E-Paper
Advertisement

రికార్డు సృష్టించిన ‘రాను బొంబాయికి రాను’ సాంగ్.. అల్లు అర్జున్ పాటను బీట్ చేసిందిగా?

రికార్డు సృష్టించిన ‘రాను బొంబాయికి రాను’ సాంగ్.. అల్లు అర్జున్ పాటను బీట్ చేసిందిగా?
Advertisement

Ranu Bombay Ki Ranu Song: ఇటీవల కాలంలో ఫోక్ సాంగ్స్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఫోక్ సాంగ్స్ కి మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు కూడా ఫోక్ సాంగ్స్ సినిమాలలో పెడుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో రాను బొంబాయికి రాను (Ranu Bombay ki Ranu)పాట ఎంతలా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ పాట ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అయితే తాజాగా ఈ పాట సరికొత్త రికార్డును సృష్టించిందని చెప్పాలి.

95.6 మిలియన్ వ్యూస్..

సింగర్ రాము రాథోడ్(Ramu Rathod) రాసిన ఈ పాట ఆయన స్వయంగా ఆలపించడమే కాకుండా ఇందులో నటించి సందడి చేశారు . ఈ పాటలో రాము రాథోడ్ జంటగా లిఖిత (Likitha) అద్భుతమైన స్టెప్పులతో ప్రేక్షకులకు మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అయితే ఈ పాట తాజాగా యూట్యూబ్లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఈ పాట యూట్యూబ్ లో 956 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ పాట 2025వ సంవత్సరంలో విడుదలైంది. ఇలా విడుదలైన రెండు సంవత్సరాలకి ఈ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోవట విశేషం. ఇలా ఈ పాట భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోవడమే కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) రికార్డును కూడా చెరిపేయడం గమనార్హం.

బుట్ట బొమ్మ పాట రికార్డ్ గల్లంతు..

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అలా వైకుంఠపురం. ఈ సినిమాలోని బుట్ట బొమ్మ పాట (Butta Bomma Song)ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట యూట్యూబ్ లో 955 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఈ పాటను బీట్ చేస్తూ రాను బొంబాయికి రాను పాట సరికొత్త రికార్డులను సృష్టించింది. అయితే బుట్ట బొమ్మ సాంగ్ 2020వ సంవత్సరంలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇలా ఈ పాట విడుదలైన ఆరు సంవత్సరాలకు 955 మిలియన్స్ వ్యూస్ ప్రయాసం చేసుకోగా రాను బొంబాయికి రాను రెండేళ్లలోనే ఈ పాటను బీట్ చేస్తూ 956 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.

మొదటి స్థానంలో రాను బొంబాయికి రాను..

ఇలా ఒక ఫోక్ సాంగ్ కు ఈ స్థాయిలో ఆదరణ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ పాట ద్వారా రాము రాథోడ్ కెరియర్ కూడా పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఇక ఈ పాటతో ఎంతో ఫేమస్ అయిన రాము రాథోడ్ అనంతరం బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అవకాశం అందుకున్నారు. ఇక బిగ్ బాస్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయిన రాము ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించి వరుస పాటలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక బుట్ట బొమ్మ సాంగ్ తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టే సాంగ్ అధికంగా వ్యూస్ సొంతం చేసుకుంది.

Advertisement

Also Read: బిగ్ బాస్ 10లో నా ప్రయాణం ముగిసింది.. రీ ఎంట్రీ పై రోహిత్ క్లారిటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Related News

బిగ్ బాస్ 10లో నా ప్రయాణం ముగిసింది.. రీ ఎంట్రీ పై రోహిత్ క్లారిటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

నువ్వో చేతకానివాడివి అంటూ హేళన చేశారు: డైరెక్టర్ బాబు

జగపతిబాబు షోలో సుమ,రాజీవ్ సందడి.. బయటపడ్డ పాత ప్రేమ రహస్యాలు!

మూడేళ్లకే ప్రపంచ రికార్డులు.. పొదరిల్లు చక్రి కొడుకు టాలెంట్ కు ఫిదా అవ్వాల్సిందే!

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ బాబు..డేట్ కూడా ఫిక్స్!

కామనర్స్ హౌస్లోకి రీ ఎంట్రీ..మిథిలేష్ దెబ్బకు ముఖేష్ గప్ చుప్ ..!

శ్రీవిద్యను ఆ స్టార్ హీరోయిన్ తో పోల్చిన వర్ష!

Big Stories

Advertisement
×