E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీని కొట్టిన ఆది..చక్రీ కోసం వెతుకుతున్న అన్నదమ్ములు.. మహాకు మళ్ళీ పెళ్లి..

Podarillu Today Episode : చక్రీని కొట్టిన ఆది..చక్రీ కోసం వెతుకుతున్న అన్నదమ్ములు.. మహాకు మళ్ళీ పెళ్లి..
Advertisement

Podarillu Today Episode June 3rd : మాధవ్ మహాలక్ష్మికి ఫోన్ చేసి నిజాన్ని అసలేం జరిగిందమ్మ మహాలక్ష్మి అని మాధవ్ మహాలక్ష్మి కి ఫోన్ చేసి నిజాన్ని కనుక్కుంటాడు.. నిజంగానే ఇదంతా ప్లాన్ ప్రకారం చేసినట్లు ఉంది రా… అసలేం జరిగిందో అర్థం కావడం లేదు అని మాధవ్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు.. ఆది ప్రతాప్ ఇద్దరు కూడా చక్రిని కిడ్నాప్ చేసిన ప్లేస్ కి వెళ్తారు అయితే అక్కడ ఉన్న లేడీ సార్ వాళ్ళు వచ్చారు అని అనగానే.. మా మామ బామ్మర్ది వాళ్లే వచ్చారా? నన్ను కిడ్నాప్ చేయించింది వాళ్లే అనుకుంటాను అని అనుకుంటాడు.

చక్రీని కొట్టిన ఆది..

ఆది అలాగే ప్రతాప్ ఇద్దరు కూడా చక్రీని కలవడానికి అని కిడ్నాప్ చేస్తున్నావా చోటికి వస్తారు.. అయితే అక్కడ రౌడీలతో మాట్లాడి ఆ డబ్బులు జాగ్రత్తగాదని అడుగుతాడు అది.. డబ్బులు జాగ్రత్తగానే ఉన్నాయి. వాడు కూడా జాగ్రత్తగానే ఉన్నాడు అని ఆ రౌడీలు చెప్పగానే వాడికి నేను ఇవ్వాల్సినవి ఇవ్వాలి అని ఆది అనుకుంటాడు.. ప్రతాప్ వద్దని ఎంత చెప్తున్నా సరే.. ఆది మాత్రం నేను బదులు తీర్చుకోవాల్సింది కొంచెం ఉంది వెళ్లి వస్తాను అని అంటాడు.. లోపలికి వెళ్ళగానే చక్రి ఎవరు అని అనుకుంటాడు.. కానీ ఆది మాస్క్ వేసుకొని మరీ చక్రిని ఉతగ్గొట్టేస్తాడు..

అరే బామ్మర్ది నువ్వే నా..

Advertisement

 ఆదిని మాస్క్ లో చూసిన చక్రీ అరె బామ్మర్ది నువ్వేనా నువ్వంటే నాకు అర్థం అయిపోయింది రా.. డబ్బుల గురించి నాటకం ఆడి ఎంత గొప్పగా నటించారు రా అని చక్రి ఆదిని తిడతాడు. అయితే ఆది చక్రి తిట్లను విని ఇంకా రెచ్చిపోయి అక్కడే ఉన్న కర్రను తీసుకొని దారుణంగా కొడతాడు. అసలు ఎందుకు కొడుతున్నావ్ చెప్పి కొట్టరా అని చక్రిని ఎంతగా అడుగుతున్నా సరే తన అక్కసుని వెల్లపుచ్చుకుంటూ కొట్టేస్తాడు. బయటకొచ్చిన ఆది ప్రతాప్ తో వాడు నన్ను గుర్తుపట్టేసాడు నాన్న అని అనగానే అనుమానమే కదా నిన్ను గుర్తుపట్టలేదు కదా ఏం కాదులే పదా అనేసి అంటాడు..

చక్రీ కోసం మహా టెన్షన్..

 చక్రి ఎక్కడికి వెళ్ళాడు తెలియక మహాలక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న లలిత కూడా అసలు ఆ డబ్బులు ఎక్కడికి తీసుకెళ్లాడు ఏంటో అని కంగారు పడిపోతూ ఉన్నట్లు ఉంటుంది. ఆది ప్రతాప్ లను చూసి మహాలక్ష్మి ఎక్కడ చక్రి అని అడుగుతుంది. కానీ లలిత మాత్రం డబ్బులు దొరికాయా వాడు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. డబ్బులు కాదు ఆ డబ్బుల కోసం మనిషిని ఏం చేశారు అని నేను టెన్షన్ పడిపోతుంటే నువ్వు డబ్బులు అంటావ్ ఏంటమ్మా అని మహాలక్ష్మి అంటుంది. ఆ డబ్బులు తీసుకొని చక్రి పారిపోయాడని నాకు సమాచారం దొరికింది అని ప్రతాప్ అనగానే మహాలక్ష్మి సీరియస్ అవుతుంది. ఇద్దరినీ కడిగిపడేస్తుంది..

కేశవకు ఫోన్ చేసిన చక్రీ..

Advertisement

 అక్కడే ఉన్నా కిడ్నాపర్ లో ఒకరైన లావణ్యతో పులిహార కల్పిస్తాడు చక్రి. అయితే ఆమెను అందంగా ఉన్నావ్ అంటూ పొగిడేస్తాడు. రౌడీ లాగా ఇలా తిరగడం కంటే అందంగా అమ్మాయిలాగా రెడీ అయితే చాలా బాగుంటావ్ అని చక్రి అనగానే ఆ లావణ్య అతని మాట నిజమే అనుకొని మురిసిపోతుంది. నిజంగానే అంత అందంగా ఉన్నానా అని అంటున్నా సరే అవును నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అద్దంలో వెళ్లి చూసుకొని అనగానే ఫోన్ అక్కడ పెట్టి లావణ్య వెళ్ళిపోతుంది.. అదే సమయాన్ని వాడుకోవాలని చక్రి అనుకుంటాడు.. ఆ ఫోన్ ను ఎలాగోలాగా తీసుకొని మాధవ్ కి ఫోన్ చేసి తననెవరో కిడ్నాప్ చేశారనే చెప్తాడు. చక్రి నీ కిడ్నాప్ చేశారంటే ఏమైనా చేస్తారేమో అని కంగారు పడిపోతూ ఉంటారు.. రౌడీలకు నిజం తెలుసుకోవడంతో చక్రిని వేరే ప్లేస్ కి మార్చాలని అనుకుంటారు.

మాధవ్ దెబ్బకు రౌడీలు అవుట్..

 చక్రి ఎక్కడున్నాడు అని ముగ్గురు అన్నదమ్ములు బైక్ మీద వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆ కారు కేశవా కి గుద్దేస్తాడు. రౌడీ బయటకొచ్చి సారీ చెప్పినా సరే అందులో చక్రి ఉన్నాడని తెలుసుకొని ఆ కారుని ఫాలో అయ్యి చివరికి పట్టుకుంటారు. మాధవ్ రౌడీలపై విరుచుకు పడడంతో కేశవ కన్న ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏంటి మిమ్మల్ని చూస్తుంటే కొత్తగా ఉంది అని అనగానే నా తమ్ముడు జోలికి వస్తే ఎవరినైనా ఇంతే అని ఆ రౌడీలు అందరిని చితగ్గొట్టేసి చక్రిని కాపాడుతారు. చక్రి నిజం చెప్పడంతో మాధవ్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఉదయం చక్రి సోఫాలో కూర్చొని ఉండగా చూసిన లలిత షాక్ అయ్యి అందరిని పిలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : Gundeninda GudiGantalu Today episode: మీనాకు షాకివ్వబోతున్న చింతామణి.. మీనాకు అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. చివరిలో ట్విస్ట్..

Related News

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Big Stories

Advertisement
×