Jangireddy Folk Songs:ఏషనాగుల కట్ట మీద అంటూ వరల్డ్ వైడ్ తెలుగు మ్యూజిక్ లవర్స్ ని ఒక ఊపు ఊపేశాడు జంగిరెడ్డి. ఇక ఆయన గొంతు నుండి జాలు వారిన ఆయా షేర్ పాటకి అయితే చిన్న పిల్లల నుండి పెద్ద వారిదాకా కాలు కదపని వారు లేరంటే ఆశ్చర్యం లేదు. మరి తాజాగా తనవైన పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ జంగిరెడ్డి నేపథ్యం ఏంటో అసలు ఏ ఏ పాటలు పాడాడో ఒకసారి చూసేద్దాం.
తనదైన అధ్బుతమైన గొంతుతో ఆడియన్స్ ని అలరిస్తున్న జంగిరెడ్డి పూర్తి పేరు అడ్డుల జంగిరెడ్డి.ఈయనది మహాబూబ్ నగర్ జిల్లా బిజినపల్లి మండలం, మహాదేవుని పేట అనే గ్రామం. 1994 అంటే దాదాపు ముప్పయి రెండేళ్ళ నుండి సింగర్ గా భక్తి పాటలు, జానపదాలు.సమాజాన్ని చైతన్యం చేసే పాటలు ..ఇలా అదీ ఇదీ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాటలు పాడుతూ అభిమానులని అలరిస్తూనే ఉన్నాడు జంగిరెడ్డి.
పాటల విషయానికి వస్తే
జంగిరెడ్డి పాడిన పాటల విషయానికి వస్తే నాగులో నాగమ్మ,మావా సుందరయ్య,మొగుడమ్మ మొగాడే,మందులు మందులు .మావో మల్లేశా, దుబ్బ సెలుకకాడ అంటూ ఇపుడు యూట్యూబ్ ని షేక్ చేస్తున్న పాటలన్ని ఈయన గొంతు నుండి జాలువారినయే.
ఇక జానపదాలే కాకుండా ముక్కంటి తనయుడు,పావన పడునెట్టంబడి,ఓం ఓం అయ్యప్ప,శబరీశ శరణు,బయలెల్లి నాదమ్మ బంగారు బాలుడు,ఎల్లింది చూడరా పలహారం బండి, జోరు మీద సాగేటి జాతర,గల్లు గల్లు గజ్జెలు కట్టి రావే అంటూ ఎన్నో అయ్యప్ప పాటల్ని పాడి అయ్యప్ప భక్తులకి ఇష్టమైన సింగర్ గా మారిపోయాడు.ఇక hmటీవీ లో వచ్చిన మార్మోగిన పాట అనే ప్రోగ్రాం లో పల్లె పల్లె నా పల్లేరు మొలిసే పాలమూరులోనా అంటూ పాడి ఒక సెన్సేషన్ అయిపోయాడు.
అయితే ఇలా ఎన్నో జానపదాలు,భక్తి గీతాలు పాడినప్పటికీ జంగిరెడ్డి కి ఈ మధ్య బాగా గుర్తింపు తెచ్చినవి సినిమా పాటలనే చెప్పాలి.ముఖ్యంగా దసరా సినిమాలో కాసర్య శ్యాం రాసిన దూమ్ దామ్ దోస్తాన్ పాటతో ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు..గొట్టె కనకవ్వ, రాహుల్ తో కలిసి పాడిన ఈ పాట ఏకంగా 24 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టడం విశేషం.
ఇక ఇదే శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో వచ్చిన ప్యారడైజ్ సినిమాలో ఆయాషేర్ ,ఏష నాగుల కట్ట మీద అనే పాటలు పాడి ఒక్కసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు. ముఖ్యంగా సినిమా ఆడకపోయినప్పటికీ ఆయా షేర్ పాట అయితే సోషల్ మీడియాలో ఒక రికార్డ్ అని చెప్పాలి.ఈ పాట ఇప్పటికి 288మిలియన్ల వ్యూస్ కొట్టిందంటే జంగిరెడ్డి గాత్రం ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకుందో అర్థమవుతుంది.
ఇక ఏషనాగుల కట్ట మీద అంటూ ఇదే సినిమాలో పాడిన మరో పాట కూడా ఇప్పటికి ఏకంగా 238 మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుని మరింత దూసుకుపోతుంది.చూడాలి మరి ప్రస్తుతం తనదైన గొంతుతో ఫోక్ ఇండస్ట్రీని ,సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్న గంగి రెడ్డి ముందు ముందు ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో !
ALSO READ :బిందె పాటలకి ఈ క్రేజ్ ఏంటి మావా ..మాధురి రాథోడ్ నుండి యమునా తారక్ దాకా !