E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode September 27th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  వీరు, ఇషికలను అనుమానించిన మిస్సమ్మలోని ఆరు  

Nindu Noorella Saavasam Serial Today Episode September 27th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  వీరు, ఇషికలను అనుమానించిన మిస్సమ్మలోని ఆరు  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  మనోహరి, పార్థుతో జరుగుతున్న తన పెళ్లి ఆపేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. మనోహరి ఎన్ని ప్లాన్లు వేసినా మిస్సమ్మలో ఉన్న ఆరు వాటిని ఫెయిల్ చేస్తుంది. పెళ్లి జరిగే వరకు మనోహరికి ఎలాంటి చాన్స్‌ ఇవ్వకుండా జాగ్రత్త పడాలని డిసైడ్‌ అవుతుంది. అందుకే డేగ కళ్లతో మనోహరిని కనిపెట్టుకుని ఉంటుంది. అయితే మనోహని తన పెళ్లిని ఆపేందుకు తన మిడ్రుడైన నరరూపరాక్షసుడు వీరును హెల్ప్‌ అడుగుతుంది. వీరు హెల్ప్‌ చేయడానికి ఒప్పుకుంటాడు.

మనోహరిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తుంటే.. వీరు, తన సిస్టర్‌ ఇషికను తీసుకుని పెళ్లి మండపానికి వెళ్తాడు. మనోహరి ఎక్కడుందని మిస్సమ్మను అడుగుతాడు. మిస్సమ్మ మీరెవరు అని అడిగితే.. మనోహరి ఫ్రెండ్‌ అని చెప్తాడు. మనోహరి ఎక్కడ పరిచయం మీకు స్కూల్‌ లోనా..? కాలేజ్‌ లేనా..? అంటూ మిస్సమ్మలోని ఆరు అడిగితే.. అనాథ ఆశ్రమంలో పరిచయం మేము అక్కడే చదువుకున్నాం అంటూ వీరు చెప్తాడు. మిస్సమ్మలోని ఆరుకు అనుమానం వస్తుంది. మీరెవరు అని వీరు అడిగితే.. అరుంధతి అంటూ చెప్పి వెంటనే.. కాదు అరుంధతి వాళ్ల చెల్లెలిని భాగుమతి అని చెప్తుంది. మనోహరి రూంలో ముస్తాబు అవుతుంది అంటూ రూం చూపిస్తుంది ఆరు. వీరు, ఇషిక మనోహరి రూంలోకి వెళ్తారు.

Advertisement

వీరు రావడం చూసి హ్యాపీగా ఫీలవుతుంది మనోహరి. ఏంటి వీరు అంతా రెడీ చేసుకున్నావా..? తను ఎవరు అని అడిగితే.. ఇషిక నా కజిన్‌ అని వీరు చెప్తాడు. ఇషిక కూడా తనను పరిచయం చేసుకుని నువ్వు మా బ్రో చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అంట కదా చెప్పాడు అని ఇషిక అడిగితే.. అవును మేము ఎంత క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అంటే ఒకరి కోసం ఒకరం ఎవరినైనా చంపేంత క్లోజ్‌ అంటూ ఇంతకీ నీ ప్లానేంటి వీరు అని మనోహరి అడుగుతుంది. ఇక్కడ కొంత మందిని సెటప్‌ చేశాను. నువ్వు హోమగుండం దగ్గరకు వెళ్లాక ఎవ్వరూ చూడకుండా ఈ బాంబ్ హోమగుండంలో వేస్తే.. మొత్తం పొగ  కమ్ముకుంటుంది. అప్పుడు నిన్ను ఇక్కడి నుంచి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తాము అని చెప్తాడు.

అలా అయినా నా పెళ్లి ఆగదు వీరు. అమర్‌ ఎలాగైనా నన్ను కాపాడి.. తీసుకొచ్చి మరో ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తాడు అంటూ మనోహరి చెబితే.. మరేం చేద్దాం అంటూ వీరు అడుగుతాడు. పార్థును చంపేయాలి అప్పుడే పెళ్లి ఆగిపోతుంది అని మనోహరి చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు మను తను పోలీస్‌.. పైగా ఐపీఎస్‌ ఆఫీసర్‌ తనను చంపడం అంత ఈజీ కాదు అంటూ వీర చెబితే.. ఇషిక కూడా అదే చెప్తుంది. కానీ మనోహరి అసలు వినదు.. ప్లాన్‌ సేమ్‌ మీరు చెప్పిందే కానీ చివరిలో పార్థును వేసేసి నన్ను కిడ్నాప్‌ చేయండి చాలు అంటూ మనోహరి చెప్తుంది.

Advertisement

అంతా పక్కనే ఉండి వింటున్న యాదమ్మ మాత్రం దీని పెళ్లి వాడి చావుకు వచ్చింది.. దీనికి దీని స్వార్థమే ముఖ్యం వేరే ఏ విషయాలు పట్టించుకోదు అని మనసులో అనుకుంటూ తిడుతుంది.  మనోహరి ప్లాన్‌కు వీరు ఓకే అంటాడు. పార్థును చంపేసి మనోహరిని కిడ్నాప్ చేశాక అమర్‌ను పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేస్తామని వీరు చెబితే.. అమర్‌ ఎంతైనా ఇస్తాడని మనోహరి చెప్తుంది. అందరూ ప్లాన్‌ పకడ్బందీగా అమలు చేయాలని డిసైడ్‌ అవుతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన సుమతి.. బాలు మాస్టర్ ప్లాన్.. చింతామణికి షాక్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం టెన్షన్.. చింతామణి ఇంటికి భాగ్యం.. తిరుపతి ఎంట్రీతో షాక్..

Sunday Tv Movies : ఆదివారం టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ దేబ్‌జనీ నటించిన సినిమాలివే.. అలాంటి సీన్లు చేస్తుందని అస్సలు ఊహించి వుండరు!

రూ.15 లక్షలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన మిథిలేష్..ఈ ట్విస్ట్ ఏంటీ బాసు!

వీడెక్కడ దొరికాడ్రా సామీ.. బాలు గారి గొంతుతో మళ్ళీ రచ్చ లేపిన దైవిక్! సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్!

ఉప్పల్ బాలు వివాదంపై స్పందించిన అమర్‌దీప్ చౌదరి!

Big Stories

Advertisement
×