ఐశ్వర్య , హరి వినయ్ లకు సంబంధించిన ఫోటోలు అయితే బయటకు రావడం లేదు. నవ్య స్వామి షేర్ చేసిన పోస్టులలో కూడా ఆమె ఎక్కడ కనిపించడం లేదు. దీనికి తోడు నిన్న నవ్య స్వామి షేర్ చేసిన ఫోటోలలో కూడా ఐశ్వర్య కనిపించకపోయేసరికి.. అందరూ వీరిద్దరిపై అనుమాన పడుతున్నారు.. వీరిద్దరూ విడిపోయారా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు .
పైగా వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం , గత ఆరు సంవత్సరాలుగా కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో ఈ రూమర్స్ నిజమే అని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు మాత్రం ఈ జంట సంతోషంగా ఉండాలని , కలిసి జీవించాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు వీరు స్పందించి చెక్ పెట్టాలని అభిమానులు కోరుతున్నారు.