Podarillu Today Episode November 18th :చక్రి ఇంట్లో కూర్చుని వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే చక్రీకి ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు. వీడు ఇందాక డ్రైవింగ్ కి వెళ్ళినప్పుడు ఏమైనా స్మశానం దగ్గర నుంచి వచ్చాడా ఏంటి? అని కన్నా అలాగే మాధవ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అసలు చక్రి ఏంట్రా ఇలా ప్రవర్తిస్తున్నాడు కొంపతీసి దెయ్యం ఏమైనా పట్టిందా అని కన్నా అలాగే మాధవ ఇద్దరు కూడా భయపడిపోతూ చక్రీకి ఏమైందో కనుక్కోవాలని ధైర్యం చేసే ముందుకు వెళ్తారు.. అసలు చక్రికి ఏమైందో తెలుసుకోవాలి అని మాధవ్ కూడా ముందుకు వెళ్తాడు చక్రీని పరీక్షిస్తాడు. మొదట కాస్త వింతగా అనిపించిన కూడా ఆ తర్వాత చక్రీకి ఏం కాలేదు అని అనుకుంటారు. మొత్తానికి చక్రి తన ఊహలకి కారణం ఏంటి అన్న విషయాన్ని వాళ్ళిద్దరికీ చెప్పి చాలా సంతోషంగా ఉంటాడు.. ఇక తన ఊహలో మహాలక్ష్మితో డ్యూయెట్ సాంగ్ ని వేసుకోవడం గురించి చెప్పి వాళ్లకి షాక్ ఎలా చేస్తాడు. ఆ తర్వాత మహాలక్ష్మి చక్రి డ్యూయెట్ సాంగ్ మాత్రం ఎపిసోడ్కి హైలెట్గా నిలిచింది అని చెప్పాలి.
ఇక శైలు ఎలాగైనా సరే ఈరోజు ముంగిస గాడికి బాగా డబ్బులు చాలా చేయాలి అని పక్క వీధిలో నిలబడి అక్కడ పార్క్ చేస్తున్న బైకులు అన్నిటిని రిపేర్ కి వచ్చేలా చేస్తుంది. అయితే ఈరోజు ఇన్ని బైకులు రిపేర్ అయ్యాయి ఏంటి అని అటు కేశవా చోటు ఇద్దరు కూడా అనుమాన పడుతూనే ఆ బైకులను రిపేర్ చేస్తారు.. ప్రతిరోజు కూడా ఎప్పుడు ఇన్ని బైకులు రిపేరుకు రాలేదు కదరా.. ఫస్ట్ టైం ఇన్ని బైకులు రిపేరుకు రావడం అన్న బ్రో ఈరోజు మన షాపు లక్ష్మీదేవితో కలకలలాడుతుంది అని చోటు కూడా చాలా సంతోషంగా ఉంటాడు.. మొత్తానికి శైలు అక్కడున్న బైకులను పాడు చేసే వాళ్ళని మెకానిక్ షాప్ కి పంపిస్తుంది అని కేశవ తెలుసుకుంటాడు. కేశవ కి అడ్డంగా దొరికిపోయాను అని శైలు కంగారు పడిపోతూ ఉంటుంది..
శైలు కేశవ కి ఎలాగైనా సరే ఇవాళ ఏదో ఒకటి చేసి మంచిగా డబ్బులు సంపాదించేలా చేయాలి అని అనుకుంటుంది. అయితే కేశవా ఎందుకు ఈరోజు అన్ని బైకులు రిపేర్ అవుతున్నాయి అని ఆలోచిస్తూ లోపలికి వచ్చేస్తాడు. పక్క ఉన్న గల్లీలో ఇలా జరుగుతుందని తెలుసుకున్న కేశవా అక్కడికి వెళ్ళగానే శైలు అక్కడ అన్ని బండ్లకి రిపేర్ అయ్యేలా చేస్తుంది. ఇలా జనాలని మోసం చేస్తే మన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు అది చాలా పాపం అంటూ కేశవ శైలుకి ఒక పెద్ద క్లాస్ పీకుతాడు. ఇక శైలు సరే రా నువ్వు చెప్పింది కూడా నిజమే కదా నేను ఇకమీదట ఇలాంటి పనులు చేయను అని అంటాడు. శైలు ఆ మాట అనగానే కేశవ శైలు ఇద్దరూ కలిసిపోతారు..
మహాలక్ష్మి ఇంకా తినడానికి రాలేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.. వదిన ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదు అని కన్నా కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు అయితే బయట బాల్కనీలో ఉన్నట్లుంది నేను వెళ్లి తీసుకుని వస్తానని చక్రి వెళ్తాడు. ఏంటండీ మీరు ఇక్కడ ఒంటరిగా ఉన్నారు నా గురించి ఆలోచిస్తూ ఉన్నారా అని చక్రి అనగానే మహాలక్ష్మి మీకోసం నేను ఎందుకు ఆలోచిస్తూ ఉంటాను ఏం మాట్లాడుతున్నారు అని చక్రికి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది.. మీకు నేనంటే ఎందుకు ఇష్టం లేదు నాకు అర్థం కావడం లేదు అని చెప్పినా సరే మహాలక్ష్మి మీకు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉంది కదా వాళ్ళు ఇష్టపడతారు లే అన్నట్టుగా మాట్లాడుతుంది. కౌన్సిలింగ్ కి వెళ్ళాలి అని మహాలక్ష్మి నిజం చెప్పడంతో చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇకపోతే మహాలక్ష్మి విడాకులు తీసుకోకుండా ఏదో ఒకటి చేయాలి అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు.
మహాలక్ష్మి ఆ మాట అనగానే ఈవిడకి ఇలాంటి ఆలోచన వచ్చింది అంటే కచ్చితంగా నాకు దూరం అవుతుందేమో అని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే చక్రి అందరూ మంచిగానే ఉన్నారు నాకు మాత్రమే ఇలాంటి గతి పట్టింది అని బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడే నారాయణ గురక పెట్టడం చూసి ఎక్కడ ఎలుగుబంటి వచ్చినట్టుంది అని కంగారు పడిపోతుంటాడు. ఇక లోపలికి వెళ్ళగానే మాధవ్ మనిషా తో మాట్లాడుతూ సంతోషంగా ఉండడం చూసి చక్రి ఫీల్ అవుతాడు. అంతేకాదు కేశవ కూడా శైలుతో మాట్లాడుతూ కనిపించడంతో వీడు కూడా ముదిరిపోయాడు అని ఆలోచిస్తాడు. ఇక కన్నా కూడా తన గర్ల్ ఫ్రెండ్ తో మెసేజ్ చేస్తూ కనిపించడం చూసి చక్రి వీడు కూడా మారిపోయాడు నేనొక్కడినే నా ఇక్కడ ఒంటరిగా మిగిలింది అని బాధపడిపోతూ ఉంటాడు.
ఇక చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా కౌన్సిలింగ్ కోసమని కోర్టుకు వెళ్తారు.. అయితే అక్కడికి వెళ్ళగానే వాళ్ళ మాటలు విన్న అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళిద్దరూ ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అని మాట్లాడతారు.. అయితే మహాలక్ష్మి అలాగే చక్రి మధ్య ఏదో జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…