E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ హైలెట్ ట్విస్ట్.. వడ్డీ కోసం కష్టాలు.. మనోజ్ ను కొట్టిన ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ హైలెట్ ట్విస్ట్.. వడ్డీ కోసం కష్టాలు.. మనోజ్ ను కొట్టిన ప్రభావతి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 18th: రోహిణి తన ఫ్రెండ్ మహేశ్వరిని కాస్త మహేష్ లాగా మార్చేసుకుంటుంది. మనోజ్ కి అనుమానం వచ్చేలా చేసి తనకి దగ్గర ఇలా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక తన ఫ్రెండు అలా అనడంతో నీకోసం నేను ఏదైనా చేస్తాను రోహిణి అని సపోర్ట్ కూడా ఇస్తుంది.. దాంతో ఈమధ్య రోహిణి మనోజ్ నాకు దూరమవుతున్నాడు వాళ్ళ అమ్మ మాట వింటున్నాడు.. ఎలాగైనా సరే మనోజ్ నేను నా సొంతం చేసుకోవాలి నువ్వు నాకు సహాయం చేయాలని మహేశ్వరీని అడుగుతుంది. ఇక తన ఫ్రెండ్ అంతగా అడగడంతో నేను కూడా నీకు సహాయం చేస్తానే నావల్ల నువ్వు బాగుపడతావు నీ సంసారం బాగుంటుంది.. అంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను అని తన ఫ్రెండు అనగానే రోహిణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొత్తానికి మనోజ్ ని తన వైపు తిప్పుకునేందుకు రోహిణి ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది..

బాలు సీరియస్..

మీనా తన తమ్ముడు వస్తున్నాడని బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అయితే అక్కడికి వచ్చిన బాలు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అని అడగగానే.. నేను మా తమ్ముడు వస్తున్నాడు అని వెయిట్ చేస్తున్నానండి అని అంటుంది. అయితే రాత్రిపూట సుమతి అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్లి నీకు నాకు సెట్ అవదు. ఇకమీదట మనిద్దరం కలవడం కుదరదు అని చెప్పేసి వచ్చి ఇంట్లో చెప్పి బాధపడిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని శివ ఎలాగైనా సరే బాలుకి చెప్పాలని అనుకుంటాడు.. మీనా బాలుకి శివ ఆ విషయం చెప్పగానే బాలు ఒక్కసారిగా సీరియస్ అవుతాడు వాడు ఒక ఎదవ వాడిని పెళ్లి చేసుకుంటే సుమతి జీవితాంతం ఏడవలసి వస్తుంది అని సీరియస్గా అనేసి వెళ్ళిపోతాడు.. తన చెల్లెలి జీవితం ఇలా మారిపోతుంది అని నేను అసలు ఊహించలేదు అని మీనా చాలా బాధపడిపోతూ ఉంటుంది.

చింతామణి దెబ్బకు షాక్..

Advertisement

ఇక చింతామణి మనిషి ఇంట్లోకి రావడంతో ప్రభావతి ఏంట్రా నువ్వు సరాసరి ఇంట్లోకి వచ్చావు. ఇదేమైనా నీ సొంతిల్లు అనుకుంటున్నావా అని అంటుంది. అయితే నేను ఇంట్లోకి రావడానికి కారణం ఏంటో చెప్తాను అని అతనిని ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం అస్సలు వినకుండా అందరిని ఒక్కసారిగా కేకలు వేసి పిలుస్తూ ఉంటుంది.. ఓ ఇంతమంది ఇంట్లో ఉంటున్నారా అగ్గిపెట్టండి ఇంట్లో ఇన్నమంది ఉంటున్నారా మా చింతామణి అక్క బాత్రూమ్ అంతా ఉంది ఇండ్లు అని చెప్పగానే శృతి మీ చింతామణి బాత్రూంలోనే తిని పడుకుంటున్నా అని అవమానించేలా మాట్లాడుతుంది.. ఆ మాట వినగానే అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు.. అని వడ్డీ గురించి వచ్చాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..

మనోజ్ మాటతో ఫ్యూజుల్ అవుట్..

ఇప్పుడు వడ్డీ కట్టాలి కాబట్టి లక్ష యాభై వేలు వడ్డీని అందరూ తల ఒక యాభై వేలు వేసుకొని ఇవ్వాలి అని బాలు అంటాడు. అరే మీరందరూ కాదురా ముందు ఈ ఉంగరం తాకట్టు పెట్టి ఎంత వస్తదో చూసి మిగిలిన డబ్బుల్ని నేనే అరేంజ్ చేస్తాను అని సత్యం అంటాడు. కానీ బాలు మాత్రం మీ కొడుకులుగా మేమున్నం నాన్న మేము చూసుకుంటాం మీరేం కంగారు పడకండి అని అంటారు. అయితే రవి బాలు ఇద్దరు కూడా మేము డబ్బులు కడతాము అని అంటారు. కానీ మనోజ్ మాత్రం ఇప్పటికిప్పుడు 50 వేలు అంటే నా వల్ల కాదు అని చేతులెత్తేస్తాడు. నువ్వు ఇలా మారిపోతావని నేను అసలు అనుకోలేదు అని అందరూ ఎంతగా అంటున్న సరే మనోజ్ మాత్రం నేను అసలు కట్టను నాకే సంబంధం లేదు అని అంటాడు. ఈ ఇంటిని ఇచ్చేద్దాం పోతే పోయింది అని అనగానే ప్రభావతి ఒక్కసారిగా సీరియస్ అవుతుంది.

రెచ్చిపోయిన ప్రభావతి..

Advertisement

ప్రభావతి మనోజ్ మాటలు విని ఏంట్రా ఈ ఇండ్లు నీకు పాతది లాగా కనిపిస్తుందా? ఇంతమంది సంసారాన్ని గుర్తుగా చూసుకుంటున్న ఈ ఇంటిని పోతే పోనీలే అని నువ్వు అంటావా? కొంచమైనా బుద్ధుందా నీ వల్లే కదా ఈ ఇల్లు పోయే పరిస్థితి వచ్చింది అంటూ మనోజ్ పై రెచ్చిపోతుంది. అయితే మనోజ్ మాటతో ప్రభావతి చాలా సీరియస్ అవ్వడం చూసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వే కాబట్టి మొత్తం వడ్డీ డబ్బులు నువ్వే కట్టాలి అని ప్రభావతి అంటుంది. నీవల్ల ఇంట్లో నేను తలెత్తుకో లేకుండా పోయాను. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు నిన్ను నేను పెంచి తప్పు చేశాను అంటూ ప్రభావతి ఎమోషనల్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత అందరూ కలిసి మనోజ్ ని తిడతారు.

మీనాపై బాలు కోపం..

బాలు తన దగ్గర 50,000 లేవు ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన మీనా తన దగ్గర 40 వేలు ఉన్నాయి తీసుకోండి అని ఎంత చెప్పినా సరే బాలు మాత్రం నీ డబ్బులు నాకు అసలు అవసరమే లేదు అని అంటాడు.. ఎందుకు నా డబ్బులు మీ డబ్బులు అని వేరు చేస్తున్నారు ఏమైంది అని అనగానే సుమతి విషయంలో మీరు ఒక నిర్ణయానికి వచ్చారు కదా నేను కూడా నా నిర్ణయాన్ని మార్చుకోను అని బాలు అంటాడు కానీ మీనా ఎంత చెప్పినా సరే బాలు మాత్రం డబ్బులు తీసుకోకపోవడంతో మీనా చాలా బాధపడిపోతుంది ఎలాగైనా సరే ఈ డబ్బులు మీరు తీసుకునేలా చేస్తాను అని అనుకుంటుంది. ఇక బాలు మాత్రం తనకి కావలసిన 50 వేల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అటు శృతి రవికి సాయం చేసి మంచి భార్యగా పేరు తెచ్చుకుంటుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఇంటి కోసం ఎమోషనల్ బాండింగ్ గురించి చక్కగా చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Podarillu Today Episode : శైలు మారిపోయిందా..? మహా మాటతో ఫ్యూజుల్ అవుట్.. విడాకులు కన్ఫార్మ్..!

Related News

Podarillu Today Episode : శైలు మారిపోయిందా..? మహా మాటతో ఫ్యూజుల్ అవుట్.. విడాకులు కన్ఫార్మ్..!

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా ఇరుక్కున్న సాగర్.. అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రేమ దెబ్బకు ధీరజ్ షాక్..

Brahmamudi Serial Today Episode November 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రఘువీర్ కు వార్నింగ్ ఇచ్చిన రాజు 

Intinti Ramayanam Today Episode: రమ్యకు తీవ్రని అన్యాయం..పల్లవి ఎంట్రీతో షాక్.. రమ్య, కమల్ పెళ్లి..?

గాజుల గలగలతో సెన్సేషన్.. ఇప్పుడు వరుస ఫోక్ సాంగ్స్‌తో రచ్చ చేస్తున్న రాధమ్మ కూతురు!

Wedensday TV Movies : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మిస్ కావొద్దు..

పాలమూరు జంగిరెడ్డి పాటలకు ఫుల్ క్రేజ్.. పల్లె గొంతుక నుంచి సినిమా పాటల వరకు!

Big Stories

Advertisement
×